Sunday, March 11, 2018

SAUNDARYA LAHARI-39

  సౌందర్య లహరి-39

  పరమ పానమైన నీ పాదరజకణము
  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  సింధువులో స్థూలముగా,బిందువులో సూక్ష్మముగా
  పెద్ద కొండలో స్థూలముగా,అద్దములో సూక్ష్మముగా

  పుడమిగా స్థూలమై,కణముగా  సూక్ష్మమై
  వాయువుగా  స్థూలమై,శ్వాసగా  సూక్ష్మమై

  సుందరములో స్థూలమై,అందరిలో సూక్ష్మమై
  బ్రహ్మాండములో స్థూలమై,పిండాండములో సూక్ష్మమై

  విస్తుబోవచేయుచున్న  నీ నిస్తుల  వైభవము
  స్థూలములో  మార్పులేక  సూక్ష్మములను చేయువేళ

  నీ మ్రోలనే నున్న నా కేలును విడనాడకమ్మా,నా
  మానస విహారి! ఓ సౌందర్య లహరి.

 " స్థూల-సూక్ష్మే మహా రౌద్రే మహా శక్తి మహేశ్వరి
   మహా పాప హరే దేవి  మహా లక్ష్మి  నమోస్తుతే"

  జగజ్జనని మనలను రక్షించి పోషించుటకు సమయ-సందర్భానుసారము ఒకపరి స్థూలముగ-ఇంకొక పరి సూక్ష్మముగ ప్రకటింపబడుతుంటుంది.అసలీ స్థూల సూక్ష్మములనగా ఏమిటి? 

   భౌతిక పరముగా కనిపిస్తూ,కనిపిస్తున్న దానిలో పంచేంద్రియములు సంకేతములనిస్తు,అతి సులభముగా,కొంచపు సాధనతోనే పరా శక్తిని దర్శించగలుగుట.ఒక విధముగా సగుణపూజకు  సహాయ పడుతుంది.(విగ్రహారాధన) దీనిలో నవ విధభక్తులు సహాయకారులుగా సాధకునితో ఉంటాయి. సులభముగా మనము గ్రహించగలుగు స్వభావము కలది స్థూల తత్త్వము.

  పంచభూత విలసితమైనప్పటిని పంచేద్రియ జ్ఞానపు సహాయము లేకుండ సామాన్య సాధకునకు అవగతమగుట కొంచము సులభముకాని తత్త్వము కలది సూక్ష్మ తత్త్వము.విశేష సాధకులు మాత్రమే సూక్ష్మతత్త్వమును అర్థము చేసుకోగలరు.

 సూక్ష్మ తత్వము సూక్షతరముగను-సూక్ష్మ తమముగా వర్గీకరింపబడి సాధకులకు పరమానంద భరితమైన కైలాస దర్శనమును చేయిస్తున్న సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు. 


  

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...