Tuesday, April 17, 2018

SAUMDARYA LAHARI-96

   సౌందర్య లహరి-కంచు ప్రాకారము

 పరమపావనమైన నీపాదరజ కణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 ఇనుప ప్రాకారమును ఇనుమడించు కాంతితో
 సుగంధ పుష్ప తావులు-సుమధుర ఫల తరువులు

 వృక్షములకు జలమునీయ అసంఖ్యాక కూపములు
 పక్షుల కూజిత రవములు ఎన్నో శుభలక్షణములు

 హంసలు-నెమళ్ళు,సీతాకోక చిలుకలు
 ప్రశాంత వాతావరణపు సొగసు పులకరింతలు

  హరిణీ సమూహముల బిత్తరిగంతులతో,హరిణేక్షణ
 కంచు ప్రాకారము అచ్చెరువులో ముంచెత్తుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి! ఓ సౌందర్య లహరి.

         అతి ఎత్తైన కంచులోహ ప్రాకారములు అమ్మ అపారకృపావీక్షణమునకు నిలువెత్తు నిదర్శనములు.పనస-శింశుప-దేవదారు- లవంగ-పాటల-దాడిమి-చందన మొదలైన అచ్చమైన పచ్చదనపు వృక్షాల( అసలు ఎండుటాకు కానరాదు) హరిత ప్రకాశము జగన్మాత స్థితికారకత్వము ,వాటి సుమనోహర పరిమళము వ్యాపించిన ఆశ్రిత వాత్సల్యమేమో .పరాత్పరికి ప్రణామములు చేస్తున్నవా అన్నట్లు చిలుకల-గోరువంకల మైత్రి,పావురముల ప్రశాంతత-రాజ హంసల రమణీయత పరుగుతీస్తున్న కాలమును సూచిస్తూ పరుగులు తీస్తున్న లేళ్ళు కన్నులపండుగ చేస్తుంటే,కోయిలలు-గండు తుమ్మెదలు తల్లిని కీర్తిస్తున్నట్లు కుహుకుహు రాగములతో-ఝంకారములతో స్వరములను మీటుచున్న సమయమున చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.

   .

   .

   .

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...