చిదానందరూపా-అప్పడి ఆడిగళ నాయనారు
***************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
శివభక్తుడు తిరునవుక్కరుసరునకు భక్తుడు అప్పడి ఆడిగళు
తిరునామము స్థిరముగ నిలుపగ ప్రతివస్తువు సార్థకతనొందె
చెలువపు భక్తితో సాగుచు చలివేంద్రము నొక్కటిగాంచె తిరునవుక్కరుసరు
వివరము సేకరించి వరమీయగ ఆతని ఇంటికేగె శివయోగిగ
అతిశయ భక్తితో స్వాగతమిచ్చి అతిథికి ఆరగింపుగా
అమృత పంచభక్ష్యములు అర్పణ చేయగ అరటి ఆకులో
కోయగబోయిన వానిసుతు చేతిపై వేసెను పాముకాటు
సడలని వారి భక్తి సర్వేశునిపొందగ కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలుతీర్చుగాక.
అప్పూది ఆడిగళ్ అంటే సేవకునికి సేవకుడు.తిరునావుక్కరుసు పరమ శివ భక్తుడు.తిరునావుక్కరుసు భక్తుడు అప్పూడి ఆడిగళ్ నాయనారు.భ్కతుని ఔన్నత్యమును విని అతనిని చూడకనే భక్తుడాయెను.తన పెద్ద కుమారునికి మాత్రమే కాకుండ ఇంటిలోని ప్రతివస్తువునకు తిరునావిక్కరసు పేరును పెట్టుకొని తన భక్తిని చాటుచుండెను.ఒక వేసవిలో తన ఇంతికి కొంచము దూరములో ఒక చలివేంద్రమును బాటసారులకు పెట్టి ఆ కుండకు నాలుగు వాఇపుల తను నమ్మిన వాని పేరును అందముగా భక్తితో ముద్రించెను.ఆ దారిని పోవు తిరునావుక్కరసు తలయెత్తిచూడగా చలివేంద్రము కూడా తన పేరుతోనేవిరాజిల్లుచుండెను.సేద తీరుచున్న బాటసారులను సమీపించి వివరములను అడుగగా వారు ఆడిగళ్ భక్తి ప్రపత్తుల గురించి వివరించి,సివయోగిని ఆడిగళ్ ఇంతి త్రొవను చూపిరి.
అనన్య భక్తితో అతిథిని సేవించి దేవతార్చనకు తమ ఇంటిని అనుగ్రహించమని వేడుకొనిరి.వారి భక్తి లోకవిదితమును చేయుటకు విచ్చేసిన విసేష అతిథి అందులకు అంగీకరించెను.పంచభక్ష్యములను పరమప్రీతితో సమర్పించగ సిద్ధమై పెరటిలోని అరటి ఆకును కోసితెమ్మని తమ పెద్ద కొడుకైన తిరునావుక్కరుసరుతో చెప్పిరి.నాగాభరణుడి ఆటగా నాగుపాము ఉడిచేతిపై కాటువేసినది.మర్రిచెట్టు కు వేప పుట్టదు.అతిథి సేవకు ఆలస్యము కారాదని,వెంటనే ఆకును తల్లికి ఇచ్చి,గబగబ గడప బైతికి వచ్చి,నురుగులు కక్కుతు పడిపోయెను.విషయమును గ్రహించిన వారు,ఏ మాత్రము చలించక నిష్కళంక భక్తితో అతిథికి వడ్డించిరి.అంతలో అతిథి వారి పెద్ద కుమారుని కి తన పక్కన వడ్డించిన తాను భుజించెదనని,ఒక్కడినే భుజించుట దోషమని పలికెను.వారుఎంత బ్రతిమాలినను వినలేదు.చివరికి నేను వానిని పిలుస్తాను మీరు మా ఇద్దరికి వడ్డించండి అని వత్సా భోజనమునకు రమ్ము అనగానే నిద్రనుండి లేచి వచ్చినట్లు సజూవుడై వచ్చి స్వామి ప్రక్కన కూర్చుని భుజించెను.దుఃఖమును లీలగ కల్పించి తనకరుణతో దానిని దూరముచేసిన ఆ సదా శివుడు నమ్మిన వారికి కొంగు బంగారము అయి రక్షించును గాక.
No comments:
Post a Comment