Saturday, January 27, 2018

nee noemu naenoemudu



నీ నోము నేనోముదు
*****************
ఏమేమి పాటొప్పునే గౌరమ్మ ఏమేమి ఆటొప్పునే
పాడేటి పాటొప్పునే గౌరమ్మ ఆడేటి ఆటొప్పునే
పాడేటి పాటలోన
సాగు ఏరుల్లార,మోగు గాలుల్లార,ఊగు పైరుల్లార
రాగి తాంబాళాన
అమ్మ సింగారాలు,ముత్తాల గునుగులు,కొలువైన కలువలు,రంగుతంగేడులు,సేరు సేమంతులు,రంగు
రుద్రాక్షలు,ఎలిగేటి దీపములు,సద్ది గౌరమ్మలు
పూచేటి పూలలోన
---------------
గౌరమ్మ గుమ్మాడి నేనౌదును
కాసేటి పండ్లలోన
------------- 
గౌరమ్మ శిల్పక్క నేనౌదును
.
ఆడేటి ఆటలోన
-------------
లేగదూడల్లార,సోగ కన్నుల్లార,కాలి అందెల్లార
రాగి తాంబాళాన
అమ్మ సింగారాలు,ముత్తాల గునుగులు,కొలువైన కలువలు,రంగు తంగేడులు,సేరు సేమంతులు,రంగు రుద్రాక్షలు,ఎలిగటి దీపములు,సద్ది గౌరమ్మలు
మొక్కేము ఎలగపండే గౌరమ్మ రెండేసి దోర పండే
మొక్కేము ఎలగ పండే గౌరమ్మ రెండేసి దోర పండే
*****************************************
గౌరమ్మను పిలిచి,తానాలు చేయించి,అక్షింతలద్దించి,గంధాన కడిగించి,కుంకుమను జారించి,పసుపును పూయించి,పూవాన తేలించి,ఇందయని ముద్దనిడి,బతుకమ్మ తల్లితో చద్దులే ఆడుచు,తోటనే సేరంగ
బంగారు పండ్లవనమే గౌరమ్మ సింగారమే తోచెనే
మా అమ్మ జాతరలో
రాగితాంబాళాన
అమ్మ సింగారాలు,ముత్తాల గునుగులు,కొలువైన కలువలు,రంగుతంగేడులు,సేరు సేమంతులు,రంగు
రుద్రాక్షలు,ఎలిగటి దీపములు,సద్ది గౌరమ్మలు
ఆడేటి ఆటలోన గౌరమ్మ నీ నోము నేనోముదు
పాడేటి పాటలోన గౌరమ్మ నీ నోము నేనోముదు
అమ్మలక్క చెమ్మ చెక్క నెత్తిమీద గౌరంట
జోర్జోర్ జాతరేలే గౌరమ్మ జొన్నవి దివిటీలే
పసిడిగ పుట్టిన గౌరమ్మ పసిడిగ పెరిగిన గౌరమ్మ
కసువుగ కలిగ మారేవా మనసుగ మాతో తిరిగేవా
వాయనమందిన నీళ్ళు,నోములివంటు జనములు
సొగసుగ బతుకమ సెరువులో కెళితే
మనసెల్ల మురిసే పాట జనమెల్ల మురిసే ఆట
మనసెల్ల మురిసే పాట జనమెల్ల మురిసే ఆట
మనసెల్ల మురిసే పాట జనమెల్ల మురిసే ఆట.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...