ఒంటరి మేఘం
**************
ఒంటరి మేఘంలా
మింటను దిగులుగా
వెంటాడే దు:ఖంతో
జంటగా సాగుతుంటే
తలవని తలపుగా
తారస పడ్దాయి
మెచ్చుకోలు రూపాలుగా
పచ్చనైన పూలు
కిలకిల కేరింతలతో
చిరుగాలుల జావళులకు
తలలూపుచు మోహనముగా
ఆహా! అనిపించేలా
ఏటిగట్టు చెలిమితో
అలల పలకరింపులకు
తలపడుతూ పోటీగా
రాగం! వినిపించేలా
మిస మిస పరుపులతో
సువాసనల తరలింపుకు
తలవాలిచి ముద్దుగా
సేవే! కనిపించేలా
కనలేమని కలవరముతో
తామె వచ్చు ఊహలకు
తలమానిక ధర్మంగా
అందం! అదిరిందనేలా.
( శ్రీ వర్ద్స్ వర్త్ గారి డఫడల్స్ స్పూర్తితో -- )
నిమ్మగడ్డ సుబ్బ లక్ష్మి.
No comments:
Post a Comment