Sunday, March 25, 2018

SAUNDARYALAHARI-56

  సౌందర్య లహరి-82

  పరమ పావనమైన  నీ  పాదరజకణము
  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  సకలశాస్త్ర సమూహముల  సారమైన నీ అందెలు
  సామవేద సంగతుల  స్వరమైన నీ అందెలు

  నీ పాదములు తాకలేని నీలకంఠ వదనుని
  చిత్తరమైన కొత్త తత్తరపాటును చూసి

  అవ్వ? ఇది ఏమి సోద్యము?
  మేము చూసినామంటూ చేసే సవ్వడులు

  చిత్తుగ ఓడిపోయి ఏమిచేయలేని  మన్మథుని
  చిత్తపు పరిహాసముగ పకపక నవ్విన వేళ

  నీ మ్రోలనే నున్న నా కేలు  విడనాడకమ్మా,నా
  మానస విహారి! ఓ సౌందర్య లహరి. 
 అదిశంకరుల అద్భుతభావనా విన్యాసము.అనుపమాన లీలా విశేషములు ఉపమాలంకార విరచితములు.లలిత లలిత శృంగార ఉత్తుంగ తరంగాలు.లాస్యము చేయుచున్న అమ్మ ముగ్ధమనోహర పాద, మంజీరములను స్వామి ఒకసారి తాకవలెనను తలపుతో కొంచము వంగినపుడు,పరమ సాధ్విమతల్లి భంగిమను మార్చి స్వామికి అందకుండిన,ఎవరైనా చూసినారేమో అని తత్తర పాటుతో నున్న శివుని ముఖమును చూసినపుడు వచ్చిన మువ్వల సవ్వడి,మన్మథుని చిత్తములో నేను చూసినానులే అని నవ్వినట్లున్న సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక  నమస్కారములు. 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...