"ప్రదోషం రజనీముఖే" ఆర్యోక్తి.ఆ సమయ ప్రాశస్త్యమును తెలియ్స్చేయునది శివ తాందవ స్తోత్రము.
శివము అంటే నిత్యము-సత్యము అయిన మూలము.అది నిరాకారముగా నున్న భావనలో.ఆ మూలము తాను నిశ్చలముగా నుండి సకల చరాచరములను స్పందింపచేయుటయే తాండవము.ఇతిహాసము అనగా ఈ విధముగా జరిగినది అని చెప్పబడు సాహితీవిధానము.నిశ్చలమైన తత్త్వమును తెలిసికొనవలెనన్న దాని చుట్టు చలించుచున్న మరొక ఉదాహరనమును చూపితేగాని అర్థము చేసికొనుట కష్టము.కనుక సనాతనము నామరూపములను ప్రకటించేసినట్లు,ఆ ప్రకటిత స్వరూపము ఒక సభాస్థలిని-సమయమును-సందర్భమును,స్వభావమును వివరిస్తూ,సాక్షాత్కారమును కలిగిస్తూ,సత్కృపను వర్షిస్తుంది.దానిని అందుకొనుటకు హృదయమనే పాత్రను శుభ్రపరుస్తుంది.సిద్ధము చేస్తుంది.ముద్దు తీరుస్తుంది.దానికి ఉదాహరణమే మనము చర్చించుకునే "శివతాండవ స్తోత్రము".వేదిక కైలాసము.సమయము ప్రదోషము.సందర్భము రావణ దర్శనము-అనుభవము." సాహిత్యము పంచ చామర వృత్తము.పూజావసాన సమయమున స్తోత్ర పఠనము సర్వార్థసాధకమని చెప్పబడినది ఫలసృతిగా.ఈ స్తోత్రము 15 భాగములుగా/శ్లోకములుగా వానిలో రెండు ఫలశృతిగా,మిగిలిన 13 భక్తుని ఆకాంక్షగా స్వామి తాండవ సంరంభము,సాక్షాత్కారము,సాఫల్యతను తెలియచేస్తుంది.భక్తుని ఆర్ద్రతను మార్దవముగా తెలియచేస్తుంది.శబ్దము హృదయఘోషకు అద్దము పడుతుంది.అర్థము పరమార్థతకు ...సోపానమవుతుంది.
సర్వేజనా సుఖినో భవతు అన్న సుభాషితమే శివ- తాండవ - స్తోత్రము.
మొదటి స్లోకము
1. .తనోతు న శివః శివం అంటూ ముగుస్తుంది.శుభములకు ప్రతినిధియైన పరమాత్మ తన తాండవము ద్వారా సకల శుభములను విస్తరించుగాక అని మంగళాశాసనమును చేస్తున్నది.ఒక సారి పరిశీలిద్దాము.
ఏక బిల్వం శివార్పణం.
No comments:
Post a Comment