మైత్రి,సృష్టి వైచిత్రి
*****************
మధుర సృష్టి వైచిత్రి
అరమరికలు లేని మైత్రి
.......................
గాలితోటి ఇసుకమైత్రి
గగనమునకు ఎగురుతుంది
నీటి తోటి ఇసుకమైత్రి
నేల కృంగి పోతుంది
మిత్రలాభ-మిత్ర భేద వైరుధ్యములది మైత్రి
...........
అంగములన్నిటిలోను
అంగరంగ మైత్రి
చూపేమో రెండుకళ్ళ నిండుమైత్రి
వినుటేమో రెండు చెవులమెండుమైత్రి
పలుకేమో రెండు పెదవుల కులుకుమైత్రి
నడకేమో రెండుకాళ్ళ విడని మైత్రి
ద్వైతములో అద్వైతమును తెలుపు అద్వితీయ మైత్రి
..............................................
ప్రాణభయము తరిమెను పావురముల మైత్రి
పాములను చంపినది చీమతల్లుల మైత్రి
కరులబాధ తొలగించెను కుందేళ్ళ మైత్రి
రిపుల సంహరించెను కపివరుల మైత్రి
....................................
జీవన సంజీవనిలో
రాజీవము మైత్రి
గమనమేమో రేయిపవల మైత్రి
జననమేమో జననీజనకుల మైత్రి
ఊపిరేమో శ్వాసనిశ్వాసముల మైత్రి
మంచీ,చెడు మనసు,బుద్ధి మైత్రి
..................
మాయదారి మరబ్రతుకులో
మరుగున పడినది మైత్రి
మరమ్మత్తు చేసుకుందాం
దాని గమ్మత్తును తెలిసికుందాం.
No comments:
Post a Comment