Thursday, October 12, 2017

NAAYANAARLU


  సత్-చిత్-రూపులారా సాక్షాత్ సదాశివుడు తన డమరుకమునుండి విలక్షణ నయనార్ల చరితములను, కరుణాకటాక్ష అక్షర వానలను మనపై కురిపించదలిచాడు.నాయనారు అంటే పరమపూజ్యుడు అని అర్థము. భగవంతునికి- భక్తునికి మధ్యగల అవినాభావ సంబంధపు అద్భుత లీలలను అసలేమి తెలియని నా చేయి పట్టుకొని మురిపెముగా పెరియ పురాణకథలను,కార్తీకమాస శుభ సందర్భముగా తానే వ్రాసుకొన్నాడు.కాని ఇంతలో నా అజ్ఞానము చేతిని విడిచిపెట్టి నవరత్నమాలికా సదృశమైన నాయనార్ల కథలలో కొన్ని గులకరాళ్ళను చేర్చుతూ, తనపని తాను చేసుకుపోయింది.రాయిని సైతము సాలగ్రామములుగా సవరించుచు మనకు అక్షయ ముక్తిఫలములను ప్రసాదించదలిచాడు ఆ పరమేశ్వరుడు.కావున గుణదోషములను వదిలి (స్థల-సంఖ్య-పేరు) శివ సన్నిహితులమై,స్మరించి-తరించుదాము రండి.నా సాహసమును మన్నించి సదాశివుడు మందహాసముతో మనలనందరిని ఆశీర్వదించును గాక.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...