సౌందర్య లహరి-60
పరమ పావనమైన నీ పాదరజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
ఆధారము ఆధేయము రెండు నీవేనని
ధ్యానము ధ్యాత ధ్యేయము మూడు నీవేనని
బాల్య కౌమార యవ్వన వార్ధక్యము నాలుగు నీవేనని
నీరు నిప్పు నింగి నేల గాలి ఐదు నీవేనని
కామక్రోధాది గుణదోషములు ఆరు నీవేనని
తిర్యక్ జడములు నరులు అంతా నీవేనని
నవావరణలోని ననవోన్మేషమూర్తి నీవు
పిపీలకాది బ్రహ్మాండము నిర్ద్వందము యగుచున్న వేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి.
No comments:
Post a Comment