చిదానందరూపా-శిరుతొండ నాయనారు
**************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
పరంజ్యోతి తిరువెంగాడునంగై పరమశివ భక్తులు
రాజాజ్ఞగా వృత్తికన్న ప్రవృత్తిది పైచేయి అయినది
శివభక్తునికి భోజనమునిడి కాని భుజియించని నియమముగా
ఆతిథ్యమును కోరిన యతి అత్తిచెట్టు క్రింద నుండె
ఆరు నెలలకొకసారి ఆ దినమున నరమాంసము తన ఆహారమనె
ఐదేళ్ళ బాలుని అమ్మ-నాన్న తెగకోసి వండి వడ్డించాలనె
కాదనలేని విధంబున వారి కాళ్ళకు బంధమును వేసె
కామితార్థమునీయ కఠిన పరీక్షయే కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చుగాక.
పరంజ్యోతి-తిరువెంగాడి నంగై పరమశివ భక్తులు.రాజాజ్ఞగా వృత్తికన్న ప్రవృత్తికే పైచేయి యైనది.శివ భక్తునకు భోజనమిడికాని తాము భుజియించెడి వారు కారు.చిద్విలాసముగా వీరి నియమము ఎంత నిర్లమైనదో లోకమునకు తెలియచేయాలనుకొన్నాడు.వెంటనే సివయోగిగా వీరి ఇంటికి అతిథిగా వచ్చెను.యజమాని వచ్చిన తరువాత తాను ఆతిథ్యమునకు వచ్చెదనని,అంతవరకు గణపతి గుడిలో నున్న అత్తిచెట్టు క్రింద ఉందుననిచెప్పి వెడలెను.విషయము తెలిసి కొనిన పరంజ్యోతి పరమసంతోషముగ అతిథి వద్దకు వెళ్ళగా,తనకు ఒక నియమము కలదని,ఆరు మాసములకొకసారి ఐదేళ్ళ బాలుని,అతని తల్లితండ్రులు స్వయముగా కోసి వడ్డించిన ఆహారమును భిక్షగా స్వీకరింతుననెను.ఏ మాత్రమును సంకోచించకుండా అందులకు అంగీకరించి,అమిత భక్తితో ఆహారమునుసిద్ధము చేసిరి.అతిథికి వడ్డించబోగా వారిని చూచి యోగి తన పక్కన వరొకరు కూర్చుని తినవలెనన్నాడు.వారు ఎంత బ్రతిమాలినను వినకుండ మీ అబ్బాయినే పిలవండి అంటూ,తనే శ్రీయాళా అని పిలువగానే బాలుడు లేచి నవ్వుతూ వచ్చాడు.అదియే కదా ఆదిదేవుని అనుగ్రహము.ఆశ్రిత రక్షణ పరమార్థము.
( ఏక బిల్వం శివార్పణం.
No comments:
Post a Comment