సౌందర్య లహరి-75
పరమ పావనమైన నీ పాద రజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
సృష్టి పూర్వస్థితి "ధూమము" అను చీకటి,దానిని
తొలగించును ముకుళిత సంకోచిత "ఈక్షణ శక్తి"
అమ్మ కనుల వికసనము సృష్టి స్పష్టపు స్థితి
కన్నుల అవలోకనము స్థితికారక ఉద్ధతి
ముకుళిత నయనముల పని ముంచేసే ప్రళయము
క+అ+మ పర బ్రహ్మ వాచకము కామాక్షి
అనంత దర్శన శక్తి గల ఆదిశక్తి శతాక్షి
జగతి సమ్రక్షణ,పోషణ మీనాక్షిగ మారువేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి
" కమలాంబ సంరక్షతు మాం" నవావరణ కీర్తనలో " సుమనస రాజీవాక్ష ముఖి" అని ముత్తుస్వామి దీక్షితారు ఎలా చెప్పగలిగాడు.వారు బహుశానుభవించి,పదే పదే అనుభూతికి లోనై మనకు తెలియచేయాలనే సహృదయతో ప్రసాదించినారేమో.అమ్మ పాదములను బ్రహ్మాది దేవతలు సేవిస్తుంటే,సకలలోక నాయిక ఆశ్రిత కల్ప లతిక.ఆశ్రితులను ఆసర.ప్రళయానంతరము పునః సృష్టి పూర్వము అంతాచీకటియే అమ్మ ముకుళించిన తన నేత్రములను వికసింపచేయగనే జగతి ప్రకాశిస్తుంటుంది.స్థితికారిణిగా,సంరక్షిణిగా అమ్మ అదే కమలాంబ (కమలములో నున్నతల్లి) ,అదే సత్పురుషుల హృదయ కమలములోనున్న తల్లిని సకలజీవులు సన్నుతి చేయు సమయమున చెంతనేనున్న నాచేతినివిడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.
No comments:
Post a Comment