చిదానందరూపా-4
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
కాముని చంపినవానికి చేయు ఆ గుగ్గిలపు సేవ
క్షామమునింపగ ఇంటను,తినుబండారములను
చేకొని రావగ,చేత తాళితో శివ శివ అనుచు,భక్తి
నిగ్గుతేల్చగ కదిలెను ఆ, బుగ్గిపూతలవాడు
గుగ్గిలమునమ్మువానిగా బిగ్గరగ అరచుచు, సమీపించగ
మొగ్గును చూపి కలయ, గుగ్గిలమంతయు పొందె తాళితో
లింగము వంగిన వేళను, తాళక తనమెడ ఉరిబిగించె
స్వామి ఆలింగనమును పొందగ ఆ గుగ్గిలము కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
సంబరేను చెట్టువలన గలిగిన ధూపద్రవ్యము సాంబ్రాణి.పది సుగంధ వృక్షముల బెరడు,కాడ,ద్రవము,ఆకు మొదలగు వానినుండి దశాంగములతో కూడిన గుగ్గిలమును ధూపముగా వేస్తూ "త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం " అంటూ తిరుక్కడవూరులోని అమృత కలశేశ్వరుని అర్చిచు మహా భక్తుడు గుగ్గిల కలశ నాయనారు.
దేవతలు అసురులు అమృత కలశముతో తిరుక్కడవూరికి వచ్చారట.ఆ కలశమును నేలపై ఉంచి ,స్నానము చేయుటకు నదికి వెళ్ళి వచ్చు సరికి ఈశ్వరేచ్చగా ఆ కలశము లింగముగా మారిపోయినదట.మార్కండేయుని మృత్యుంజయుని చేసిన అభిరామాదేవి సహిత అమృతేశ్వర స్వామి మనగుగ్గిలపు కలశ నాన్యనారుని భక్తిని మథించి లోకపూజ్యతను ప్రసాదించాడు.
సుగంధధూపములు దశాగంతో వేయబడునవి.జ్ఞానేంద్రియ-కర్మేం ద్రియములను సుగంధభరితము చేయుచు చేయు అర్చన ఆ నాయనారుది.తనభార్య మాంగల్యమును అమ్మి గుగ్గిలమును కొని దానిని స్వామికి అర్పించుచు పరవశించు శివ ధ్యానీ.పాలున్ బువ్వ యు పెట్టెదన్ అని ధూర్జటి ప్రస్తావించిన శివుడు వాత్సల్య లక్ష్మి లీలావచనములన్నట్లు నాయనారు కుటుంబమును సర్వైశ్వర్యములతో తులతూగునట్లు చేసినాడు.ఇదిలా ఉండగా నాయనారు భక్తికి పతాక సన్నివేశమన్నట్లు సద్యోజాతుడు గొడగూబ అన్న ఒక చిన్ని బాలికచేత ఒక తుమ్మిపువ్వునుంచి తనకు పెట్టమన్నాడు.లింగము చాలా ఎత్తుగానున్నది పాపకు అందదు.నింగిని తాకు జటలున్నవాడు కిందికి వంగి పువ్వును స్వీకరించాడు.లింగము వంగినదని దానికి ఇనుపగొలుసులు కట్టి ఏనుగులచే లాగించ సాగారు.ఉబ్బు లింగనికి దెబ్బ తగిలిందని,ఆగొలుసు తన మెడకు బిగించుకున్న గుగ్గిలపు నాయనారును అనుగ్రహించిన ఆ సదా శివుడు మనందరిని అనుగ్రహించును గాక.
No comments:
Post a Comment