సౌందర్య లహరి-17
పరమపావనమైన నీపాదరజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
నీ విలాసపు కన్ను కైలాసపు దారిని చూపించింది
సరస సల్లాపముగా భుజము తట్టి నడిపింది
త్రికరణ శుద్ధిగా నీకు పూజను చేయించింది
వేదన పడుచుండగా వీడలేని విధముగా
భక్తి అనే పద్మమును నీ పాదపద్మములు చేర్చమంది
నా ధ్యాసను మార్చేసి ధ్యానము చేయమంది
ధ్యానము-ధ్యాస అను కుడి-ఎడమ అడుగులతో
నా పాదములు భక్తితో ప్రదక్షిణము చేయువేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి.
"యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణష్యంతి ప్రదక్షిణ పదే పదే."
దీని అర్ధం "గతకాలంలో నేను చేసిన పాపాలు సమస్తమూ నేను ఈ ప్రదక్షణ చేయుచున్నప్పుడు వేయు ప్రతీ అడుగు తోను నశించిపోవాలి, అని పెద్దలు చెబుతారు.
ప్రదక్షిణమునే పరిక్రమము అని కూడ పిలుస్తారు.పరిక్రమము అనగా సిద్ధమగుట.మనము దేనికి సిద్ధమగుచున్నాము.ప్రదక్షిణమునకు.అనగా దక్షీన దిశగ నున్న మార్గములో పయనించుటకు.మనము ఎందుకు కుడి వైపునున్న మార్గమున మన పాదములను చప్పుడు కాకుండ అతి మీలగ దైవ ధ్యానముతో పయనిస్తాము? అంతే ,
ప్రదక్షిణము చేయునపుడు మనము దైవమును స్మరిస్తు అన్ని ఉత్తమమైన ,ధర్మ బద్ధమైన పనులను చేయుదమని ప్రమాణముగ భావించుతాము కనుక సవ్యమైన కుడి వైపు నుండి మనప్రదక్షిణమును ప్రారంభిస్తాము.
ప్రదక్షిణమును ఎందుకు వృత్తాకారముగా (గుండ్రముగా) తిరుగు చేస్తాము అన్న సందేహము మనకు రావచ్చును.ఒక కేంద్ర బిందువుచుట్టు వర్తులాకారముగా ప్రదక్షిణము చేయునపుడు ,ఆ దేవత భక్తులందరికి సమాన దూరములో ఉంటుంది కనుక దైవానుగ్రహము కూడా సమానముగానే ఉంటుంది.
ప్రదక్షిణమును మూడు సార్లు ఎందుకు చేస్తారు అంటే ప్రతివారు ఆధ్యాత్మిక,ఆది దైవిక,ఆది భౌతిక తాపములచే బాధితుడు.వాని నుండి విముక్తుడు అగుటకు మూడు ప్రదక్షిణములు అని ఆర్యోక్తి.
శారీరక మానసిక రుగ్మతలు ఆధ్యాత్మిక తాపము.ప్రకృతి వైరీత్యాల వలన కలుగు శారీరక తాపములు ఆది దైవికములు.తమ చుట్టు ఉన్న ప్రాణుల (కౄర మృగములు) దుష్టుల వలన కలిగే ఇబ్బందులు ఆది భౌతికములు.
ప్రదక్షణము వీనిని తొలగించి,రక్షించును.
ధ్వ్జ ప్రదక్షణము,పాద ప్రదక్షణము.నమస్కార ప్రదక్షణము,అంగ ప్రదక్షణము.యుగ్మ ప్రదక్షణము,ఆత్మ ప్రదక్షణము ఇలా ఎన్నో రకములు
భక్తులు భక్తి ప్రపత్తులతో అమ్మకు ప్రదక్షిణము చేయు సమయమున,చెంతనేనున్న నాచేతిని విడిచిపెట్టకమ్మా.నమస్కారములు.

No comments:
Post a Comment