1.లంకాయాం శాంకరీదేవి-కామాక్షి కంచికాపురి.
**************************************************
సంస్కృతములో శ్రీ అంటే భవ్యమైనది.లంక అంటే తేజస్సుగల భూమి లేక ద్వీపము.జలావృత భూభాగము లంక.ఇక్కడ పడిన మాయాసతి మొలభాగము శాంకరీదేవిగా ప్రకాశించుచున్నది.త్రికోణేశ్వరుడు అయ్యవారు.దక్షిణసముద్రతీరముననున్నది.ఇక్కడ పార్వతీదేవి శివలింగము లోపల కొలువై భక్తులకు దర్శనమిస్తారు.స్థపురాణ కథలను బట్టి ఒకసారి ఆదిశేషునిలో వాయుడేవునిలో అహము ప్రవేశించి విపరీత పరిస్థితులకు దారితీసెను.దాని పర్యవసానముగా శివుడు దక్షిణతీరమును కైలాసముగావించ దలచెను.
శివుని ఆన గాన అమ్మవారి మదిలో లంకలో ఒక అపురూప సుందర భవనమును నిర్మింపచేసుకుని సకుటుంబముగా నివసింపదలచెను.ఆమె ముచ్చట తీర్చుటకు శివుడు విశ్వకర్మచే పరమాద్భుత భవనము నిర్మింపబడేను.గృహప్రవేశ పౌరోహిత్య అవకాశము రావణుని వరించినది.భవనసౌందర్యమునకు మోహితుడైన రావణుడు పూజానంతరము ఆ భవనమును దక్షిణగా కోరెను,(ధర్మముకాదని తెలిసియు)కరుణాంతరంగ అందులకు అంగీకరించి రావణుడు ధర్మము తప్పనంత కాలము ఊండుటకు అంగీకరించెను.సీతాపహరణ సమయమున అమ్మమాటలు పెడచెవిన పెట్టిన రావణుని విడిచి తిరిగి విభీషణ పట్తాభిషేకానంతరము ప్రసన్నురాలై లంకను ప్రవేశించి మనలను పరిపాలిస్తున్న అమ్మ పాదాలను శరణువేడుదాము.
శ్రీ మాత్రే నమ:

No comments:
Post a Comment