Wednesday, May 30, 2018

MADHURAKAVI

సంభవామి  యుగే యుగే  సాక్ష్యములు హరి సైన్యములు
 ధర్మ సంస్థాపనమే  లక్ష్యమైన మన ఆళ్వారులు

 తిరుక్కోవలూరులోని పుణ్య బ్రాహ్మణ దంపతులకు
 విష్వక్సేనుని  అంశయె జన్మించెను  మధురకవిగ

 వయసులో చిన్నయైన నమ్మాళ్వారును గురువుగ దలచెను
 "వాలా ఇరుం" అనే దివ్య ప్రబంధమునే రచించెను

 గురుభక్తికి-గురుశక్తికి గురుతర రూపము తానై
 శంఖపీఠ పరీక్షలో విజయ శంఖమునే పూరించెను

 పెరుమాళ్ళ  అనంతానంత ధనరాశుల భాండాగారముగ
 అనన్య భక్తితో చాటెను ఆ నమ్మాళ్వారు మాహాత్మ్యము

 నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మది నిలుపుకొని
 పరమార్థముచాటి మధురకవి  పూజనీయుడాయెగ.



 నమ్మాళ్వారు-మధురకవి విష్ణుతత్త్వమను నాణెమునకు రెండు వైపులుగా మనము భావింపవచ్చును.
 రాతిని నాతిని చేసిన స్వామికొరకు రాయి నమ్మాళ్వారు మౌనమునకు భంగమును కలిగించి,లోకళ్యాణము చేయించగలను అని చెప్పకనే చెబుతూ మధురకవికి నమస్కరిస్తూ ,పెద్ద శబ్దముచేస్తూ క్రిందపడినది.అది మన నమ్మాళ్వారుకు నమోనారాయణ మంత్రమైనదో ఏమో,స్వామి ఆదేశమును పాలిస్తూ,జ్ఞాన కాంతులను నలుదిశలా వ్యాపింపచేసేటందుకో,మధురకవికి తన మధురమైన గురుత్వమునందించుటకో విప్పారిన నేత్రదర్శనమును ప్రసాదించినాడు.

  

 " సెత్తత్తిన్ వైయిత్ర్ల్
   సిరియాదు పిరందాల్

 యెత్తై తింద్రు?
 యెంగె కిడక్కుం?" తాత్వికతకు తార్కాణమైన ప్రశ్న ఇది.

  ఒక అచేతన వస్తువులోనికి ప్రవేశించిన సూక్ష్మ చైతన్యము అక్క ఏమి తింటుంది? ఎలా జీవించగలుగుతుంది?
  ఉదాహరణకు పెద్దబండరాయి కిందకు ఒక కప్పదూరింది.చాలా కాలము తరువాత రాయిని తొలగించి చూస్తే కప్ప అక్కడ సజీవముగా -సంతోషముగా ఉన్నది.ఇది ఎలా సంభవము?

  మన ఆళ్వారు మందహాసముతో మధురకవితో మాట్లాడిన మొదటి మాట 

"అత్తత్ తిండ్రు-అంగె కిడక్కుం"

 అక్కడ ఉన్నదే తింటుంది.అక్కడే జీవిస్తుంది.సర్వస్థితికారకుడైన శ్రీమన్నారాయుడు లేని చోటేది? కనుక ఏ జీవి అయినా,ఎక్కడున్న స్వామి దయతో పోషింపబడుతుంది.

  వెంటనే మధురకవి నమ్మాళ్వారునకు నమస్కరించి,వయసులో పెద్దవాడనైనప్పటికిని తనను శిష్యునిగా స్వీకరించమని గుర్భిక్షను పొందగలిగినాదు.గురువునే దైవముగా నమ్మి,గురు ప్రబంధములకు జనరంజకత్వమును-జగత్విఖ్యాతిని కలిగించుటకు ,అప్పటి ఛాందసవాదుల నెదిరించి శంఖ పరీక్షలో కృతకృత్యుడైనాడు.



  గురువు-శిష్యుడు,ప్రశ్న-జవాబు రెండు తానైన పరంధాముడు మధురకవిచే సందేహావిష్కృతమును చేయించినాడు.


 ఆ కాలములో ఒక చెక్క బల్లపై గ్రంధములను పెట్టి-గ్రంధకర్త కూర్చుని నీటిలో పయనించెడివాడు.సద్గ్రంధములు పైకి తేలుచు క్షేమముగా తిరిగి ఒడ్డునకు వచ్చెడివి.అర్హతలేనివి మునిగిపోయెడివి.దీనిని పరమ పవిత్రమైన శంఖపరీక్ష అని పిలిచెడివారు.మధురకవి తన గురువైన నమ్మాళ్వారు గ్రంధములను ఉంచి-గురువు నామమును వ్రాసి నీటిలో వదిలి,నిజతత్త్వమును నిరూపించెను.

 పరమపావనమైన పన్నెండు ఆళ్వారుల ప్రస్తుతి,"పెరియ తిరువందాది" లో చెప్పబడినట్లు,

  మనదరికి ,

 "కొణదాల్ దాన్,మాల్వరై దాన్
  ముకడల్దాన్-కూర్ ఇరుల్దాన్
  వందు అరల్పూవై దాన్-"

  నల్లని మేఘములు పరమాత్మే
  నల్లని పర్వతములు పరమాత్మే
  నల్లని కాళింది పరమాత్మే
  నల్లని చీకటి పరమాత్మే
  పూలపై వాలు తుమ్మెద పరమాత్మే" 

   అంతెందుకు సర్వము 

  "కృష్ణం వందే జగద్గురుం గా భాసించుచు-మనచే భావింపబడుచు సర్వ మంగళములను చేకూర్చుగాక.

  సర్వం శ్రీకృష్ణార్పణం.స్వస్తి.





No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...