సౌందర్య లహరి-శాంకరీదేవి-72
పరమపావనమైన నీ పాదరజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
ఆది దంపతుల లీలయనగ అద్భుత సుందరభవనము
విస్తుబోవచేసె రావణుని విశ్వకర్మ నిర్మితము
బ్రహ్మగా మారి కోరె,దక్షిణగ దక్షిణ కైలాసము
అంబాసమేతముగా,షరతుతో అనుగ్రహించిరి కరుణను
ధర్మమునకు గ్లానియైన ధ్వంసము తప్పదని
పుడమి పుణ్యక్షేత్రమైన లంకా ద్వీపములో
మాయాసతి మొలభాగము మహిమాన్వితమూర్తిగ
శాంకరియై త్రికోణేశునితో కింకరులను బ్రోచువేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి! ఓ సౌందర్య లహరి.
సంస్కృతములో లంక అంటే భవ్యమైనది,లంక అంటే తేజస్సుగల భూమి/ద్వీపము.శ్రీలంక జలావృత భూభాగము.దైవ మహిమచే భూమి పవిత్రతను సంతరించుకొని క్షేత్రముగా భాసిల్లుతుంది.దైవానుగ్రహముతో పుణ్యక్షేత్రమవుతుంది.ఈశ్వర సంకల్పముగా భవాని ఒక అందమైన భవనమును దక్షిణ భూభాగములో నిర్మింపహేయమని నాథుని కోరగా,సదాశివుడు విశ్వ కర్మచే లంకలో నిర్మింపచేసెను.దేవతలు విశ్వకర్మ,రాక్షసులకు మయుడు నిర్మించేవారు.గృహప్రవేశపూజను నిర్వహించిన రావణబ్రహ్మ దక్షిణగా ఆ భవనమునే కోరెను.ఆభవనములో అమ్మవారు నెలకొనియుండవలెనని కోరెను.పరమ శివ భక్తుడు కదా మరి! ధర్మవిరుద్ధమైన కోరికయైనప్పటికిని,ధర్మము తప్పరాదను నిబంధనతో వారు రావణుని అనుగ్రహించిరి.
విభీషుణుని పాలనలో తిరిగి లంకాప్రవేశము చేసి, శాంకరీదేవి త్రికోణేశ్వరునితో భక్తులను బ్రోచుచున్న సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.

No comments:
Post a Comment