చిదానందరూపా-నరసింగ మునై నాయనారు
************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
నరసింగ మానై నాయనారు తిరుమానైపాడి ముఖ్యాధికారి
పరమ పవిత్రులైన శివభక్తుల ఉపకారి
ఎదురయిన భక్తులకు సాదర మర్యాదలతో పాటుగ
వంద బంగారు నాణెములను ఆనందముగా దక్షిణనిచ్చు
సాక్షాత్తు శివుడు దక్షిణ తాంబూలములను స్వీకరింప
ప్రత్యక్షమయినాడు నాయనారు ముందు శివ భక్తునిగ
సహనము-సంస్కారము సర్వేశ్వరుని తెలియచేసినదిగ
దక్షిణామూర్తి కరుణను పొందగ దక్షిణలే కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
No comments:
Post a Comment