సౌందర్య లహరి-రాజేరాజేశ్వరి
పరమపావనమైన నీపాద రజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
ఇచ్చా-క్రియా-జ్ఞాన శక్తుల అనుగ్రహదాయిని
అష్టసిద్ధులను అనుగ్రహించు సిద్ధిదాత్రివి నీవు
అంబా తత్త్వము వెల్లివిరియ ఆనందదాయిని
రాజాధిరాజులను రక్షించే ఈశ్వరివి నీవు
రజో-తమో-సత్వ భక్తిని మించినదైన పరాభక్తితో
రాగాతీత ఉపాసనను ఉత్కృష్టము చేయుచు
తేజోమయమైన నీ రాజరాజేశ్వరి రూపము
అపరాజితగా నాలో విరాజమానమగుచున్నవేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి! ఓ సౌందర్య లహరి
"పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి-కృపాకరి శంకరి,పాహిమాం"
కోరి వచ్చిన వారికెల్లను కోర్కెలొసగె బిరుదు గల తల్లి రాజరాజేశ్వరి.
" ఐశ్వర్య ప్రదాయినికనుక తల్లిని ఈశ్వరి అని కీర్తిస్తారు.సర్వ సమృద్ధియే ఐశ్వర్యము.ఐశ్వర్యము ఎనిమిది రూపములలో చెప్పబడినది.(అష్ట-ఐశ్వర్యములు.) అవి,
1.రాజ్యము-2.ధనము-3.ఇల్లాలు-4.పిల్లలు-5.ధైర్యము-6.స్థైర్యము-7.విద్య-8.వినయము.(మణి మాణిక్యములను,అష్ట సిద్ధులను ఇంకా ఎన్నోవిధములుగా అష్ట-ఐశ్వర్యములను నిర్వచించారు.)
విద్య-విద్యతో పాటుగ వచ్చు వివేకము,ఇల్లాలు-ఇల్లాలుతో పాటు వచ్చు పిల్లలు,ధైర్యము-ధైర్యముతో పాటు వచ్చు స్థైర్యము (స్థిత ప్రజ్ఞత్వము అనగా ఎట్టిపరిస్థిలో నైనను ఒకే విధముగా ఉండుట)సంస్కారము-సంస్కారముతో వచ్చిన సంపదయే (ధనము) రాజ్యము.
కోరికలను తీర్హు తల్లి కామేశ్వరి.మహిమలు గల తల్లి కనుక మహేశ్వరి.రాజ్యమును అనుగ్రహించు తల్లి రాజేశ్వరి." అంబా శాంభవి- చిద్రూపి పరదేవతా భగవతి శ్రీ రాజరాజేశ్వరి" ." కోటి సూర్య ప్రకాశిని-కోమలి" అసంఖ్యాక సూర్యతేజముతో ప్రకాశించుహున్న కోమలమైన తల్లి కొలువుతీరియున్న సమయమున, నీ చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.
.
No comments:
Post a Comment