Wednesday, April 4, 2018

SAUNDARYA LAHARI-SRNKHALAADEVI-75


 సౌందర్యలహరి-శృంఖలాదేవి-75

 పరమపావనమైన నీపాద రజకణము
 పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

 దూర్వాసుడు  పరీక్షించె  రుక్మిణీ-వాసుదేవులను
 పర్యవసానమే వారికి ద్వారక బహిష్కరణము

 తల్లి ప్రద్యుమ్నుని ప్రసవించె-నడికట్టుతో కనిపించె
 సంకెల నడుముకు ఉన్న శృంఖలదేవిగ తోచె

 వంగదేశమపుడు పొందె  ప్రద్యుమ్నుని  నామము
 ఋష్యశృంగముని అచట అయినాడొక పర్వతము

 మాయాసతి  ఉదరమే  మహిమాన్వితమూర్తిగ
 శృంఖలాదేవి మా సంకెలను తెంచువేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ! ఓ సౌందర్య లహరి.

  " ప్రద్యుమ్నే వంగరాజ్యాయాం శృంఖల నామ భూషితే
    విశ్వ విమోహితే దేవి శృంఖల బంధనాశిని"

   వంగదేశములోని  ప్రద్యుమ్న నగరములో పడిన మాయా సతి పొట్ట భాగము "శృంఖలాదేవి" గా ఆరాధింపబడుతున్నడి.ఈ తల్లిని" శృంగలాదేవి","సింహళాదేవి" అని కూడా ఆరాధిస్తారు.

  సింహళ అనే శబ్దమునకు సంకెల -బాలెంత నడుము కట్టు అని కూడా వ్యవహారములో ఉంది.స్థలపురాణము ప్రకారము ఈ ప్రదేశములో ఋష్యశృంగ మహాముని అమ్మవారిని ప్రసన్నురాలిని చేసుకొనెనట.ఇక్కడ మనకు "ఋష్యశృంగము" అను పెద్ద కొండ ఆ ముని గుర్తుగా మనకు దర్శనమిస్తుంది.అతడు అమ్మతో సహా కర్ణాటక లోని  శృంగేరీ పీఠమును దర్శించి తిరిగివచ్చి ఈ స్థలములో అమ్మ శక్తిని ప్రతిపాదితము చేశారట.భక్తానుగ్రహముతో తల్లి శృంగలాదేవి నామముతో ఆరాధింపబడుతుందట.రుక్మిణీమాత సుతుడైన ప్రద్యుమ్నుని గౌరవముగా ఆ క్షేత్రము ప్రద్యుమ్నే నామముతో పవిత్రమైనది.
   ఎవ్వరు బంధించలేని "విశృంఖలాదేవి" మాతృ వాత్సల్యముతో పచ్చి బాలెంత గా మనకొరకు నిత్య పథ్యమును చేస్తూ,"జగద్రక్షణా బాధ్యత" నడికట్టును తనకు తాను బిగించుకున్నది ఆ తల్లి.

   కోయజాతి జనులు తప్పెట్లతో-తాళాలతో తల్లికి జాతర చేయుచున్న సమయమున చెంతనే నున్న నాచేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.



No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...