Saturday, February 10, 2018

SIVA SANKALPAMU-98

అమ్మ ప్రేమ పరీక్షింప ఆదిభిక్షువు అయినావు
ముచ్చత తీర్చగ వేశ్యకు ముసలివాడినంటావు

పంది మీద పందెమేసి ఎరుకగా మారుతావు
సింహముతో యుద్ధానికి  శరభముగా మారుతావు

దేవతల మదమడచగ యక్షుడివైనావు
ముని పత్నుల పరీక్షించ మన్మథుడవైనావు

చందనాలు వీడి నీవు చండాలుడవవుతావు
చరాచరములను బ్రోవ చమత్కారమవుతావు

మార సంహారక నీకు మారువేషములు ఎందుకంటే
మక్కువెక్కువంటావురా ఓ తిక్క శంకరా!


















No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...