సదాశివాష్టకము
*************
1.స్వర్ణపద్మ సరోతీర సుందర మందిరవాసినే
అనంతకోటి సూర్యతేజ గరుడగమన సేవితే
ఫణిపతి కర్ణకుండల పాహి పార్వతీసమేత
సదానమశ్శివాయతే సదాశివాయ శాంభవే.
2.భాగీరథిసహిత బాలేందు చంద్ర ధారియే
భానుచంద్ర పావక భాసిత త్రినేత్రయే
భుజంగరాజ కుండలే బుద్ధిశాలి బాంధవే
సదా నమశ్శివాయతే సదాశివాయ శంభవే.
3.చతుర్ముఖానన వినుత చతుర్వేద కీర్తితే
చతుర్భుజానుజ సమేత శరీర దివ్యతేజసే
చతుర్విధప్రదాత చతుర తాండవ ప్రియే
సదా నమశ్శివాయతే సదాశివాయ శంభవే.
4.శరత్చంద్ర కాంతులీను మందహాస మంజుల
పగడపెదవి ప్రతిఫలించు ముఖప్రకాశ సుందర
బ్రహ్మపుర్రె చేతదాల్చు సిరులతల్లి సోదర
సదా నమశ్శివాయతే సదాశివాయ శంభవే.
5. హరి సహస్ర కమలములతో ప్రారంభించెను వ్రతము
హరులీలన కానరాదు పూజకు చివరి కమలము
హరినేత్రము కమలమాయె వరమాయె సుదర్శనము
సదా నమశ్శివాయతే సదాశివాయ శంభవే.
6.ధరాతలము రథము సారథి విధాత
ధనువు పసిడికొండ శరము చక్రధారి
అనంతుడల్లెత్రాడు హయములు శృతములు
సదా నమశ్శివాయతే సదాశివాయ శంభవే.
.7. ఉగ్రరూప వీరభద్ర దర్శన భయభ్రాంత
విగ్రహ,దక్షయాగ భీతజన రక్షణాయ
నిగ్రహించరాని నిఖిలార్తనాద శ్రవణాయ
సదా నమశ్శివాయతే సదాశివాయ శంభవే.
8. దండపాణి మృకండముని తనుజ రక్షణే
మంగళ గళ ప్రకాశ సుధచంద్రధారిణే
అఖండ భక్తపాల అంత్య ముక్తిదాయినే
సదా నమశ్శివాయతే సదాశివాయ శంభవే.
9. బ్రహ్మ విష్ణు మహేశ సహిత దేవతాది
నిత్య నిత్యమార్చిత హిత పాదపంకజాయ
రజతసభ విరాజమాన మధుర రాజాయ.
నమశ్శివాయతే సదాశివాయ శంభవ
10.హాలస్య నాథాయ మహేశ్వరాయ
హాలాహలాంకృత కంధరాయ
మీనేక్షణపతయే శివాయ
నమః శివ సుందర తాండవాయ
ఇది శివానుగ్రహ పాత్రుడు పతంజలి ఋషి విరచిత హాలస్యపురాణాంతర్గత సదాశివష్టకము.దీనిని చదివిన,వినిన,స్మరించిన,కనీసము విమర్శించినను శివానుగ్రహపాత్రులగుదురని సాక్షాత్తు పరమేశ్వరుడే పతంజలికి సెలవిచ్చెనట.
యధావిధిగా ఏమాత్రమువిషయపరిజ్ఞానములేని నా దుస్సాహమును మన్నించి,నిర్హేతుక కృపతో సదాశివుడు తన స్తుతిని తానే వ్రాసుకున్నాడు.లోపములు నా అజ్ఞాన సూచితములు.శివస్వరూపులు పెద్దమనసుతో నన్ను క్షమించి,ఆశీర్వదించెదరు గాక.
( ఏక బిల్వం శివార్పణం.)
ఓం తత్ సత్.
No comments:
Post a Comment