సౌందర్య లహరి
పరమ పావనమైన నీ పాదరజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
మంచి పనులు చేయుచున్న ఇంద్రియములు ఐదు
వానికి సంకేతములు ఇచ్చుచున్న ఇంద్రియములు ఐదు
సప్త ధాతువులు మనసు ఎనిమిది కలిసి
అష్టాదశ పీఠముల నా హృదయ మందిరము
నిశ్చల భక్తిని నిన్ను గొలువ నిష్ఠను చేరినదమ్మా
మనో వాక్కాయ కర్మలు అను ముగ్గురు మిత్రులతో
ఏమని వర్ణించను ఏ నోము ఫలితమో ఇది
నా శరీరము పావన శక్తి పీఠముగా మారుచున్న వేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి.
భావము
నా మనసనే తోటలో విహరించుచున్న తల్లీ.చెవి,కన్ను,ముక్కు,నాలుక,చర్మము అను జ్ఞానేంద్రియములు,పాణి,పాద,పాయు,ఉపస్థ,వాక్కు అను ఐదు కర్మేంద్రియములు,రస,రక్త,మాంస,మేధ,అస్థి,నుజ్జు,శుక్ర అను ఏడు ధాతువులు,మనసు కలిసి ఎనిమిది ఉన్న నా హృదయము ,మనస్సు,మాట,పని అను ముగ్గురు మిత్రులతో నిన్ను సేవించ నిష్ఠను చేరుటకు బయలు దేరినది.నా శరీరము పావన శక్తి పీఠముగా మారుటకు ప్రయత్నించుట ఎంతటి అదృష్టము.ఈ శుభ సమయములో నీ చెంతనే నున్న నా వేలిని విడిచి పెట్టకమ్మా.అనేక వందనములు.

" యాదేవి సర్వభూతేషు విద్యా రూపేణ సంస్థితా
నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమో నమః.

"వ్యక్తం అంబామయం సర్వం
అవ్యక్తం పరమేశ్వరం." ను అనుసరించి శివశక్తులు బిందు వృత్తములుగా అలరారుతుంటాయి.

శివశక్తుల చిద్విలాసమే దక్షయజ్ఞము తరువాత లోకకళ్యాణార్థము, హరి సుదర్శన చక్రముతో ఖండింపబడిన మాయాసతి శరీర భాగములు పడినచోట్ల "అష్టాదశ శక్తి పీఠములు"గా విరాజిల్లుచున్నట.(వీటి సంఖ్య గురించి,వివరముల గురించి వివాదములు మనకొద్దు.)
ఆదిపూజ్యుని తల్లి అష్టాదశపీఠమైన నా అశక్తతతను గ్రహించి,తన అవ్యాజ కరుణతో నన్నొక కరణమును చేసి,తాను ఆధారమైన ఆ దారమై, " ఆనందలహరి" అమ్మ కథల అరవిందములను అల్లుచున్నది. నందీశ్వరుని హస్తగతమైన ఆనందలహరిని , తాను ఆధారమైన ఆ దారమై " ఆనంద లహరి" అను అమ్మ శక్తిపీఠ కథలను అరవిందముల మాలను అల్లుచున్నది.అమ్మ నామస్మరణమనే ఝుంకారముచేయుచు,మధుర మధుర మాధవీదేవి కృపారసమను మధువును గ్రోలుటకు తరలి రండి-తరించండి.
ప్రియ మిత్రులారా,శుభోదయము.
నా మనోభావాలను ప్రోత్సహిస్తూ మీతో పంచుకునేలా చేస్తున్నందుకు వినమ్ర ధన్య వాదములు.కన్న తల్లి తన పిల్లలు పరుగు పందెములో ప్రథమ శ్రేణిలో ఉంటే పరవశిస్తుంది.తప్పటడుగులు వేస్తున్న వారిని చూస్తూ తన్మయత్వముతో మురిసిపోతుంది.
అదేవిధముగా ఆ తల్లి దేవీ నవరాత్రుల సందర్భముగా (నేను వ్రాశానని భ్రమసి ఆనందించుటకై) తన కథలను తానే వ్రాసుకున్నది.కాని నా అహము అమ్మ కరుణతో తనపని తానుచేసుకుని పోయిన,పెద్దమనసుతో సవరించి,సంస్కరించగలరని ఆశిస్తూ,మీ సోదరి

నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి.
అమ్మ దయతో కొనసాగుతుంది.
No comments:
Post a Comment