Friday, April 27, 2018

SAUNDARYALAHARI-CHINTAMANI GRUHAMU

 సౌందర్య లహరి-చింతామణిగృహము
 ****************************

  పరమపావనమైన  నీపాదరజకణము
  పతితపాలకమైన  పరమాత్మ స్వరూపము

  ఏకాంత-శృంగార-జ్ఞాన-ముక్తి మంటపములు
  సహస్ర మండపముల  సూర్య-చంద్ర ప్రక్కశితము

  శక్తితత్త్వములు అమరినవి పది సోపానములుగా
  శివతత్త్వము  మారినది శుభాకార మంచముగా

  సకలలోక సౌభాగ్య  సంకల్పితము అపురూపము
  కుడి-ఎడమగా విడివడినది  ప్రూషికా రూపము

  సంతత  చిత్ప్రకాశక చింతామణి గృహములో
  అమ్మ  ఒడిలో  నేను  ఆసీనురాలినైన  వేళ

  జన్మధన్యమైన నన్ను  వెడలిపొమ్మనకమ్మా,
  అందరికి అమ్మవైన  అద్భుత సౌందర్య లహరి.

 మణిద్వీపమునకు బ్రహ్మరంధ్రము వంటి చింతామణి గృహములో తల్లిచిత్ప్రకాశముతో దర్శనభాగ్యమును ప్రసాదిస్తుంటుంది.చింతతో ప్రమేయము లేకుండగానే చింతితార్థ ప్రదాయిని చెంతనేఉండి రక్షిస్తుంటుంది.అందుకేనేమో తల్లిని "సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండితా" సన్నుతిస్తారు.సహస్రాక్షి-సహస్రపాత్ సహస్ర స్తంభ నిర్మితమైన చతుర్విధఫలపురుషార్థములైన ఏకాంత-శృంగార-జ్ఞాన-వైరాగ్య మండపములలో విరాజితమై విలక్షణముగా మనలను పాలిస్తుంటుంది.ఆహా! ఏమి నా సౌభాగ్యము. సృషి స్థితి కారిణి మనకొరకు కుడి-ఎడమలుగా పురుష-స్త్రీ రూపములుగా విడివడి ప్రూషికగా మారినది.తల్లి నిర్హేతుక కరుణాకటాక్షము నన్ను అమ్మ ఒడిలో ఆసీనురాలిని చేసినది.ధన్యోస్మి  తల్లీ ధన్యోస్మి.నాతోబాటు మీ అందరిని మక్కువతో తన అక్కునచేర్చుకుంటానని తల్లి నాతో అంటున్న సంతోష సమయమున నన్ను నీ ఒడినుండి నుండి విడదీయకమ్మా.అనేక నమస్కారములు.




No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...