Saturday, March 3, 2018

SAUMDARYA LAHARI-24

సౌందర్య లహరి -24

 పరమపావనమైన నీ పాదరజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 శారీరక సౌందర్యములు అశాశ్వతమను తెలివిలేక 
 ఐహిక సుఖములు బహు స్వల్పములను ఊహ లేక

 సంసార సాగరమును నిస్సారముగ ఈదలేక
 అహంకార ప్రాకారపు హుంకారము వినలేక


 నిరాకార నిరంజన నిర్మల ఆకారము చూడలేక
 పాతాళమునకు జారి అటుఇటు పారిపోవ దారిలేక

పాద ధూళి రేణువును  పాహి-పాహి యనగానే
 పాప ప్రక్షాళనమై  పాద సేవనమగుచున్న వేళ

 నీ మ్రోలనే  నున్న  నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి  ఓ సౌందర్య  లహరి.

 " సరోజదళ నేత్రి హిమగిరి పుత్రి
   నీ పాదాంబుజములే సదా నమ్మినానమ్మా
       శుభమిమ్మా  శ్రీ కామాక్షమ్మా అంటు శ్రీ శ్యామశాస్త్రి ధన్యుడైనాడు.

  " నీ పాద కమలసేవయు-నీ పాదార్చకులతోడి నెయ్యము"నొందిన వాడు బమ్మెర పోతన.

  "బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మమురా నీ పాదము" అని పాదమహాత్మయమును దర్శించిన అన్నమయ్య.

  చరణములే నమ్మితి  నీ దివ్య చరణములే నమ్మితి అని పాదసేవనమోతో పరమాత్మహృదిలో నిలిచిన గోపన్న.
  
    వీరిభక్తి విభవమై విరాజిల్లుతుంటే కాళ్ళు కడిగితే గాని పడవనెక్కనీయని గుహునిదియును పరిణిత పాదసేవనమే..


   పాదుకా పట్టాభిషేకమును చేసి పరిపాలించిన భరతుడు భాగ్యశాలి..

  పాదసేవ ప్రాశస్త్యమును లోకవిదితము చేస్తుంటే ఇంకొక మెట్టు ఎక్కిన యముడు.

 హరే అటంచు సుస్థిరమతులై  సదా భజనచేయు మహాత్ములపాద ధూళి
 నా శిరమున దాల్తు" మీరటకు పోవకడంచు" 

   తన కింకరులకు (సేవకులకు) ఆనతిచ్చెనట . ధ్యేయములు వేరైనా ధ్యానము ఒక్కటే.పాద సంసేవనము..అమ్మ పదరాజీవ సేవనము భావనలోనైనా ,బాహ్యములో నైనా సౌభాగ్యప్రదము అని అమ్మదయతో అర్థమయిన సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.   

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...