Wednesday, September 12, 2018

APPAYYA DEEKSHITA MAARGABAMDHU STOTRAMU

మార్గబంధు స్తోత్రము-శ్రీ  అప్పయ్య దీక్షిత కృతము
*******************************************

 శంభో మహాదేవ శంభో 
 శంభో మహాదేవ దేవా
 శంభో మహాదేవ శంభో
 శంభో మహాదేవ దేవేశ- శంభో
 శంభో మహాదేవ దేవ.

1. తరిమింది జాబిలిని శాపం
   తరియించింది బాలేందు రేఖ కిరీతం
   కామ సంహారమే చేసింది నేత్రం
   శుద్ధ తేజస్వరూపం-భజే మార్గబంధుం భజే మార్గబంధుం.

2.త్రాగినది విషజ్వాల సర్పం
  వెన్నంటి నడిచినది శివుడే సమస్తం
  జతగూడె గంగమ్మ జగమేలు బంధం
  నిత్య చైతన్య రూపం- భజే మార్గబంధుం  భజే మార్గబంధుం.

3.నిత్యం చిదానంద రూపం
  కృతకృత్యం శార్దూల కరిచర్మ వస్త్రం
  దశకంఠ దర్పాతి నాశం
  భక్త మందార దైవం-భజే మార్గబంధుం  భజే మార్గ బంధుం

4.తొలగినది మన్మథుని  గర్వం
  నెలవైనది కంఠమున ఘనమైన గరళం
  కుంద మందార దంత దరహాసం
  కోటి సూర్య ప్రకాశం భజే మార్గ బంధుం భజే మార్గ బంధుం.

5.కామితము తీర్చేటి వృక్షం
  కవ్వపుగిరిని తలదన్ను దారుఢ్యం
  కడలి లోతును గెలుచు గంభీరం
  సదా సచ్చిదానందం- భజే మార్గబంధుం భజే మార్గ బంధుం.  

.6అప్పయ్యదీక్షితుల స్తోత్రం
 నిరాటంకముగ చేయించు నీదైన పయనం
 ఈడేర్చు కోరికలు తథ్యం
 ఈశుడే సాక్షి ఇలను ఇది నిత్యసత్యం

భవానీ సమేతం -భజే మార్గబంధుం  భజే మార్గ బంధుం.

      ( ఏక బిల్వం శివార్పణం.)

  నిర్హేతుక కరుణ మార్గబంధు స్తోత్రమును వినిపించి,నన్ను కలముగా మలచుకొని పై స్తుతిని వ్రాసుకొనినది.

 అద్వైత సిద్ధాంతమును అవగతము చేసికొనిన,శ్రీ అప్పయ్య దీక్షితులు  విరించిపట్టణం వేలుపైన పరమేశుని,మాసదాశివుని మార్గ బంధువుగా గుర్తించి,ప్రయాణ సమయమునకీర్తించినది, ఈ స్తోత్రము.వివిధ శరీరములలో ఈ జీవి ప్రయాణములు అనంతములు.వాటిని సన్మార్గమున నడిపించమని వేడుకొనుటయే ఈ స్తోత్ర ప్రాశస్త్యము.
 దక్షునిచే శాపగ్రస్థుడై,కడలిని దాగినచంద్రుని శాపవిముక్తునిచేయుటయే కాక,తన సిగపూవుగా అలరారుటకు కారణుడైన పరమేశుని .భజించుచున్నాను.

  క్షీరసాగర మథనమున హాలాహలమును త్రాగువేళ,సహాయకారులై తామును విషమును గ్రహించి,స్వామికి ఆభరణములై ప్రకాశించుటకు మార్గమును చూపిన నాగాభరణునికి నమస్కరించుచున్నాను.

   మార్గ ముడులను విడిపించి,సన్మార్గమును చేర్చు త్రినేత్రుని భజించుఅదృష్టమును  స్వామి అనుగ్రహించును గాక.

         ( ఏక బిల్వం శివార్పణం.)

  ఓం తత్ సత్.
.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...