సౌందర్య లహరి-46
పరమపావనమైన నీపాద రజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
సర్వ వర్ణోపశోభితము సహస్రారము కాగా
హంసవతీ-క్షమావతీ ఆజ్ఞా చక్రముగా
అమృతాది మహా శక్తులతో విశుద్ధిచక్రముగా
కాళరాత్రాది రేకులతో అనాహత చక్రముగా
డామర్యాదివిరచిత మణిపుర చక్రముగా
బందిన్యాది సమన్విత స్వాధిష్ఠాన చక్రముగా
వరద-శ్రీ షండ-సరస్వతీ మూలాధార చక్రముగా
నీ త్రివిక్రమ పరాక్రమము శ్రీచక్రముగా మారుచున్న వేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి! ఓ సౌందర్య లహరి.
" శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితాంబికయే" అని అమ్మవారిని స్తుతిస్తున్నారు ఎందరో భక్తి ప్రపత్తులతో.
మన శరీరములోని విసర్జకావయమునుండి పైకి ఒక ఎముకల వలయము సాగుతుంది.(వెన్నెముక) దీనిని సుషుమ్నా నాడి అంటారు.ఆ నాడి తనలో ఆరుచోట్ల పద్మములవలెనున్న ఆరు చక్రములను కలిగిఉంటుంది.అవి మూలాధారము-స్వాధిష్ఠానము-మణిపురము-అనాహతము-విశుద్ధము-ఆజ్ఞా చక్రము అనునవి.వీనిని దాటిన లభించునది సహస్రారము.అదియే పరమాత్మ స్థానము.ఈ చక్రములు పంచభూత తత్త్వమునును,బీజ తత్త్వమును కలిగియుండును."ఓం నమః శివాయ"ఇ అను పంచాక్షరి విలసితములు.మూలాధారములోని కుండలినీశక్తి శ్రీమాత దయతో తేజోవంతమై పైకి సాగుతు "షట్చక్రోపరి సంస్థిత" అనుగ్రహించుచున్నప్పుడు,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.
No comments:
Post a Comment