"లంచం"దండకం
===============
దాసోహమమ్మా,ఇహలోక సంచారిణి,
బహురూప వరదాయినీ,చిద్రూప చింతామణి.
ఓ విదుషీమణీ
మస్కాలకు,నమస్కారాలకు ఆస్కారమే లేదంటు శూన్యమై,
ధన,కనక,వస్తు,వాహనాదులకు ఆస్వాదనే వేదమంటు సూక్ష్మమై, మనోవాక్కాయ కర్మాభిలాషలను భేషుగ్గా అందించు ప్రత్యక్షమై,
ఓ శుభలక్షణా
తూర్పు తిరిగిన దండంబునకు ఓదార్పుగా
పడమర చేరి కనుమరుగవని ఓ నేర్పుగా ఉత్తరువులందించు ఉత్తరపు ఓ మార్పుగా ప్రదక్షిణలు చేయించు ఓ కూర్పుగా
ఓ పరాత్పరీ
వీలుకానిదేదీ లేని పలు వీలునామాల నందించు వకీలుగా
నైవేద్యో నారాయణో హరి కీర్తింపబడుచున్న ఆచారిగా
మిథ్య విద్యాలయాలఓ గుణపాఠాలు నేర్పించే ఒకే ఒజ్జగా
తడిసిన ఇరుచేతుల వరముల జడివానలు కురిపించు ఓ వరుణిడిగా
అలివేణి కరుణామయి నీవు
తాత్సారపు వాత్సల్యమా కార్యాలయాలకేరింతలాడు ఉత్సాహమా తారుమారులకు వీరతాడగు ప్రోత్సాహమా తాను జతకూడనను వాని బతుకు జుగుప్స వా
ఓ ఈప్సిత ప్రదాయినీ,
మూఢులు కాంచనంబొల్లకే ఇనుము కోరు చందంబున, ఉంచమని అందిస్తూ,లంచమని నిందిస్తూ,తుంచమని చిందులేస్తుంటే. సూతుడు శూరతనొందుట,శూరుడు నిర్వీర్యుడగుట(కర్ణుడు, ఏకలవ్యుడు) వరవిక్రయ క్రయములు,పూర్ణమ్మ ఆక్రందనలు, మహరాణుల అరణములు,విడిపోయిన భరణముల వివరణలు కావాలంటూ ,చిరు మందహాసములు చిలికిస్తూ, నయగారములు ఒలికిస్తూ,నిలదీసినావమ్మా నీ చాకచక్యముతో
ఓ లోకేశ్వరీ
నీలాపనిందలను తొలగించ వేలాది మార్గాలున్నాయని,
అక్షరాలు చేర్చుకొని అదృష్టము మార్చుకోవచ్చని
వాస్తు కుస్తీలతో మస్తీలనే చేయొచ్చనీ, అంకెలో, లంకెలో పొంకముగా,
నీ అంకమున కూర్చుండగా, మా వాంచితములను తీర్చు "లాంచనం"గా నీ పేరునే మార్చేసుకుని, ఔరౌరా అనిపించుకున్న నిన్నెరుగ నేనెత వాడినమ్మా,
నీ లీలలు ఎరుంగని నన్ను అవలీలగా మన్నించి, నాకు కనువిప్పు కలిగించి,
బహు మెప్పు తరలించి, కొంగు బంగారమై, నన్నేలు ఓ కల్పవల్లీ నీవే సమస్తంబు ,
నమస్తే నమస్తే నమో నమః.
vimala kowtha (not to blame anyone.)
|
Thursday, November 2, 2017
LAMCHAM DAMDAKAM.
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-13
. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment