Wednesday, April 25, 2018

SAUNDARYA LAHARI-106


 సౌందర్య లహరి-ముత్యాల ప్రాకారము

 పరమ పావనమైన నీపాదరజకణము
 పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

 ధవళముక్తామయము-దశయోజన  విస్తీర్ణము
 ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలప్రదము

 అష్టమూర్తి రజైయాత్రీ లోకయాత్రావిధానము
 అష్టదళ పద్మాకార  అతిసుందర భవనము

 అనంగమదన-గగనరేఖ-భువనపాలాది
 అష్టమంత్రిణీసేవిత జ్ఞానశక్తిమయము

 సర్వజీవ-సర్వవేళ సమాచార సంరక్షణ కేంద్రమైన
 ముత్యాల ప్రాకారములో సత్యము అవగతమగుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి! ఓ సౌందర్య లహరి.


  నిత్యకళ్యాణి మనోసంకల్పిత ముత్యాల ప్రాకారము స్వచ్చతకు-సత్యమునకు ప్రతీక అయిన తెల్లని కాంతితో ప్రకాశిస్తూ ఉంటుండి.అచ్చటి ఎనిమిది రేకులు పద్మము అనంగ మదనాది ఎనిమిది శక్తులుగ ,వారు అందించు సర్వజీవుల- సర్వకాల-సర్వావస్థల సమాచారములను కాంతులను వ్యాపింప చేస్తు ,సత్కృపకు  పాత్రులను చేస్తుంటుంది.అంతేకాదు అమ్మవారి కంఠములో అలంకరించబడిన  అటు-ఇటు కదులుచున్న 
 అందమైన ముత్యాలతో అల్లబడిన రత్నాల హారము అందముగా కనిపిస్తోంది.ఇది పైకి కనిపించే అర్థము.కాని కొంచము నిశితముగా పరిశీలిస్తే, ఆ ప్రాకారములోని శక్తుల సత్వ-రజోగుణ సంకేతములు.తల్లి విశుద్ధ చక్ర సరస్వతీరూప సాక్షాత్కారములు.అక్కడ నల్లని తమోగుణము అసలు లేనే లేదు.అంతా తేటతెల్లనైన సత్వ ప్రకాశము.హృదయ మలినములు లేని-తొలగించుకొనిన సాధకుల సాహచర్యముతో సర్వేశ్వరియే  సత్యము అన్న విషయము నేను తెలిసికొనుచున్న సమయమున చెంతనేనున్న నా చేతిని విడిచి పెట్టకమ్మా.అనేక నమస్కారములు. 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...