సౌందర్య లహరి-లలిత పరాభట్టారిక
పరమ పావనమైననీ పాదరజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
బ్రహ్మా0ణడ పురాణంతర్గత బ్రహ్మాండరూపిణి
ప్రాతఃకాల స్మరణము పరమ రమణీయము
హయగ్రీవ-అగస్థ్య సంవాద సుందరి
ప్రాతఃకాల భజనముసర్వ పాప భంజనము
చిదగ్నికుండ ప్రకటితమైన చిద్విలాసిని
ప్రాతఃకాల వందనము ఆనందనందనము
వశిన్యాది-వాగ్దేవతా సేవిత శ్రీమన్నగర నాయకి
లలితా పరా భట్టారికగా కొలువుతీరియున్న వేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి! ఓ సౌందర్య లహరి.
"లలిత-లలిత-శ్రీ లలిత-విశ్వ మోహిన శ్రీమాతగా భజింపబడుతు,నామ రూపములను అధిగమించి,తత్త్వ ప్రకాశినిగా అవగతమగుచున్న సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.
No comments:
Post a Comment