Tuesday, April 30, 2019

NAH PRAYACHCHAMTI SAUKHYAM-19

    నః ప్రయచ్చంతి సౌఖ్యం-19
    ******************************

  భగవంతుడు-భక్తుడు మేకను గౌరవించిన వారే

  " ఇమాగం రుద్రాయ తవసే కపర్దినే క్షయద్వీరాయ ప్రభరామహే మతిం
    యథాసశ్శమసత్ ద్విపదే చతుర్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురం."

    రుద్రదేవా! మా పుత్రులు-పౌత్రులు-బంధువులు,గోవులు,మిగిలిన పశు సమూహములకు సుఖము కలిగించుము,అందరిని పుష్టిగా ఉంచుము.ఎట్టి ఆపద రానీయకము.స్వామి నీకు అభిషేకము పూజలతో ఆరాధించి,ఆనందించెదము.

   " ఏకాదశ మహారుద్రైః అతిరుద్రః ప్రకీర్తితః
     అతిపాప హరో యస్మాత్ దృష్ట్వాన్యానైవ నిష్కృతిః."

    రుద్రముల పారాయణ-అభిషేకము-హోమము ఏదీయినను పాపక్షయము,పరమశివుని అనుగ్రహమును,ఐహిక-ఆముష్మిక శ్రేయస్సును-శుభమును-సుఖములను-ఇన్ని మాటలేల ముక్తిని కలిగించుననుట నిర్వివాదము.


   అగ్నినేత్రుని అగ్నికార్యముతో అర్చించు మహానుభావులెందరో .హవిస్సును అందించి ఆశీస్సులను అందుకొను అదృష్టవంతులు అసంఖ్యాకులు.అదే విధముగా ఒకసారి బ్రహ్మగారు చేయుచున్న యజ్ఞమునకు పరమేశ్వరుడు ప్రత్యక్షముగా విచ్చేసి యున్నాడు.అదే యజ్ఞమునకు వచ్చిన బ్రహ్మగోటినుండి జన్మించిన పదిప్రజాపతులలో ఒకరైన దక్షప్రజాపతి  తనను శివుడు నిలబడి నమస్కరించక ,అవమానము చేసినాడను కోపముతో తానొక నిరీశ్వర యాగమును చేయ సంకల్పించెను.దధీచి మహాముని అరిషడ్వర్గములకు లోనై ,మానసిక దౌర్బల్యముచే యజ్ఞ మర్యాదను ఉల్లంఘించరాదని,అల్లుడైన పరమేశ్వరుని ఆహ్వానించకుండుట అనర్థదాయకమని నచ్చచెప్ప చూసినను దక్షుడు వినలేదు.సమర్థుడు అనుపేరునకు కళంకమును స్వాగతిస్తూ కానిపనికి కాలుకదిపెను.

   " అధ్యవోచదధివక్తా ప్రధమో దైవ్యో భిషక్."

   రుద్రభగవానుడు దేవతలలో ప్రథముడు ప్రధానుడు.భక్తుల మనోవ్యాధులను-శరీర వ్యాధులను పోగొట్టు వైద్యుడు.
సమయ సందర్భములను బట్టి,కర్మాచరణమును బట్టి ఫలితములను అందించువాడు.ఇక్కడ అదే జరిగినది.సతిదేవి దక్షపుత్రికగా తనువును చాలించునది జరిగిన అవమానమునకు ఫలితముగా.ఇది లౌకికము.జగన్మాత స్వామి వైభవమును లోకవిదితము చేయ సంకల్పించినది.అష్టాదశ శక్తిపీఠ ఆవిర్భావమునకు నాందిపలికినది.జగన్మాత నమో నమః-జగదీశ్వర నమోనమః.

 " ఘోరేభ్యో-అఘోరేభ్యో-ఘోరాఘోర తరేభ్యో నమో నమః"

  సతివియోగమును గ్రహించిన స్వామి తనజటనుండి వీరభద్రుని సృష్టించి,చేయవలసిన కార్యమును చేవగలవానికి అప్పగించెను."నమో వీరభద్రాయా".
యజ్ఞమును ధ్వంసముచేసిన వీరభద్రుడు,రుద్రుడై తన కరవాలముతో అహంకార తిమిరమైన దక్షుని శిరమును ఖండించెను.అమంగళము ప్రతిహతమగుగాక.సకల్దేవతలు సదాశివుని ప్రార్థించగా,తన యోగమాయతో మేకను సృజించి,దాని శిరమును ఖండించి దక్షుని శరీరమునకు అతికించి,పునర్జీవితుని చేసెను.వితండవాదమును చేయక వినయముతో నడచునది మేక.అహంకారము అంతరించిన దక్షుడు అభినివేశముతో మహాదేవుని అర్చిచి చరితార్థుడైనాడి.ఇక్కడ శివునిచే తుంచివేయబడినది దక్షుని అహంకారము.పునర్జీవితుని చేసినది స్వామి మమకారము.దేహభ్రాంతిని పోగొట్టినది కొత్తరూపము.తరించినది మేకజన్మము.శివలీలను అర్థముచేసుకొనుటకు మానవమాత్రులమైన మనకు సాధ్యము కాదు.కనుక మరొక ఆలోచలక మహేశుని శరణువేడుదాము.హర హర మహాదేవ-శంభో శంకరా. -శరణు.

  పుత్తూరు ప్రాంతమునకు చెందిన మహాశివభక్తుడు బ్రహ్మయ్య.కంసాలి పని కులవృత్తి.అయినప్పటికి తనకు కిన్నెరవాయిద్య నాదముపై నున్న ప్రీతితో పుత్తూరును వదిలి కళ్యాన నగరమునకు వచ్చి,కిన్నెర వాయిద్యముతో శివమహిమలను కథలు కథలుగా చెప్పుచు మురిసిపోయేవాడు.అతని కథలు వినుటకు సాక్షాత్ శివుడే బసవడు రూపములో వచ్చి విని ఆనందించి,ఆశీర్వదించేవాడట.

  " ఓం త్రిపురాంతకునిపై వచనములను రచించి పాడుతు పరమానందమును పొందేవాడు.

 బ్రహ్మయ్య " నమో జఘన్యాయచ-బుధ్నియాయచ" జఘనభాగమునుండి జన్మించిన వానియందు,మూలభాగమునందు జన్మించిన వానియందు పరమేశ్వరుని దర్శించగలిగేవాడు.భూతదయకలిగి వుండటమే భూతనాథుని ప్రియమని మిక్కిలి ప్రేమతో సకలజీవులను సాకుతుండెడి వాడు.మూడుకన్నుల వానికి బ్రహ్మయ్యను పరీక్షించాలని వేడుక కలిగినది.మేకపిల్లయై గడ్డిఉన్నచోట్లకు మేతకు వచ్చాడు.మేత తానే-మేసేది తానే అయినవాడు.

 " లోప్యాయచ-ఉలప్యాయచ నమోనమః" గడ్డి మొలిచే ప్రదేశములమును-మొలవని ప్రదేశములము చైతన్యమైన రుద్రా నీ లీలలు కడురమ్యములు.కామితార్థములు.కళ్యాణప్రదములు.కాకపోతే మేతమేయుచున్న మేకదగ్గరికి కసాయి వచ్చి కాటువేయ చూస్తున్నాడు.కాటికాపరి ఆన కాదనగలడా కసాయి? కిన్నెరబ్రహ్మయ్య మేకను కసాయిని చూశాడు.కపర్దికి కావలిసినది కూడ అదేకదా.కాబోవుదానిని కళ్ళింతచేసుకొని చూస్తున్నాడు.బ్రహ్మయ్య కసాయిని సమీపించి,అయ్య దీనిని బాధింపకుడు.మీరు తగిన ధమును తీసుకొని,మేకను వదిలివేయండి అని వేడుకొన్నాడు.ధరను పెంచి పెంచి మేకకు బదులు కిన్నరి బ్రహ్మయ్య తలను కోరాడు కసాయ.పరమానందముతో తన త్లను కాసాయిని నరకమని అప్పగించాడు బ్రహ్మయ్య.మేకను హింసించవద్దని మాటతీసుకున్నాడు మహాదేవుని భక్తుడు.

 " నమో వాస్తవ్యాయచ-వాస్తుపాయచ"

  సకల జీవులలో అంతర్యామియై ఉన్నవాడు-సకలజీవులను రక్షించువాడు సాగనిస్తాడా కసాయి ఆటను? క్షణములో కనిపించి కిన్నరి బ్రహ్మయ్యను కైలాసమునకు రప్పించుకున్నాడు.ప్రమథగణములతో స్థానమిచ్చి జీవిత పరమార్థమును అందచేశాడు ఆ ఆదిదేవుడు.
 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.

   ( ఏక బిల్వం శివార్పణం)
  ( ఏక బిల్వం శివార్పణం.)

Sunday, April 28, 2019

NAH PRAYACHCHANTI SAUKHYAM-18

     నః ప్రయచ్చంతి సౌఖ్యం-18
    **************************

  భగవంతుడు-భక్తుడు నాదమయులే-నాద ప్రియులే

   " నాదతనుం అనిశం శంకరం-నమామి మనసా-శిరసా"  త్యాగరాజులవారు.

  ప్రణవమే పరమేశ్వరుని శరీరము.అనిశము ఎల్లప్పుడు ప్రణవమును స్మరిస్తుంటుంది.ప్రణవము "ఓం" సూక్ష్మము,"ఓం నమః శివాయ" స్థూలము.అంతేకాదు స్వామి డమరుకము సైతము పంచాక్షరిని శబ్దిస్తూనే ఉంటుంది.( అక్షరాభ్యాస సమయమున)ఓ పరమేశా నీ అనుగ్రహ నాదమును మా పిల్లలపై వర్షించమని ప్రార్థిస్తుంటారు.

  " బ్రహ్మ మురారి సురార్చిత లింగం -నిర్మల భాసిత శోభిత లింగం "మొదటి సారిగా పరమేశ్వర తత్త్వమును గ్రహించిన బ్రహ్మ-విష్ణులు అగ్నిస్తంభము నుండి వెలువడినస్వామిని దర్శించి స్తుతించినవి. ఆదిదేవుడు,తన సద్యోజాత-వామదేవ-అఘోర-తత్పురుష-ఈశానాది ఐదు ముఖముల నుండి పంచాక్షరిని-సప్తస్వరములను ప్రకటించి నాదమయముగా మలిచాడట.

  " ఓం నమో శ్రవాయచ-ప్రతిశ్రవాయచ" ధ్వని-ప్రతిధ్వని రెండును తానైన పరమేశ్వరా ప్రణామములు.త్రికరణశుద్ధిగా చేయుచున్నాను అంటున్నాడు త్యాగయ్య.మనసా-వచసా-శిరసా.స్వామి పాదముల వద్ద శరణాగతి కోరుట,తాను అన్న అహమును వీడుట శివోహం.

    అమ్మ పార్వతి ఒకసారి స్వామి,  యోగులు మిమ్ములను ఓంకార పంజరమునందున్న శుకముగా భావించి,ఓంకారముతో లీనమైన మిమ్ములను దర్శించి,ఆత్మానందమును ఆస్వాదిస్తారట.అన్యమేమి కోరరట.నాలో మీ వీణావాదనమును వినవలెనను కోరిక బలపడినది.మీ భక్తురాలను అనుగ్రహించమని అర్థించినది.

జగత్కళ్యాణమునకై జనని నెపమును తనమీద వేసుకొన్నది.వెంటనే స్వామి రెండు గుమ్మడికాయలతో అద్భుత రుద్రవీణను సంకల్పమాత్రముననే సృజించి తన వాదనముతో శృతులను శుభకరముగా నినదింపచేసినాడట.ముగ్గురమ్మల మూలపుటమ్మ దయతో  ముల్లోకములకు ముక్తిసోపానము లభించినది.

 " పార్వతీ పరమాదేవీ బ్రహ్మవిద్యా ప్రదాయినీ
   తస్మాత్ సహతయా శక్త్యా హృది పశ్యంతి యే శివం"

   బ్రహ్మవిద్యను అనుగ్రహించుతల్లి స్వామితోకూడి నా మనమున వసింపుము.నమోవాకములు.

  " నమః ప్రతరణాయచ-  ఉత్తరణాయచ."

   భక్తుని విషయానికొస్తే,
 " మోక్షము కలదా భువిలో,జీవన్ముక్తులు కానివారలకు
   సాక్షాత్కార సద్భక్తి సంగీతజన్న విహీనులకు కలదా
   మోక్షము  రుద్రా! నీ ప్రణవనాదము సప్తస్వరములై పరగ
   వీణావాదన లోలుడౌ శివ మనోరథమెరుగని వారికి," అంటూ

 నిరంతరము నిటలాక్షునికి నాదనీరాజనమొనరించు నాయనారు ఎరుక్కులం పులియర్ అందున్న " ఎళ్" వాయిద్యప్రసిద్ధుడు,వాయిద్య నామముచే ప్రసిధ్ధిపొందిన ఎళుప్పరనార్ నాయనార్.

శివభక్తులకు  తన నాదసంకీర్తనచే కొలిచెడివాడు.అది నారద మహతీనినాదమో,సర్వేశ్వర కృపా కాసారమో,ఎళ్ మంగళవాయిద్యమో ఎవరు గుర్తించలేని దైవగాంధారము వలె దిగంతములు మారుమ్రోగుతూ,దిగంబరుని స్తుతించెడి.కర్ణామృతమై ఆనందార్ణవమున ఓలలాడించెడిది.

ఈ విషయము నారదుని వలన వినిన కపర్దికి కనులారాగాంచాలను వేడుక కలిగినది.ఎంతైనా," నమః కృత్స్నవీతాయ ధావతే సత్వనాం పతయే నమః" జగమంత వ్యాపించియుండి దూడ వెంట నడచు గోవు వలె భక్తులను అనుసరించుస్వామి కదా.అంతరార్థమెవరికి తెలుసు కాదు ఎవరు తెలిసికొనగలరు?

  అతిథిరూపములో వచ్చిన స్వామికి అన్నిమర్యాదలు చేసి,ఆహ్లాదపరచుటకై తన ఎళు వాయిద్యమును వినిపించసాగెను.శిశుర్వేత్తి-పశుర్వేత్తి-వేత్తి గానరసం ఫణి.పశుపతిని కరిగించి-కరుణించనీయదా.అసలే మంచుకొండమీద నుండు మంచిగుండె స్వామి.తల్లి తనయులతో సహా ప్రత్యక్షమై పరమావధిని చూపాడు అవధులు లేని ఆనందముతో ఆ నాయనారును ఆశీర్వదించి అక్కునచేర్చుకున్నాడు

" నమో శంభవేచ-మయోభవేచ"

  ఇహ-పర సౌఖ్యములను ప్రసాదించు ఈశ్వరా నమోవాకములు.నీ యందలి నిశ్చల భక్తిని నిలిచియుండనీ శివా.

.అంతా తానైన సామి అందరిని కరుణించును గాక.

 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.

   ( ఏక బిల్వం శివార్పణం)

  ( ఏక బిల్వం శివార్పణం.)



Saturday, April 27, 2019

NAH PRAYACHCHANTI SAUKHYAM-17



  నః ప్రయచ్చంతి సౌఖ్యం-17
  ****************************
 భగవంతుడు- భక్తుడు మీడుష్టులే

   సంపదలను వర్షించువారే.
 "మీడుష్టమ శివతమ శివోనస్సుమనా భవ"

 మిక్కిలి శాంతము గలిగినవాడు శివతముడు.అంతేకాదు భక్తులపై వారి కోరికలను అమితముగా వర్షించు రుద్రునకు నమస్కారములు.

  " నమో బృహతేచ-వర్షీయసేచ" సద్గుణ సంపన్నుడై సంపదలను గుణములను వర్షించువానికి నమస్కారములు.

  కుబేరుడు సదాశివుని ముందు చేతులు కట్టుకొని నిలబడతాడట.ఎవరా కుబేరుడు? ఏమా కథ? కుబేరునికి సంపదలను వర్షించిన కపర్ది మాకు సౌఖ్యమును ప్రసాదించుము.శివోహం.

  ఉత్కళరాజ కుమారుడైన దమనకుడు పరమ శివభక్తుడు.పూర్వజన్మల సంస్కారమును పుణికిపుచ్చుకొన్నవాడు.గతజన్మల గురుతులతో తన గమ్యమును తెలిసికొని ,గంగాతీరమున శివలింగమును ప్రతిష్టించుకొని ప్రార్థించుచుండెడి వాడు.

 " నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీడుషే" స్వామి నీవు సహస్రాక్షుడవు.అనంతదర్శన శక్తిసంపన్నుడవు.జగత్కళ్యాణమునకై  గరళమును కంఠమునందుంచుకొనిన నీలగ్రీవుడవు.భక్తుల మనసెరిగి వారికి శుభములనందించు కృపావర్షుడవు.నా మనసెరిగి నన్ను నీదరి చేర్చుకో తండ్రీ అని అచంచల భక్తివిశ్వాసములతో అభిషేకించుచుండెను.

 " నమో శంభవేచ-మయోభవేచ" అంటూ మరి మరి స్తుతులు చేసేవాడు.క్షిప్ర ప్రసాదుడైన భోళాశంకరుడు ప్రత్యక్షమై,దమనకునికి దివ్యశరీరమునిచ్చి "కుబేరుడు" అని పేరుపెట్టెను.ఉత్తర్దిక్కునకు అధిపతిని చేసి ఆశీర్వదించెను.అవధులు పొంగిన అనురాగము అంతటితో ఆగక శివుడు తన సంపదలను కుబేరునకు అందించి,దానినీర్హులైన వారికి అందీయమని ఆనతిచ్చినాడు.

 కుబేరుడు వినయవిధేయతలతో స్వామి కార్యమును సమర్థవంతముగా నిర్వహిస్తూ," ద్యుమ్నే వాజే భిరాగతం" స్వామి మీరు ధనమును అన్నమును కూడిన వారై రండి అని ప్రార్థించాడు.

   భక్తుని విషయానికొస్తే తిరుమునైప్పాడి ప్రాంతముననరసింగమునైయార్ అనురాజు నిత్యశివభక్తుడు.అంతేకాకుండ శివభక్తులను శివస్వరూపములుగా భావించి,అర్ఘ్యపాద్యములనించ్చి,అతిభార బంగారునాణెముల మూటను సంభావనగా ఇచ్చి సంతృప్తిని పొందెడివాడు." " ఓం నమః శ్లోక్యాయచ-అవసాద్యాయచ" సర్వేశ్వరా వైదిక మంత్రములందును వేదాంతమునందున్న చైతన్యము నీవే చిదానందా చిరంతభక్తిని ప్రసాదించుము స్వామి.నీ దాసానుదాసుని కరుణించుము దక్షగర్వభంజనా అని అదే ధ్యాసలో ఉండేవాడు.

  పవిత్ర ఆరుద్రనక్షత్రమును అత్యంత వైభవముగా జరిపించెడివాడు.ఆర్ద్రనిండిన స్వామి జీవిత పరమార్థమునీవేనంటు నిష్కాముడై నీలకంఠుని కొలిచేవాడు.


 ప్రసన్నతను పొందవలెనన్న పరీక్షను అధిగమించవలసినదే కదా.ప్రశ్న-జవాబు ధ్వని-ప్రతిధ్వని కారుణ్యము-కాఠిన్యము ఘోరము-అఘోరము అనీ తానైన స్వామి భక్తులకు పరీక్షలలో భగవత్తత్వమును  లోకవిదితముచేయుటకు
అడుగులు కదపసాగాడు ఆ రుద్రుడు.బాహ్య-అభ్యంతరశుచియై.మూడుకన్నులవాడు నాయనారుతో ఆడుల్కోవాలనుకున్నాడు.విచిత్రవేషమన విపరీతముగా బూడిదను పూసుకున్నాడు.వింత వస్త్రములను ధరించాడు.కొంత తెలిసి-మరికొంత తెలియనివాని వలె నాయనారు చెంతచేరాడు.ఘోరేభ్యో-అఘోరేభ్య్శ్చ నమోనమః.విచిత్ర అతిథిని చూసి వింతగ బుగ్గలు నొక్కుకున్నారు వాని బుగ్గిపూతలను చూసి.సిగ్గుఎగ్గులేని వాని సరసను కూర్చునటకు కాని,వానితో మాటలాడుటకు వారికి మనస్కరించలేదు.సరికదా గేలిచేయసాగారు మాయను గెలువలేనివారు.

 " యద్భావం-తద్భవతి" హరోమ్హర.అవ్యాజకరుణాసింధు అనుగ్రహించినావా ఆదిదేవ అంటూ అతిథిని అయంత భక్తితో ఆహ్వానించాడు." ఓం నమో అగ్రియాయచ-ప్రథమాయచ" అని స్తుతిస్తూ అర్ఘ్యపాద్యములను సమర్పించాడు.గంగాధర అంటూ
అభినివేశముతో అభిషేకముచేశాడు.చంద్రధ్హరికి చందన సమర్పణగావించాడు.త్రిగుణాతీతునికి బిల్వార్చన చేశాడు.అంధసస్పతికి కడుపునిండా అన్నముపెట్టి,తాంబూలాది సత్కారములతో పాటుగా ద్విగుణీకృతమైన బంగరు నాణెములమూటను సంభావనగా సమర్పించి,సాష్టాంగ నమస్కారములు చేస్తున్నాడు నాయనారు.

" నమోనమః అనిర్హతేభయః" సకలజీవుల సర్వపాపములను సమూలముగా హరించివేయు సర్వేశ్వరా ఇక్కడివారినందిరిని కరుణించుము స్వామి అని ప్రార్థించాడు.శివభక్తుని సంతోషపరచుట శివకర్తవ్యముగా అనుకొని స్వామి వారిని పునీతులనుచేసెను.అంతే కాకుండా నరసింగ నాయనారునకు కైవల్యమును ప్రసాదించి,కైలాసవాసిని చేసెను.కరుణసింఢువైన స్వామి మనలను అనుగ్రహించుగాక.
 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.

   ( ఏక బిల్వం శివార్పణం)

  ( ఏక బిల్వం శివార్పణం.)

Friday, April 26, 2019

NAH PRAYACHCHANTI SAUKHYAM-16

   నః ప్రయచ్చంతి సౌఖ్యం-16
   ************************

   భగవంతుడు జలస్వరూపుడు-భక్తులు జలస్వరూపులు.

    " ఓం నమో శీభాయచ శుభకరాయచ"

    ప్రసాదగుణముతో ప్రవహించు పరమేశ్వరునకు నమస్కారములు.


  పంచభూతలలోనిదైన జలము భూతలము నాలుగింట మూడు వంతులు చలమలు,మడుగులు,తటాకములునదులు,సముద్రములవంటి ఉపరితలజలములతో కూడి ఉంటుంది.ఇది మనకంటికి కనపడు స్థూలతత్త్వము.

 జలము జీవుల శరీరములలో 70 నుండి 90 శాతము వరకు ఉండి మానవశరీరమును అతి సమర్థవంతముగా పనిచేయిస్తుంది.ఇది జల సూక్ష్మ తత్త్వము.స్థూల తత్త్వముగోచరమయితే సూక్షము అగోచరము చర్మచక్షువులకు.నిశితముగా పరిశీలిస్తే స్థూలములోను-సూక్ష్మములోను ఈశ్వరచైతన్యముగా ప్రకాశించు జగదీశ్వరుడే జలము.

  "ఓం నమో వైశంతాయచ"

   "విశ్వేశ్వరుడే విశ్వవ్యాప్త ద్రావణి"


  పంచభూతలలోనిదైన జలము భూతలము నాలుగింట మూడు వంతులు చలమలు,మడుగులు,తటాకములునదులు,సముద్రములవంటి ఉపరితలజలములతో కూడి ఉంటుంది.ఇది మనకంటికి కనపడు స్థూలతత్త్వము.

 జలము జీవుల శరీరములలో 70 నుండి 90 శాతము వరకు ఉండి మానవశరీరమును అతి సమర్థవంతముగా పనిచేయిస్తుంది.ఇది జల సూక్ష్మ తత్త్వము.స్థూల తత్త్వముగోచరమయితే సూక్షము అగోచరము చర్మచక్షువులకు.నిశితముగా పరిశీలిస్తే స్థూలములోను-సూక్ష్మములోను ఈశ్వరచైతన్యముగా ప్రకాశించు జగదీశ్వరుడే జలము.

  "ఓం నమో వైశంతాయచ"

   "విశ్వేశ్వరుడే విశ్వవ్యాప్త ద్రావణి"

  జలపాతములలా కొండలపైనుండి జారుతూ,మేఘ గర్జనలతో వర్షముగా మారుతూ,భూగర్భమునదాగి అదనుచూసి పైకి ఉబుకు జలమును,నీరు-తోయము-ఉదకము-పయస్సు-గంగ-తీర్థము మొదలగు పవిత్రనామములతో సంభావిస్తారు.

 " ఓం నమో నివేష్యాయచ." మంచు బిందువుల రూపమునప్రకాశించు రుద్రునకు నమస్కారము.మంచుకొండను నివాసము చేసికొనిన శివా!నీ పాదపీఠమును మానస సరోవరము మజ్జనమునుచేసి మహదానందపడుతోంది.

   " ఓం నమో నాద్యాయచ."

 అంతేకాదు అతి పొడవైన నదులు సింధు-బ్రహ్మపుత్ర-సట్లజ్ గంగానదికి ఉపనదులైన కర్నాలి మొదలగు నదులు కైలాస పర్వతము దగ్గర కైవల్య ప్రాప్తికై పరుగులు తీస్తున్నాయి.

  ఇంకా పెద్దలు ఏమిచెబుతారు అంటే ప్రళయకాలమున పరమేశ్వరుడు ప్రత్యేక మేఘములను ఆవిష్కరింప చేసి ప్రపంచమును జలమయము చేస్తాడట.అప్పుడు గోచరమయ్యేది కేవలము జలము-జలధారి.

   జలరూప లింగా-జంబుకేశా నమో నమః.

   తెల్ల నేరేడు వృక్షములు ఎక్కువగా గల ప్రదేశము జంబుకేశ్వరము." తిరువనై కానల్" గా ప్రసిద్ధిచెందినది.స్వామి ఈ క్షేత్రమున విశేష పూజలను ఏనుగులచే అందుకుంటాడట.భక్తులు అమ్మవారైన అఖిలాండేశ్వరి దేవిని-స్వామిని గురుశిష్యులుగా భావించుటచే ఇక్కడ స్వామి వారి కళ్యాణము నిషేధము.

   స్వామి వారి పాన వట్టము నుండి నిరంతరము జలము ఊరుతుంది కనుక స్వామిని " నీర్ తిరళ్ నాథర్" అని ప్రేమతో పిలుస్తారట." ఓం" నమో నీప్యాయచ"-కొండపై జారు నీటియందుండు స్వామి కోటి కోటి దండాలు.


  జలస్వరూపుడైన జలధారిని స్పర్శించి సంస్కరింపబడిన వారి సచ్చరితములు కార్తిక-మాఘ పురాణములందు కోకొల్లలు.మృకండ మహాముని-మనస్విని దంపతుల మాఘస్నాన ఫలితమే మార్కేండేయునికి కలిగిన ఈశ్వరానుగ్రహముగా భావిస్తారు.

  ఇంకొక విశేషమేమిటంటే కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరంలో స్వామి సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే జలమునుండి బయటకు వచ్చి దర్శనమిస్తాడట.స్వామి జలతత్త్వమును చెప్పుటకు వేయితలల ఆదిశేషునకైన సాధ్యముకాదు.అతి సామాన్యురాలను నేనెంత? అశేషకరుణామయుని అనుగ్రహమును పొందిన భక్తుల అద్భుత కథలను తెలిసికొందాము. విశ్వేభ్యో-విశ్వరూపేభ్యో నమో నమః.


  బసవేశ్వరుడూ బిజ్జలమహారాజునకు ఇలా వివరిస్తున్నాడు.తిరుచిత్తంబులుడనే శివభక్తుడు స్వామికి పత్ర పుష్పాలను బుట్టలో పెట్టుకుని పోవుచుండగా  వాన నీటిబురదలో జారిపడబోవగా శివయ్యను తలుచుకున్నాడు." ఓం నమో సూద్యాయచ." బురద యందుండు రుద్రా నన్ను రక్షించు అని వేడుకున్నాడు.అంతే క్షణాల మీద శివుడాతనిని కాపాడాడు.రాజుగారు భక్తుని కాలికంటిన బురదను చూసి,సత్యము తెలిసికొని సదాశివ భక్తుడైనాడు.

 ఓం భవస్య హేత్యై జగతాం పతయే నమః" భవసారమును ఛేదించు చంద్రశేఖర నమస్సులు.

   కొలిచినను-కొలువకున్నను తన బిడ్డలు బాధపడుతుంటే వారిని కాపాడకుండా ఉండగలడా పశుపతి." ఓం పశూనాం పతయే నమః".స్వకార్యము చేయుటయే కాని స్వామికార్యము విషయమును గ్రహించలేని దూడమల్లయ్య కుష్ఠువ్యాధితో బాధపడుతున్నాడు.పూర్వజన్మల పాపములు వ్యాధిరూపేణ పీడితా చేసినవి.అనుగ్రహించ దలచిన ఆదిదేవుడు ఆవుదూదను కారణముచేసి ఆదివ్యాధులను తొలగింప దలిచాడు.మల్లయ్య దూడ భవబంధములను తెంచుకొని భవుని దర్శించగా మల్లయ్య ఇంటిలో కట్టిన దుంగనున్న తాడును తెంచుకొని పచ్చికమేయుటకు పరుగులు తీయసాగినది.
" ఓం నమః ఉర్వర్యాయచహ-ఖల్యాయచ.' పంటభూమి-భూమిలో పాతిన గుంజ రెండు తానైన స్వామి దూడను గుంజనుండి విడిపించి పచ్చిక తినుటకు పంపించాడు ప్రణాలిక ప్రకారము.తెల్లవారి లేచి దూడ కానరానందున వెతుకుటకు బయలుదేరాడు వివరము తెలియని వాడు.దూడ పచ్చికను తిని త్రాగునీటికై,గట్ల వెంట,ఇరుకు చలమల వెంట నడవసాగినది నందీశుని ఆన నడిపిస్తున్నది.దానిని అనుసరిస్తు మల్లయ్య తానును నీటిలో బురదలో దిగి వంటినిండ కపర్ది కరుణ అను బురదను అలుముకొని వెంబడిస్తున్నాడు తన దూడలో దాగిన పశుపతిని.పని అయిపోయినదేమో ప్రశాంతముగా వెనుదిరిగి మల్లయ్య వెంట మరలివచ్చినది దూడ.

 " ఓం నమో అనిర్హతేభ్యః." పూర్తిగా పాపములను నాశనముచేయు రుద్రునకు నమస్కారము.జంగమదేవర జలస్పర్శచే పునీతుడైన మల్లయ్య బురదను కడుగుకొనగా మహాదేవుని మహిమ యన బురదతో పాటు తన కుష్ఠువ్యాధి దూరమై శరీరము ప్రకాశించసాగెను.మనసును మాలిన్యమును తొలగించుకొని స్వామిపాద నిర్మాల్యమైనది. ఎందరో భక్తులు పవిత్ర తీర్థములలో స్నానమాచరించి,కర్మ విముక్తులై,కైవల్యమును పొందిరి.

 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.

   ( ఏక బిల్వం శివార్పణం)

  ( ఏక బిల్వం శివార్పణం.)



.


























 







 

   

Sunday, April 21, 2019

NAH PRAYACHCHANTI SAUKHYAM-15

      నః ప్రయచ్చంతి సౌఖ్యం-15
     *******************************
 భగవంతుడు-భక్తుడు ఇద్దరు వృక్షములను రక్షించువారే.

  ' నమో వృక్షేభ్యో హరికేశభ్యః."

   స్థితికారుడుగా పరమాత్మ విశ్వపాలన చేయుటే వృక్షరక్షణ.దానిని పోషించునవి హరికేశ్వములు.ఆకుపచ్చని కొమ్మలు-రెమ్మలు.పువ్వులు-పండ్లు.ఆచ్చాదనయే పరమాత్మ తత్త్వము.విజ్ఞానమనెడి వృక్షము రుద్రుడైనప్పుడు వేదములు-వేదాంగములు హరికేశములు.దానిఆకులు-కొమ్మలు.శ్రీసైల పర్వత ప్రాంతములో వృక్షములు జరుగుట ఎందరో మహానుభావులు దర్శించినారట." ఊర్థ్వమూలం అథః శాఖః" అని శ్రీక్రిష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశించినాడు.మహాభారతములోను ధర్మరాజు ధర్మవృక్షముగాను,తమ్ముళ్ళు దాని శాఖలుగాను ,అదేవిధముగా దుర్యోధనుడు అధర్మ వృక్షముగాను వర్ణించబడినారు.పవిత్ర మర్రివృక్షము క్రింద స్వామి దక్షిణా మూర్తిగా దర్శనమిస్తున్నాడు.శ్రీశైలములో తెల్లమద్దివృక్షము శివస్వరూపమని నమ్ముతారు.మరియు త్రిగుణ్తీత వృక్షముగా బిల్వవృక్షము లక్ష్మీదేవిచే సృష్టించబడినదట.అమ్మవారు స్వామివారి గురించి చూతవృక్షము క్రింద ఆసీనురాలై అత్యంతశ్రధ్ధాభక్తులతో తపమును సలిపినదట.సంసారమనెడి వృక్షమునకు సకలము తానైన వాడు సదాశివుడు.
 " నమః శుష్క్యాయచ హరిత్యాయచ."  ఎండిన-పచ్చని ఆకులరూపమైన రుద్రునకు నమస్కారములు.


   ఈశావాస్యమిదం సర్వం అను ప్రగాధ విశ్వాసముతో భక్తులు మహాశివుని విశ్వసించుసమయమున శివలీలయనజైనము విస్తరించి పరమాత్మ తత్త్వమును ప్రశ్నించుచున్న రోజులవి.రెండు వర్గములుగా చీలిన ప్రజలు తమ విశ్వాశమే గొప్పదని నిజమని నమ్ముటయే కాక అన్యమును అంగీకరిమ్హలేని మానసిక స్థితిలో,యుక్తా యుకతములను మరచి పరస్పరము దూషించుకొనుచుండిరి.

    కోవూరు బ్రహ్మయ్య అను పరమ పరమేశ్వర భక్తుడు,జ్యేష్ఠుడు-కనిష్ఠుడు,పూర్వము-పరము,సోభ్యము అనగా పుణ్య-పాప మిళితమైన మనుష్యలోకము సర్వము శివమయముగా  భావించుచు భక్తితో బసవని కొలుచుచుండెను." నమః శంభవాయచ -మయస్కరాయచ" ఇహపర సుఖములనందించు ఈశ్వరా! నమస్కారములు.అని స్తుతించుచున్న సమయమున పరమత ద్వేషముతో బ్రహ్మయ్యను దుర్భాషలాడుతయే కాక ఆరాధ్యదైవమును అవహేళన చేయసాగిరి.అందులకు నొచ్చుకున్న బ్రహ్మయ్య స్వామి అందరిపై 'మీడుష్తమ శివతమ శివోనస్సుమనా భవంతు" అని ప్రార్థిస్తూ,అ గ్రామమును వదిలి పొరుగూరికి వెళ్ళిపోవుటకు నిశ్చయించి అడుగువేయసాగాడు.శివ సంకల్పమస్తు.సివానంద ప్రాప్తిరస్తు అన్న శివాశీర్వచనముతో కదులుచున్న బ్రహ్మయ్యవెంత వెంట " గణేభ్యో-గణపతిణ్యో' అనేక శివగణములు,వ్రాతేభ్యో-వ్రాతపతిభ్యశ్చ నమోనమః" అనేకవ్రాతములు అనుసరించినవి ఆనందముతో.ధర్మ సంస్థాపనకు తరలుచున్నది  కందర్పదర్పుని కుటుంబము.

 వారు పొరుగూరు వెళుతూ దారిలో ఒక మర్రిచెట్టు క్రింద  విశ్రాంతి తీసుకొనుటకు కూర్చున్నారు.శివనామ స్మరణను మాత్రము మానలేదు.ఇంతలో ఒక చిలిపి ఆలోచనవచ్చింది పరమేశ్వరునికి." నమః శర్వాయచ పశుపతయేచ" అక్కడికి వచ్చిన ఒక జైనుడు వెర్రి నమ్మకమును వమ్ముచేసి,అవమానించాలనుకున్నాడు.హింసా ప్రవృత్తి చోటుచేసుకుంది.

   బ్రహ్మయ్యను సమీపించి మీరునమ్మిన రుద్రుడు పక్షులతో నిండిన పచ్చని మర్రిచెట్టును బూడిదచేస్తే,తిరిగి దానిని జీవింపచేయగలడా? దానిపై నున్న పక్షుల సంగతి ఏమిటి? పశుపతి అని పూజించే మీ దేవుని మహిమలు చూపించగలరా? అంటూ వారిని రెచ్చగొట్టాడు.ఘోరములోనే అఘోరము మరినదా అన్నట్లు,బ్రహ్మయ్య ఎంతో వినయముతో ."
 నమో రోహితాయ స్థపతియే వృక్షాణాం పతయే నమః" అని స్తుతిస్తూ పరమేశ్వరుడు పచ్చదనమును అందించే ప్రఖ్యాత శిల్పి.తనశిలపకళా చాతుర్యముతో పదునాలుగుభువనములను సృష్టించి పరిపాలించుచున్నాడు.పరమకరుణాంతరంగుడు.మేము ఈ వృక్షమును భస్మీపటలముచేయము.హరితము హరుని పూజాకు నోచుకున్నదని హస్తి సేవించి తరించినదని బదులిచ్చిరి.క్షుల్లకేభ్యుడైన జైనుడు తాను మర్రిచెట్టును బూడిదచేసి తిరిగి పచ్చనిచెట్టుగా మార్చమని బ్రహ్మయ్యను రెచ్చగొట్టెను.

 అచంచలవిశ్వాసముతో బ్రహ్మయ్య ఆ విభూతిని స్పర్శించి " ఓం నమో భవాయచ-రుద్రాయచ" ఓ రుద్రా రోదనమునకు కారణము నీవే.దానిని పోగొట్టువాదవు నీవే.ఈ దురాగతమును క్షమిమ్హి,అభము-శుభము తెలియని ఆవృక్షమును రక్షించి,అహముతో కనులు మూసుకొని పోయిన వీరిని కరుణించుం.' నమో యామ్యాయచ-క్షేమ్యాయచ" పాపమును నశింపచేసి-పశ్చాత్తాపుని పాలించుము అని ప్రార్థనలు సలుపగానే పచ్చనివృక్షము పక్షులతో నిండి పరమేశ్వర తత్త్వమునకు ప్రతీకగ నిలిచినది.

  పంచభూతేశ్వరుడు ప్రపంచమును రక్షించుగాక.
 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.

   ( ఏక బిల్వం శివార్పణం)

  ( ఏక బిల్వం శివార్పణం.)



NAH PRAYACHCHANTISAUKHYAM-14

 నః ప్రయచ్చంతి సౌఖ్యం-14
 ***************************

 భగవంతుడు-భగవదంశ  ఇద్దరు క్షేత్రపాలకులే.

 " నమో రుద్రాయ ఆతతాయినే క్షేత్రాణాం పతయే నమః."

స్థలము దైవత్వముతో మేళవించిన క్షేత్రముగా భాసిల్లుతుంది.కాశము అనగా వెలుగు-ప్రకాశము అనగా ప్రకృష్టముగా తేజరిల్లునది.

 " కాశంతు పునరాగత్య సంహృష్టం తాండవోన్ముఖం
   విశ్వేశం దేవం ఆలోక్య ప్రీతివిస్తారితే క్షణా
   సానురాగాచసా గౌరీ దద్యాత్ శుభపరంపరాం
   వారణాస్యాం విశాలాక్షీ అన్నపూర్ణ పరాకృతీ
   అన్నం జ్ఞానదదతీ సర్వాన్ రక్షతి నిత్యశః
   త్వత్ ప్రసాదాన్ మహాదేవి అన్నలోపస్తు మాస్తుమే."

   
   
    గంగానదితో రెండు చిన్న నదులు "వరుణ", "ఆస్సి" అనే రెండు నదుల సంగమాల మధ్య ఉన్నందున "వారణాసి" అనే పేరు వచ్చిందని ఒక అభిప్రాయం. వారాణసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమ స్థానం, దక్షిణాన అస్సి (ఇది చిన్న నది) నది సంగమ స్థానం ఉన్నాయి. మరొక అభిప్రాయం ప్రకారం "వరుణ" నదికే పూర్వకాలం "వారాణసి" అనే పేరు ఉండేది. కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది. కాని ఈ రెండవ అభిప్రాయం అధికులు విశ్వసించడంలేదు.
"వారాణసి" అనే పేరును పాళీ భాషలో "బారనాసి" అని వ్రాసేవారు.. అది తరువాత బవారస్‌గా మారింది.'వారాణసి నగరాన్ని ఇతిహాస పురాణాలలో "అవిముక్తక", "ఆనందకానన", "మహాస్మశాన", "సురధాన", "బ్రహ్మవర్ధ", "సుదర్శన", "రమ్య", "కాశి" అనే వివిధ నామాలతో ప్రస్తావించారు.

 శ్రీమద్భగవద్గీత క్షేత్ర-క్షేత్రజ్ఞ విభాగయోగము మానవ క్షేత్రము ( శరీరము) గురించి,క్షేత్రపాలకుడైన పరమాత్మను వివరిస్తుంది.క్షేత్ర సూక్ష్మరూపియై.కాశీక్షేత్ర పాలకుడైన  కాలభైరవస్వామిని స్మరించి,నమస్కరిద్దాము.

 "భైరవః పూర్ణరూపోహి శంకరస్య పరాత్మనః
  మూఢాస్తందై నజావంతి మోహితః శివమాయయా."

 పరమేశ్వరునిపరిపూర్ణ అవతారమే భైరవుడు.శునకము ఈయన వాహనము.అహంకారపూరితమై,అసత్యమాడినబ్రహ్మ ఐదవతలను శివుని భృకుటి నుండి సృష్టింపబడిన భైరవుడు తనగోటితో చిదిమి స్వామికార్యమును నెరవేర్చెను.

 " నమః శ్శ్వభ్య శ్శ్వపతిభ్యశ్చ వో నమః."

   కుక్కలరూపమున నున్నవానికి,కుక్కలను పాలించుచున్న,క్షేత్రపాలక రూపులైన భైరవులకు నమస్కారములు.
 భై అనగా-భయము,రవము అనగా ప్రతిధ్వనింపబడునట్లు చేయబడు ధ్వని.ప్రతికూల పరిస్థితులను నివారించు భైరవస్వామిని నమస్కారములు.భై అనగా తేజస్సు అను అర్థము కూద కలదు.రవము శత్రునాశనమునుతెలియచేయును.శత్రునాశనము చేయు తేజోమయ ఘోరరూపము భైరవుడు.కాలమునకు లొంగని వాడు కనుక కాలభైరవునిగా కొలువబడుచున్నాడు.

 " ఓం నమో శ్రవాయచ-ప్రతిశ్రవాయచ."


 పన్నెండు సంవత్సరములు తాను గిల్లిన బ్రహ్మకపాలమును భిక్షాపాత్రగా స్వీకరించి,పుణ్యనదులలో స్నానమాచరించి,పునీతుడైనాడు భైరవుడు.ఆనందమూర్తి అలయములో ఈశాన్యదిక్కున నుండి ఈశ్వరుని సేవిస్తుంటాడు.తనకర్తవ్య నిర్వహణకై అష్టభైరవ తత్త్వముతో క్షేత్ర పాలనను కొనసాగిస్తుంటాడు.అగ్నిగోళముల వంటి నేత్రములతో పాపములనుదగ్ధము చేస్తుంటాడు.గరళ కంఠముతో గళమున పాములతో చేతిలో త్రిశూలము,డమరు.కపాలముతో కాలభైరవుడు కాశీక్షేత్రమును,అక్కడికి వచ్చిన యాత్రికులను కాపాడుతుంటాడు.పాపాత్ములకు ప్రాణోత్క్రమణ  సమయములో ఘోర రూపముతో సాక్షాత్కరిస్తు,వారి పాపములను భక్షిస్తుంటాడు.కనుక పాపభక్షకుడిగా ప్రసిద్ధిగాంచాడు.పాపులను సైతము పవిత్రులను చేయు పరమేశ్వర అంశ కాలభైరవుడు.

 కాలభైరవస్వామికి వారణాసి-దంతేవాడ ,ఉజ్జయిని,,తేజ్పూర్,రామగిరి ఇంకా ఇంకా ఎన్నోచోట్ల కొండలలో ,జలపాతాలదగ్గర,గుహలలో,కొలువైనాడు.కొన్నిచోట్ల మూర్తి ఎదుగుతు ఉనికికి ఉత్తమనిదర్శనంగా ఉంటున్నదట.స్వామికి మద్యమును సమర్పించి, దానినితీర్థముగా భక్తులు సేవిస్తారట.ఇందుగలడందులేడనిసందేహములేల? మహిమలస్వామి మనలను కనిపెట్టుకునే ఉంటాడు కనికరము కలవాడు
.కాలభీతవిప్రబాలపాల తే నమః శివాయ
 శూలభిన్నదుష్టదక్షఫాల తే నమః శివాయ

భక్తుడు కరువూరు క్షేత్ర పాలకునిగా శివభక్తులను రక్షించుట ఈశ్వరారాధనగా భావించి,తరించిన పుణ్యశీలి.ఘోరరూపి గా అఘోర రక్షణను గావించెడి వాడు. ప్రదేశమునందలి శివభక్తులకు ఎటువంటి ఆపదలు కలుగకుండ,శివార్చనలు జరుపువార్కి హాని కలుగకుండ ఆయుధధారియై సంచరించుచు,సంరక్షించుచుండెడి వాడు.క్షేత్ర పాలకునిగా శివభక్తులను రక్షించుట ఈశ్వరారాధనగా భావించి,తరించిన పుణ్యశీలి.
చిదానందరూపా- ఎరిపాత నాయనారు
*********************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
అని ప్రార్థిస్తూ,
అంబరావతి నదీతీరమున కల కరువూరులోని పశుపతినాథుని కొలిచేవాడు ఎరిపాత నాయనారు. భక్తుని కథ అంటే భగవంతుని లీలను తెలియచేయునది కదా.నీవే తప్ప  పరంబెరుగ మన్నింపన్ దగున్ దీనునిన్ అనగానే సర్వస్య శరణాగతికి వశుడై సిరికిం చెప్పకనే వచ్చినాడు గజప్రాణ రక్షణ ఉత్సాహముతో.ఇక్కడ అహంకారములేదు.అంతరించినది.కాని ఆ జాతికిచెందిన ఏనుగు అహంకరించి శివభక్తులను అహంకారముతో ఘీంకరించి,శివ భక్తులను తుదముట్టించినది.బుద్ధిః కర్మానుసారిణి అని కద సూక్తి.

ఒక కరి రక్షింపబడినది.మరొకకరి శిక్షింపబడినది.ఇదియే పరమేశ్వర లీల.ఎగుడు దిగుడు కన్నులవాని భక్తులకు ఎటువంటి హాని ఎదురైనను అడ్డుకొనుటకు గొడ్డలి భుజమున ధరించి తిరుగుటను దొడ్డ సేవగా భావించువాడు.
" నమ సృకావిభ్యో జిఘాగుం సద్భ్యో ముష్ణతాం పతయే నమ:."

   వజ్రాయుధము వంటి దృఢమైన ఆయుధముచే తనను తాను రక్షించుకొనుచు,హాని కలిగించు ప్రాణులను చంపు రుద్రులకు నమస్కారములు. 

 శివకామి ఆండార్ పూలసజ్జనిండా పూలమాలలతో స్వామి సేవకు వెళుచుండగా ఒక మదించిన ఏనుగు పూలను ధ్వంసముచేసి భక్తుని క్రింద పడవేసి గాయ పరచినది.ఆగ్రహించిన ఎరపాత 

" నమ అవ్యాధినీభ్యో వివిధ్యన్నీభ్యశ్చవో నమః."గా మారి,



  అంతట వ్యాపించి,శత్రువుల గొట్టువాని రూపమున నున్న రుద్రులకు నమస్కారములు.





ఏనుగును,మావటివానిని గొడ్డలితో నరికి,భక్త రక్షణము గావించెను.విషయమును తెలుసుకొనిన రాజు శివాపరాధమునకు చింతించి శిరోఖండనము చేసుకోబోగ,ఎరిపాత ఆ కత్తికి తన తలను అడ్దముగాపెట్టెను.ఎరుకలవానిగా మారిన ఆ ఎగుడుదిగుడు కన్నులవాడు ఎరిపాతను రాజును రక్షించినట్లు మనందరిని రక్షించును గాక.
( ఏక బిల్వం శివార్పణం.

 " దేవరాజసేవమాన్య పావనాంఘ్రి పంకజం
   వ్యాళయజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం
   నారదాది యోగి బృంద వందితం దిగంబరం
   కాశికా పురాధినాధ కాలభైరవం భజే."
 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.


   ( ఏక బిల్వం శివార్పణం)

  ( ఏక బిల్వం శివార్పణం.)







  



Saturday, April 20, 2019

NAH PRAYACHCHAMTI SAUKHYAM-13

  నః ప్రయచ్చంతి సౌఖ్యం-13.

  నః ప్రయచ్చంతిసౌఖ్యం.-07
  ************************

  " ప్రళయ పయోధి జలే కేశవ ద్రుతవానసి వేదం
   విహిత వహిత్ర కరిత్రమఖేదం
   కేశవాద్రుత మీనశరీర జయజగదీశ హరే"

 చేపరూపమును దాల్చి చేవతో సొమకుని నుంది వేదోధ్ధరణను గావించిన కేశవ నమస్కారములు.

 భవసారమున పడి బయటకు రాలేని మాపై నీ కరుణాజాలమును విసిరి కడతేర్చు గొప్ప జాలరి వైన శివా ప్రణామములు.

 నమో ప్రతరణేభ్యో ఉత్తరణేభ్యశ్చవ నమో నమః.

 స్వామిని దర్శించిన సత్యవ్రతుడెంత ధన్యుడో స్వామికి మత్స్య నైవేద్యమును సమర్పించిన ఆదిపత్త నయనారు అంతే మహనీయుడు.


చిన చేపను-పెద్ద చేప,చిన మాయను-పెనుమాయ
 ఇది స్వాహా-అది స్వాహా అని అంటున్నాడు పెద్దజాలరి మనకు ఒక జాలరి కథ చెబుతూ,
 విషయవాసనలనే ప్రవాహములో పడి,వల పట్టుకొని యున్నమాయ అనే ఆపదను గుర్తించలేని మనలను రక్షించుస్వామికి నమస్కారములు..శివోహం.






 భ గవంతుడు-భక్తుడు ఇద్దరు జాలరులే
 జలము-జలచరము-జాలరి ఈశ్వరచైతన్యమే.

 " ఓం నిషాదేభ్యశ్చవ నమోనమః".
 చేపలను సమూహముగ పట్టి చంపునట్టి నిషాదుల రూపమున నున్న రుద్రునకు నమస్కారము.

  మన మనుగడను తెలియచేయునవి వేదములు.ప్రళయాంతరమున సోమకాసుర హస్తగతమైన వేదములను ఎవ్వరుని తిరిగి పొందలేకపోయిరి.వేదములు లేని సమయమున బ్రహ్మకు సృష్టికార్యమును చేయుట దుర్లభమాయెను.సృష్టిని కొనసాగించుటకు దేవతలు శ్రీమన్నారాయణుని వేదములను తెరిగితీసుకురాగల సమర్థతగలవానిని గుర్తించి,ప్రార్థించిరి.ఓం నమో నారాయణాయ.నార-అనగా జలము.జలమునందుండువాడు నారాయణుడు.జలమునుశిరముపై ధరించిన వాడు సదాశివుడు.వారిద్దరు ఏకం అనేక రూపానం అని తెలియచేయుటకు రూపభేదమేకాని తత్త్వ భేదము లేని వారు
.స్వామి మత్సావతరముతో సముద్రములో వేదములతో సహా దాగిన సోమకునితో అనేకానేక సంవత్సరములు భీకర యుద్ధమును చేసి,వానిని సంహరించి వేదోద్ధరణను గావించెను.నీటిలో అన్ని సంవత్సరములున్న స్వామికి వెచ్చదనమును అందించుటకు మన రుద్రుడు సూర్యకిరణములుగా తన చెలిమిని చాటుతు వెచ్చదనమును అందించుచున్నాడు అనుటకు నాగలా పురములోని వేదనారాయణ స్వామియే నిదర్శనము.ఇక్కడ పవిత్ర ఉత్సవ సమయులో మూడురోజుల) సూర్య కిరములు మొదటిరోజున స్వామి పాదములను,రెండవరోజున స్వామి హృదయమును,మూడవరోజున స్వామి ఫాలమును ఇప్పటికిని అభిషేకించుచు తమ అవ్యాజ వాత్సల్యమునుచాటుచున్నవి.


 " స్వధర్మేనిధనం శ్రేయః పరధర్మో భయావహః"

ఎవరు తన వృత్తి ధర్మమును బాహ్యముగా ఆచరిస్తూ,తనలోని ఆత్మ స్వభావ పరిశీలనము అను స్వధర్మమును చేయగలడో వారు ధన్యులు.అట్టివాడు మన భక్తుడైన జాలరి.


  నాగపట్టణ సమీపమున నున్న మాలైపాడు గ్రామములో " ఆదిపత్త" అను జాలరి ఉండెను.వృత్తి చేపలను పట్టుట-ప్రవృత్తి శివపాదములను పట్టుట.తమ కులవృత్తిని శివారాధనగా భావించెడి భాగ్యవంతుడు.జాలముతో మత్స్యములను పట్టుట మహాదేవుని పూజగ భావించెడివాడు.

 " ఉతైనం విశ్వా భూతాని సదృష్టో మృగయా తినః"

  ఉషోదయ కిరణములతో స్వామినివిశ్వమునంతయు తడుముతున్న వేళ,నిత్యకృత్యములను ముగించుకొని చేపలను పట్టుటకు కావలిసిన వస్తువులను తీసుకొని,శివనామ స్మరణ చేయుచు,

 " నమః సస్స్పింజరాయ త్విషీమతే 'పథీనాం" పతయే నమః"

స్వామి,


 లేత పచ్చిగడ్డివలె ఎరుపు-పసుపు కాంతితో ప్రకాశిస్తూ, చూపిస్తున్న దారిలో నడుస్తుండేవాడు.

 "నమః స్స్రోతస్యాయచ -ద్వీపాయచ"

ప్రవాహమున నున్న రుద్రులకు-ద్వీపములందున్న రుద్రులకు అనేకానేక నమస్కారములు.చేయుచు చేపలను పట్టు పనిని ప్రారంభించెడి వాడు.






ఏలిన వాని కరుణ అన్నట్లుగ, ఏరు జలముతో నిండి,ఎనలేని మీనములతో ఆదిపత్తను ఆనందముతో అహ్వానిస్తున్న సమయమున,అత్యంత భక్తితో దానిని సమీపించి నమస్కరించెడువాడు.ఎందుకంటే,

 " నమో హ్రదయాయచ-నివేషాయచ".

  మిక్కిలి లోతుగల మడుగులో దాగి,ప్రకాశించుచున్న రుద్రా! నీవు దయార్ద్రహృదయుడవు కనుక మంచుబిందువులలో కూడ దాగి వానిని చైతన్యవంతము చేయుచున్నావు ."నివేషాయచ నమో నమః.స్వామి కులవృత్తిని గౌరవిస్తు నేను చేపలు పట్టడానికి వచ్చాను.దీనిని నీ పూజగా తలుస్తు,నిన్ను కొలుస్తున్నాను.పూజానంతరము నీకు నైవేద్యముగా
" జలజాక్షునకు జలపుష్ప నైవేద్యమును " సమర్పించి సంతృప్తుడనై మరలుతాను.నన్ను నిరాటంకముగా చేపలను పట్టుకోనీయి తండ్రి అని ప్రార్థించెడివాడు.


మీనాక్షితల్లి స్వామి  జాలరికి మీనములను అందించెడివాడు.వాటికి కర్మ క్షయమును చేయదలిచినవాడు

కనుక కఠినముగానే ఉండేవాడు.

" జలేభ్యో-జంబుకేభ్యో నమో నమః".

 ఆదిపత్త సామాన్యుడు.మహిమలు లేనివాడు.ఆదిదేవుడు మహిమాన్వితుడు.వీరిద్దరి మధ్య మొదలైనది వింత పరీక్ష,జాలరి నమ్మిన వాడు మాయాజాలరి.సహస్రకన్నులతో చూస్తు-హిరణ్య బాహువులతో సర్వవేళల సంతసములను వర్షించువాడు.

 ' మహేభ్యో క్షుల్లకేభ్యశ్చ నమోనమః.'

 పరీక్షించాలనుకునాడు . జాలరివాడు మడుగునచేపలను మననీయటంలేదు.సురక్షిత ప్రాంతాలకు చేపలుచేరసాగినవి మడుగులోని చేపలు.జాలరికి రెండో-మూడో వలలో పడేవి." ఈశ్వరుడివ్వాలి-ఈ వల చేపలతో నిండాలి," అనుకుంటు పడిన చేపలలో నుండి ఒక చేపను పరమేశ్వరార్పణముగా మడుగు లోనికి వదిలి,మహదానందముతో వెనుదిరిగేవాడు అదిపత్త.


" నమో శంభవేచ-మయోభవేచ."

 భుక్తి-ముక్తి ప్రదాత నీవు నా చెంతనే ఉండగా నాకెందుకు విచారము.శిక్షకుడవైన-రక్షకుడవైన నువ్వే నాకు సర్వస్వము.నీ స్మరణమే నా సంతోషము సర్వేశ్వరా అని స్తుతిస్తున్నాడు.

" నమః శీభ్యాయచ" జలప్రవాహమునమున్న స్వామి జలచరముల దారి మళ్ళించి,ఆదిపత్త జలపుష్ఫ నైవేద్యానురక్తిని పరీక్షింప దలచాడు.అందులోను,పతాక సన్నివేశమును ప్రారంభించినాడు పశుపతి.


" నమో నాద్యాయచ వైశంత్యాయచ

నదులలో,చిన్న చిన్న సరస్సుల రూపములలో నున్న సదాశివుని చమత్కారమా అనునట్లు,"

యథావిధిగా మడుగును చేరి,యమునిభంజించిన వానిని యెదనిండా స్మరిస్తు విసిరిన వలలో
 పడినదిసంభ్రమాశ్చర్యములను తోడుతీసుకొనివచ్చిన విచిత్రమైన పసిడిచేప ఒకటే వలలో పడినది.చుట్టు ఉన్న జాలరులు ఇకముందు ఏమిజరుగబోతున్నదో కద అని ఇంతింత కనులతో చూస్తున్నారు.విషయలంపటులైన మిగిలిన బెస్తవారు.

" గృత్సేభ్యో-గృత్సపతిభ్యశ్చవో నమో నమః"









 వలలో పడిన పసిడిచేప జాలరి భక్తిని పరీక్షిస్తున్నది.

 పరమేశ్వర సంకల్పము కదా! ఈశ్వర చైతన్యపు ఇంద్రజాలమిది.

భవతరణమునకు సోపానములు భగవంతుని పరీక్షలేగ.

కాదనలేని విధముగ కరుణను కురిపించువాని పరీక్షలు .కైవల్యమునకు అంగరక్షణలేగ.

.విషమపరీక్షలకు భయపడని ఆదిపత్త విషయవాంఛలకు బందీగాక ,ఏ మాత్రము తాత్సారముచేయక తన్మయత్వముతో తనకు దొరికిన పసిడిచేపను పరమానందముతో పరమేశ్వరార్పణముచేసి,పార్వతీనాథుని పాదపద్మములను చేరినాడు.పరమావధిని పొందినాడు.

  " ఓం నమో స్తారాయచ"
 " నమః శంభవేచ









మయోభవేచ." స్వస్తి

 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.

   ( ఏక బిల్వం శివార్పణం)

   ( ఏక బిల్వం శివార్పణం.)











  భగవంతుడు -భక్తురాలు ఇద్దరు వైద్యులే

  ' ఓం నమోనమో భువంతయే వారివస్కృతా యౌషధీనాం పతయే నమః."

   వరివః ధనం కరోతి  ఇతి వారివస్కృతాం.భక్తులయందుండువాడు.భక్తులు వారివస్కృతులే.

  పర్లి జ్యోతిర్లింగము వైద్యనాధునిగా కీర్తింపబడుతోంది. " వైద్యభ్యం పూజితం సత్యం" సత్యమైన వైద్యము సర్వులచే సర్వకాల సర్వావస్థలలో పూజింపబడుతుంది.

 " జ్యోతిర్లింగమిదం శ్రేష్ఠం దర్శత్ పూజనాదపి" ఆధి-వ్యాధి నిరోధకుడు రుద్రుడు.అనగా మానసిక-శారీరక రుగ్మతలను తొలగించువాడు.

  సామాన్య ఔషషధములు దేశకాలపరిస్థితులను బట్టి,రోగ ప్రాబల్యమును బట్టి నివారణకు సేవింపవలసినవి.రుచికరములుగా ఉందవు.పూర్తి స్వాస్థథ లభించునన్న ఆశయును లేదు.కాని కరుణ నేత్రముల వాని కమనీయ ఔషధమును శారీరక-మానసిక రుగ్మతలను పూర్తిగా తొలగించును.వైద్యుడు సుగంధిపుష్టికర్త.సర్వకాల సర్వావస్థలయందును సేవింప యోగ్యం.మరి మరి రుచిరా మహదేవ నీ మందు.భవ తిమిర నాశకము-భవపాద దర్శనము.భళిర భిషక్కు.

ఇతిహాస కథనములప్రకారము వైద్యనాథుడిగా రుద్రుడు పలుప్రదేశములలో ప్రస్తుతింపబడుతున్నను పర్లి క్షత్ర వైద్యనాధుని భక్తిప్రపత్తులతో ప్రస్తావించుకుందాము.ఈ క్షేత్రము అపూర్వకాశిగా ప్రకాశిస్తున్నది.ఈ పర్వతము అనేక వృక్షములు-గుబురులు-మూలికలతో భవరోగ నాశినిగా భక్తులచే కొనియాడపడుతున్నది.

  " ఓం కక్షాణాం పతయే నమః." గుబురులలోని,'ఓంవృక్షాణాం పతయే నమః" వృక్షములలోని, " ఓం ఔషధీనాం పతయే నమః" ఔషధులలో లోని ఈశ్వరచైతన్యమైన రుద్రునకు నమస్కారములు.

 తల్లి శివపూజలో సైకతలింగము చెదిరి పోయిన అనంతరము స్వామి ఆత్మలింగమునుతెచ్చి తల్లికి ఇచ్చుటకై రావణుడు ఘోర తపమును కావించినాడట.అహంకార యుతమైన అర్చనలు అనుగ్రహమును అందీయలేవుకదా.అనన్య భక్తి మాత్రమే సాధించగలుగు అనుగ్రహమునకై దశకంఠుడు పశ్చాత్తాపముతో తన ఒక్కొక్క శిరమును తెగనరికి ఈశ్వరార్పణ చేయసాగెను.పదవ శిరమును నరుకు సమయమున పరమేశ్వరుడు ప్రత్యక్షమై పరమేష్ఠి మనుమని పరిపూర్ణునిగా చేయుటయే గాక ప్రసన్నతో కొన్ని షరతులను విధించి,తన ఆత్మలింగమును అందించెనట.ఆనాటి నుండి వైద్యనాధునిగా ఆరాధ్యనీయుడైనాడు. వైద్యనాథాయ నమో నమః

 నైద్యనాథునికి వైద్యమునుచేసిన భక్తురాలు నక్క నయనారు ధర్మపత్ని.ఒకసారి,

సాలీడు పాకగ స్వామి శరీరము పొక్కిపోయె
గ్రహచారము చాలక ఎర్రగ కందిపోయె
పాయని భక్తి తానొక ఉపాయము సేసి వేగమే
జాలము చేయక ఉపచారము చేయుచు సాగిపోయె ఆ
నక్కనయనారుని ధర్మపత్ని,గమనించిన నాయనారు
క్షమియించగ కోరగ,ఆమె వైద్యమే సరియనె సాంబుడు
గాఢత ఎంత ఉన్నదో కద ఆ మూఢపు భక్తిలో
నెమ్మదినీయగ స్వామికి తల్లి ఉమ్మియె కారణమాయె
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు "శివోహం" జపంబు నా చింతలు తీర్చుగాక.


   ఉగణాభ్యశ్చ నమో నమః.ఉత్కృష్ట స్త్రీ శక్తి గణముల స్వరూపమైనది.శివుని కరుణను కాదనగలరా?.స్వామి శరీరమంతయును సాలీడు తన భావనలనే దారమును అల్లుటచే,దాని జిగురు తాకి స్వామి శరీరమంతయు పొక్కినది.


.శివా నీ స్వరూపము-శరీరము సాంతము సుఖప్రదము శుభప్రదము.భవరోగ తిమిరహరము.తండ్రీ నీవు ఎంతటి అసౌకర్యమునకు గురీగుచున్నావో.దీనిని తొలగించుటకు నాఉమ్మియే సరియైన ఔషధము అని లింగముపై ఉమ్మివేయసాగినది.అచంచలవిశ్వాసమను మండు అచలాధీశునికి స్వాంతననొసగినది. 

 జ్ఞానచక్షువులకు గలశక్తి చర్మచక్షువులు పొందలేవు కదా.కానిపని చేసినదని నక్కనయనర్ తనభార్యను ఇంటినుండి వెడలగొట్తినాడు.కర్త-కర్మ-క్రియ ఈస్వరమయమైనప్పుడు కాదనగలవారెవరు.శివాపరాధమునకు చింతించుచు,చిరునిద్రలోనికి జారిన నాయనారునకు స్వప్నములో సదాశివుడు సాక్షాత్కరించి ఆ సాధ్వి సరియైన చికిత్సయే చేసినదని సంతుష్టుదైనానని సెలవిచ్చెను.

   " నమః స్వపథ్యో జాగ్రదభ్యశ్చవో నమోనమః." నిద్రించుచున్న మెలకువగ నున్నరుద్రునకు నమస్కారము.నిద్రించుచున్న నయనారు లోని చిత్స్వరూపమును మేల్కొలిపిన చిదానందునికి నమస్కారములు.మంగళకరమైన ఔషధమనగా జ్ఞానమని కూడ భావింపవచ్చును.తప్పుతెలిసికొని తనభార్యతో కలిసి వైద్యనాధుని సేవించి తరించిన దంపతులను అనుగ్రహించిన స్వామి మనయొక్క సర్వజాడ్యములను హరించి,మనలను సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయుగాక.

 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.


   ( ఏక బిల్వం శివార్పణం)

  ( ఏక బిల్వం శివార్పణం..)
















  



Friday, April 19, 2019

NAH PRAYACHCHAMTISAUKHYAM-12


  నః ప్రయచ్చంతి సౌఖ్యం-12
  ******************************

  భగవంతుడు-భక్తుడు ఆలిని అర్థికిచ్చిన వారే.

  " నమః సోమాయహ-రుద్రాయచ" ఉమా సమేతుదై యున్న రుద్రునకు నమస్కారములు.

 ఉమ అనుపదములోని ఉ-ం-అ అను వర్నములను విలోమముగ చూసినచో అది ప్రణవస్వరూపమైన ఓంకారము.ఉమా సహితుదైన ఈశ్వరుడు సర్వశక్తిమంతుడు సర్వ సమర్థుడు అని కేనోపనిషత్తు స్తుతించుచున్నది.

 నమో మీడుష్తమాయచేషుమతేచ" ధారగా సంతోషములనువర్షింపచేయు రుద్రా నమస్కారములు.


 భూకైలాసమును ప్రకటించుటకు భూతనాథుడు రావణభక్తిని రాణింప. చేసినాడు.తల్లి శివార్చన సమయమున సైకతలింగమును చెదరగొట్టించి,తనకథను మొదలుపెట్టాడు.కైలాసనాథుని దేశనమునకు కఠినతపమును కావింపచేసినాడు.అకుంఠిత దీక్షతో ఆ సదాశివుని హృదయకుహరమున ప్రవేశింప  కలిగినాడు పదితలలవాడు.ఓం నమో గహ్వరేష్ఠాయచ నమో నమః".భక్త సులభుడు భవానీ సమేతుడై ప్రత్యక్షమై ఏమి వరము కావలెనో కోరుకోమన్నాడు.ఆత్మలింగమును అర్థించుటను మరచినాడు ఆ అసురబ్రహ్మ.దీనికి కారణము నమః యామ్యాయచ-క్షేమ్యాయచ".దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ జరుపవలసిన వాని మాయ.కథను ముందుకు నడిపించ దలచినాడు గ్రుస్నుడు మరియు గ్రుస్న పతి.విషయలంపటము చుట్టుకున్న రావణుడు వివేకమును విస్మరించి జగన్మాతను ఆలిని చేసుకుందామని అర్థించాడు.అంగీకరించాడు ఆదిదేవుడు అడిగినదే తడవుగా.తల్లిని తీసుకుని తరలి వెళ్ళుతున్నాడు తమకము నిండిన మనసుతో.

 'నమః స్రుత్యాయచ-పథ్యాయచ" స్రుతి అనగా కాలిబాట.అందులోను ఇరుకైనది.అ బాటయందున్నరుద్రుడు నారదుడై మనవనికి కనువిప్పును కలిగించెను.నమః ఆతార్యాయచ" సంసార వ్యామోహమును నశింపచేయు జగత్పిత జగదీశ్వరిని తిరిగి తనదగ్గరకు రప్పించుకొని జరిగినదానికి రావణుని పశ్చాత్తదగ్ధ హృదయునిగ పునీతుని చేశాడు.పాపము ప్రతిహరమగు గాక.పాహి పాహి పరమేశా -శరణు.


  దాత-యాచకుడు రెండు తానైన స్వామి ఎలా యాచకుదయ్యడో,తనభక్తుని భార్యమై మోహమును చూపి,తనకుకావలెనని ఎలా అర్థించాడో తెలుసుకుందాము.ఏమిటయా నీ లీల-లయకర!

 శివుడు బ్రాహ్మణ వేషములో ఇంటిముందు నిలిచాడు
ఇంగితమును విస్మరించి నాయనారు ఇల్లాలిని అడిగాడు
లేదనుమాట పలుకలేనివాడైన ఇయర్వగై నాయనారు
నివేదనమనుకున్నాడు, నిజపత్నిని పంపించాడు
బ్రాహ్మణునకు-భార్యకు బాటలో బాసట తానైనాడు
అడ్డువచ్చిన వారిని ఎదురొడ్డిన వాడయ్యాడు
శర్వునకు నమస్కరించి నిశ్చయ భక్తితో వెనుదిరిగెనుగా
నిర్వాణమునందీయగ భార్యయే కారణమాయెగ

  ఇంతకీ ఎవరు ఈ ఇయర్వగై? అర్థించిన బ్రాహ్మణునికి భార్యను నిస్సంకోచముగాసమర్పించి నివేదనమనుకున్న నిష్ఠాతత్పరుడు?


కావేరి పట్టణ వాసుడైన ఇయర్వగై నాయనారు నరనరాల్లో దాతృత్వమును జీర్ణించుకొన్న గొప్పశివ భక్తుడు.శివ భక్తులను శివ స్వరూపముగాభావించి,అడిగిన దానిని దానమిచ్చి,వారి సంతోషమే పరమేశ్వర అనుగ్రహ విశేషముగా భావించి,సంతసించెడివాడు.
జీవుడు దేవుడు కావాలంటే శివుడు ఎన్ని పావులు కదపాలో-ఎన్ని కథలను నడపాలో.ఆ రావణ బ్రహ్మకు ఆలినిచ్చిన దాత కదా.వేరొకరి ఆలినికోరగా యాచకుడిగా మారదలచాడు." ఓం నమః శివాయ" త్రిపుండ్ర ధారియైనాయనారు ఇంటిముందు నిలిచాడు.శివ స్వరూపము అత్యంత భక్తిశ్రద్ధలతో సేవించారు నాయనారు దంపతులు.చల్లకు వచ్చి ముంతను దాచటమెందుకని చల్లగా సంభాషణలో నాయనారు అడిగినది లేదనక ఇస్తావట.నిజమేనా అని సందేహముగా అడిగాడు.స్వామి నా దగ్గర ఉన్నది అయితే తప్పకుండా ఇస్తాను అన్నాడు అమాయకంగా ఇయర్వగై.నీ భార్యను కోరుతున్నానన్నడు.వెంటనే సంశయించక అందుకు అంగీకరించినాడు.పతివ్రతా శిరోమణి పరమప్రీతితో యతి సేవకు సిద్ధమయింది.

పినాకపాణి పిరికితనమును నటిస్తూ నాయనారు భార్యను తనతో తీసుకువెళతానని,దారిలో ఎవరైనతనను అడ్డగించవచ్చని,కనుక వారిద్దరు ఊరు దాటువరకు రక్షణగా నాయనారును తోడు రమ్మన్నాడు. ఆతతావియైన అనగాఆయుధమునుధరించి రక్షించు రుద్రుని వలె నాయనారుఆయుధధారియై వారిని అనుసరించాడు.అడ్డువచ్చిన వారినిచూసి బెదిరిన బ్రాహ్మణునితో నాయనారు భార్య మీరు భయపడవలదు.నా భర్తవారిని మట్టికరిపించి,మనలను క్షేమముగా పొలిమేర దాటిస్తారని సెలవిచ్చింది.బలిచక్రవర్తి వలె స్వామిచేయి క్రింద-నాచేయి దాతగ పైన అని ఆనుకోని నాయనారు మాటకు కట్టుబడి, అడ్డువచ్చిన వారిని ఓడించి,వీరిద్దరిని అనుసరించుచుండెను.
తిరుచ్చైకాడు దేవాలయము దగ్గర శివుడు నాయనారును తిరిగి వెళ్లిపొమ్మనెను.కొంత దూరము వెళ్ళినాడో లేదో నాయనారు అని గట్టిగా పిలిచి అదృశ్యమయ్యాడు  శివుడు  " నమః శంకరాయచ-మయస్కరాయచ." ఇహపరములను అనుగ్రహించు రుద్రా నీకు నమో వాకములు.
 ఇహపరములను అనుగ్రహించు రుద్రా నీకు నమో వాకములు.
.వెనుతిరిగిననాయనారుకుభార్యఒక్కతే కనిపించింది.పార్వతీ పరమేశ్వరులు దీవించారు.త్రికరణ శుద్ధిగా ధర్మపత్నిని శివునకు సమర్పించిన ఇయర్వగై నాయనారును కటాక్షించిన పార్వతి పరమేశ్వరులు మనందరిని కటాక్షించెదరు గాక

 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.

   ( ఏక బిల్వం శివార్పణం)
( ఏక బిల్వం శివార్పణం.)

Thursday, April 18, 2019

NAH PRAYACHCHAMTI SAUKHYAM-11

  నః ప్రయచ్చంతి సౌఖ్యం-10
  *****************************

   భగవంతుడు-భక్తుడు ఇద్దరుసేనాపతులే-అన్నదానప్రియులే.

 " నమో బభ్లుశాయనివ్యాధినే అన్నానాం పతయే నమః."

  పరమేశ్వరుడు వృషభవాహనుడు.వృషభము ధర్మము.దుక్కిదున్ని దుర్భిక్షమును పోగొట్టును." నమో మేఘ్యాయచ" మేఘస్వరూపముగా స్వామి మారి వాని ద్వారా వర్షములను కురిపించును.హర్షమునందించును." నమో వర్షాయచ."

 " అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః
యజ్ఞాత్ భవంతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః."

  మరొకవిశేషము


   తమసేనలకు అన్నమును అందించుటలో అతి విశాలహృదయులు.

ప్రాణులు అన్నమువలన కలుగుచున్నవి.అన్నము మేఘము వలనకలుగుచున్నది.మేఘము జన్నము వలనకలుగుచున్నది.జన్నము సత్కర్మల వలన కలుగుచున్నది.సత్కర్మ వేదము వలనకలుగుచున్నది.వేదము అక్షర పరబ్రహ్మమైన సదాశివుని వలన కలుగుచున్నది

సర్వలోక సేనాపతి సదాశివా నమో నమః..

భక్తుని విషయానికొస్తే,

 తంజావూరు జిల్లాలోని తిరునట్టి యాట్టంగుడి నివాసియైన కోట్పులి నాయనారు.చోలరాజ్య సేనాధిపతి.అతి పరాక్రమ వంతుడగుటచే పెద్దపులి అను పేరుతో ప్రసిధ్ధిపొందాడు.పరాక్రమమునకు తోడుగా పదిమంది కడుపు నింపు ప్రసాదగుణ సంపన్నుడు.





 అన్నము పరబ్రహ్మస్వరూపముగా భావిస్తూ,అన్నదానము అన్ని దానములలో గొప్పదను సామెతను గౌరవిస్తూ,అన్నపూర్ణేశ్వరుని అమితభక్తితో కొలిచే నాయనారు.తన శక్తి వంచన గాకుండా శివాలయములకు ధాన్యరాశులను పంపించుతు,స్వామి ప్రసాదమును సర్వజీవులు స్వీకరించుటలో శివుని దర్శించి,పులకరించేవాడు.

 భవతి అస్మిన్ సర్వం అను భావన కలిగి " నమో భవాయచ రుద్రాయచ" అని స్మరిర్స్తు అమితానందమును పొందుచుండెడి వాడు.








వ్యాస మహర్షిని సైతము కుపితునిచేసిన అన్నలేమి, కలుగకుండ చూడమని అన్నపూర్ణేశ్వరుని

 " ద్రాపే అంధసస్పతే" నమో నమః."





అనుచు నిరంతర శివనామ స్మరణతో-శివప్రసాద వితరణతో అహోరాత్రములు మహదానందముగా సాగుచున్నవి. స్వకార్య నిర్వహణ స్వామికార్య నిర్వహణకు కించిత్ ఆటంకమును కలిగించినది.

" నమశ్శ్రుతాయచ-శ్రుత సేనాయచ " తన సేనానికి రాజకార్య నిమిత్తము పొరుగూరికి వెళ్లవలసిన పని కల్పించాడు.కథను ముందుకు నడిపించేవి కాలాతీతును లీలలే కదా.కాఠిన్యరూపాలు-కారుణ్య సంద్రాలు.
రాజాజ్ఞను పాలించుటకు ఊరువదిలి పొరుగూరు వెళ్ళవలసినపరిస్థితి ఏర్పడింది నాయనారుకు.

"మృడానో రుద్రో" రుద్రదేవా ఈ లోకమున ధనధాన్యములను సమృద్ధిగా నిచ్చి మమ్ము పాలింపుము అను భక్తుల భోజనమునకై సరిపడు ధాన్యపు రాశులను శివాలయములకు పంపించమని,తనబంధువులకు ఆదేశించి కార్యోన్ముఖుడాయెను కోట్పులి.









" నమః గృత్యేభ్యో గృత్స పతిభ్యశ్చవో నమః"

  ఉభయనమస్కార గ్రహీత అయిన శివుడు దురాశాపరుల నాయకుడిగా ,కోట్పలి బంధువులను మార్చి,ధాన్యమును అన్నదానమునకు అందీయక తామె భుజించసాగారు.కారణము మన స్వామి లీలయే.



' నమో వర్షాయచ-అవర్షాయచ." వర్షము-వర్షాభావము రెండును తానే అయిన లోకహర్షుడు,నాయనారు సేనానిగా యుధ్ధమునకు పొరుగూరు వెళ్ళిన సమయమున, కాలభీకరుడై కరువురక్కసి కోరలుసాచి ధాన్యమునుదక్కనీయలేదు.బంధువులు తమను తాము బతికించుకొనుటకై శివాలయమునకు పంపవల్సిన ధాన్యమును తామే భుజింపసాగిరి.మిగిలినధాన్యమును పంపక తమకొరకే దాచుకొని,నాయనారు ఆజ్ఞను తిరస్కరించిరి.

  " శివ నామము-శివ ధ్యానము-శివ స్మరణము-శివార్చనము-శివప్రసాద వితరణము
. అను శివవ్రతమునకు భంగము వాటిల్లినది.విజేయుడై వెనుకకు వచ్చినాడు
 నాయనారు

." నమో హిరణ్య బాహవే సేనాన్యే దిశాంచపతయే నమః".
సేనాపతి రూపముననున్నరుద్రునకు నమస్కారము.

 "నమో ఘోరేభ్యో-అఘోరేభ్యో-ఘోరఘొర రూపేభ్యః "

తిరిగి వచ్చిన నాయనారు బంధువుల వలన జరిగినతప్పిదమునుతెలుసుకొని మిక్కిలిచింతించినాడు.నిర్వికార నిరంజనుని ఘోర-అఘోర ( శాంత) రూపములు జీవులు చేసికొనిన కర్మ ఫలితములు కాని అన్యములు కావు.నాయనారు బంధువుల పాపకర్మక్షయము ఘోర రూపుడైన కోట్పులి చేతిలో నున్నదా యన్నట్లు కుపితుడై నైవేద్యము కానీయక భుజించిన వారినందరిని " భవత్య హేత్యై" వంటి కత్తితో వారి పాపములను అంతమొందించినాడు

."పాపం శమయతి సర్వాణి." లోకవిదితమైనది కోట్పలి శివభక్తి.ఉగ్రాయచ భీమాయచ-శంగాయచ పశుపతియేచ అయినాడు.స్వామిలీలలు సదా స్మరణములు వారినందరిని పునీతులను చేయుటయే కాక పునర్జీవితులను చేసెను.

 పాపపరిహారము చేయు పరమేశ్వరుని ప్రార్థిస్తూ,


.











 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.

   ( ఏక బిల్వం శివార్పణం)

 ( ఏక బిల్వం శివార్పణం.)











Wednesday, April 17, 2019

NAH PRAYACHCHANTI SAUKHYAM-10

     నః ప్రయచ్చంతి సౌఖ్యం.-10
     *************************
  కైలాసపురి నుండి కాశికై-కాశికాపురి నుండి దరహాసివై
  మా హృదయవాసిగా భాసిలుతు-నడిపించ ఎదురుగా
  కనిపించుచున్నావుకరుణతో  శివశివా-హరహరా

   భగవంతుడు-భక్తుడు ఇద్దరు బ్రాహ్మణులే-యజ్ఞోపవీతులే.

   " నమో హరికేశాయ ఉపవీతినే పుష్టానాం పతయే నమః."

శివుడు హరికేశుడు అనగా నల్లని శిరోజములు కలవాడు.శివుని నల్లని కేశములు వార్ధక్యము లేని వాడని,కాల ప్రభావములను అధిగమించినవాడన్న విషయమును తెలియచేయుచున్నది.మరియు శివుడు ఉపవీతుడు.బంధము కలవాడు.ఉప అనగా దగ్గరగా నున్నవాడు.సాక్షాత్తు గాయత్రీమాతయే.శివుడు వేదమాత గాయత్రీదేవి సంకేతమును ధరించిన వేదమయుడు.అంతేకాదు తాను ధరించిన ఉపవీతము (జందెము) పుష్టులను (వాక్పుష్టి-జ్ఞానపుష్టి-ఇంద్రియపుష్టి -ధర్మపుష్టి) మొదలగు వానిని పరిపూర్ణముగా ప్రసాదించగలవాడను శివతత్త్వమును చాటుచున్నది.అదే భక్త రక్షణా ధర్మసంస్థాపన ధారణము.


     ఇద్దరును మంగళము కొరకు ఉపవీతమును,గాయత్రీ కృపను ధరించినవారు.అనగా బ్రహ్మజ్ఞానమునందు నిష్ణాతులు.మరియును వాక్పుష్టి-జ్ఞానపుష్టి-ధన-ధాన్యపుష్టి,ఇంద్రియపుష్టి,ధర్మపుష్టి గల రుద్రస్వరూపులు.

 " సర్వేషామధికో యస్మాన్ భగవాన్-బ్రాహ్మణ శివః." పరాశర సంహిత కీర్తించుచున్నది.అభినవ శంకరులు రుద్రుని ప్రథమ బ్రాహ్మణుడు అని అభివర్ణించిరి.తన సస్వరూపమును గ్రహించి తనలోని బ్రహ్మము నిత్యమని,శరీరము అనిత్యమని గ్రహించినవాడు బ్రహ్మజ్ఞాని."బ్రహ్మమొక్కటే-పరబ్రహ్మమొక్కటే" అన్నమయ్య.


 
    సద్భావన వలన పంచాక్షరి.వర్షము వలన ఆకాశము,శైవము వలన వేదములు ,,భాగవతుల వలన క్షేత్రములు పునీతములగుచున్నవని నమ్ము   గ్రామమున కాశ్యపగోత్రస్తుడైన" ఎచ్చదత్తనుడను" బ్రాహ్మణోత్తముడు కలడు.ధర్మనిష్ఠాపరురాలైన పవిత్ర అతని సహధర్మచారిణి.అపగల్భ దశ నుండి (తల్లి గర్భములో నున్నప్పటినుండి) పరమేశ్వర తత్త్వమును పరిశోధించు బాలుడు ఈశ్వర వరప్రసాదముగా జన్మించెను.పరతత్త్వ విచారణుడు కావుననేవారు అతనికి " విచార శర్మ " అని నామకరణమును చేసిరి.

 " నమః శృతాయచ-శృత సేనాయచ" వేదస్వరూపుడు -వేదములచే స్తుతింపబడువాదు రెండు శివుడు.వేదవిభాగలు-వేదాంగములు-సకల శాస్త్రముల రూపములలో నిండియునవాడు.
 శుభాశీర్వచనమా అన్నట్లు,విచార శర్మ తన ఐదవఏటనే పరమేశ్వర ప్రభాసితములైన వేద-వేదాంగముల,శైవాగమముల సంస్కారమును సముపార్జించెను.స్వయాన దక్షిణాముర్తియ అనునట్లు ప్రకాశించుచున్న బాలునికి,సాంప్రదాయమును అనుసరించి,ఏడవ ఏట ఉపనయన సంస్కారమును గావించి గురువునకు అప్పగించిరి.' నమో వృధ్ధాయచ-సంవృధ్ధనేచ."వృధ్ధాయచ అనగా శివుడు ఆదిదేవుడు.ఆది-అనాది రెండును తానైన వాడు.ఆదిదేవుడు వృధ్ధుడేకాడు సంవృధ్ధుడు. అనగా వేదములచే ప్రస్తుతింపబడువాడు.




 కారుణ్య-కాఠిన్యముల కలగలుపుగా కథను నడిపిద్దామనుకున్నాడు కపర్ది.ఒకనాడు విచారశర్మ, తోటిబాలురతో శివాలయమునకు వెళ్ళుచుండగా అతనిని కార్యోన్ముఖిని చేయాలనుకొన్నాడు.ఎదురుగా ఒక గొల్లవాడు గోవుల మందను దూషించుచు,దుర్భరముగా వాటిని కొట్టుచున్నాడు.ఘోరుడు గోవులకాపరి ఐనాడు.చూచి చలించిపోయాడు విచారశర్మ.

 " నః గోషు మారీరిషః" మా గోవులను బాధింపకుము శివా.గోఘ్నే-గోవులను హింసించువారి బారినుండి రక్షింపుము అనుకొని,వాని దగ్గరకు వెళ్ళి గోసంరక్షణా భారమును తాను స్వచ్ఛందముగా స్వీకరించెను.


 " గవాం అంగేషు తిష్ఠతి భువనాని చతుర్దశా అను భావముతో ఉదయముననే వానిని పచ్చికబయళ్ళలోనికి మేతకు తీసుకుని వెళ్ళేవాడు.కడుపునిండ మేసిన తరువాత జలముదగ్గరకు తీసుకొని వెళ్ళి వాటి దాహమును తీర్చేవాడు.
 " నమః శట్పాయచ-శీభ్యాయచ."నదీతీరముల నుండు పచ్చికనందు-జల ప్రవాహములందుండు రుద్రునకు నమస్కారములు.

   గోవులను మేపుతున్నంతసేపు శివనామములను వల్లిమ్హెడివాడు విచారశర్మ.నమో "శ్రవాయచ-ప్రతిశ్రవాయచ" పులకిస్తూ గోవులు తమ పొదుగులను క్షీరభరితము చేసి,స్వామి అభిషేకమునకు ఉవ్విళ్ళూరుతుండేవి.ఎంతటి పున్నెమును చేసికొన్నవో రుద్రా!.ఇది గమనించిన విచారశర్మ " "నమః సికత్యాయచ" అని ఇసుకలో పరమేశ్వరుని దర్శిస్తూ,ఇసుకతో శివలింగమును తయారుచేసి,కిగుం సిలాయచ-గులకరాళ్లయందున్న స్వామికి వాటితోనే గుడికట్టి.గోవులు తమ ఒక శిరమునుండి వర్షించుచున్న ఖీరముతో అభిషేకిస్తూ,అమితానందమును పొందేవాడు.సూర్యాస్తమయ సమయమునకు వాటిని సురక్షితముగా వాటి యజమానులకు అప్పగించేవాడు.

  " నమో వ కిరికేభ్యో దేవానాం హృదయేభ్యః" అయిన రుద్రుడు దేవతల హృదయములందు ప్రకాశించుచు,మీడుషటమ-సంపదలను వర్షించువాడగుటచే గ్రామస్థులు సంతుష్టులై యుండగా,తన సంకల్పమునకు తగిన సమయమని ఒకనాడు యథావిధిగా అభిషేకము జరుగుచున్న సమయమున అమాయకుని వలె అచటికి ప్రవేశించి,విచార శర్మ ఆవులను నేలపాలు చేయుచున్నాడని అతని తండ్రియైన ఎచ్చదత్తనునికి ఫిర్యాదు చేసెను.గ్రామస్థులును నిందించసాగిరి.

  " నమో ఆలాద్యాయచ" కర్మఫలమును అనుభవింపచేయు రుద్రుడు తండ్రిలోని విచక్షణను


విస్మరింపచేసెను.చెట్టుచాటు నుండి విచారశర్మ క్షీరాభిషేకమును కనుగొనలేని తండ్రి అతనిని నిందిస్తూ,హింసించసాగెను.కాని శివతాదాత్మ్యములో నున్నందున చీమకుట్టినట్టు కూడా లేక ఏ మాత్రము చలించలేదు.దీనితో కట్టలు తెగిన కోపముతో కాలెత్తి క్షీరమున్న కుండను





 తన్నగా అది పగిలి,క్షీరము


 జారిపోయెను.కాఠిన్యము






మరింత తావిస్తూ సైకత లింగము చెదిరిపోయినది.స్వామికి కావలిసినది అదేకదా!

   ' నమః తీక్ష్ణేవే చ ఆయుధనేచా అయ్యాడు విచారశర్మలోని శివుడు పక్కనే నున్న గొడ్దలిని శివాపరాధకునిపై తన తండ్రిపై) విసరగా కాళ్ళు విరిగి,ఇసుకపైననే ప్రాణములను విడిచెను.తిరిగి శివసేవలో




 లీనమైన విచారశర్మకు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై,పరీక్షలో నెగ్గితివని,నెనరులతో తమ పుత్రునిగా స్వీకరించి,చండీశ్వర నామమునొసగి,చిరంజీవిని చేసిరి.

 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.

   ( ఏక బిల్వం శివార్పణం)

  ( ఏక బిల్వం శివార్పణం.)





Monday, April 15, 2019

NAH PRAYACHCHAMTI SAUKHYAM-09

 నః ప్రయచ్చంతి సౌఖ్యం-03
 ************************
'జ్ఞానానంద మయందేవం నిర్మలస్పటికాకృతిం
 ఆధారం సర్వ విద్యానాం హయగ్రీమం ఉపాస్మహే."

  నిర్మల స్పటిక ప్రకాశముతో సకల విద్యలకు ఆధారముగా ప్రకాశించుచున్న హయగ్రీవునికి (గుర్రము తల కలవానికి) సభక్తిపూర్వక నమస్కారములు చేయుచున్నాను.

 అశ్వము-అశ్వపతి తానైన పశుపతికి నమస్కారము.
*******************************************
  అశ్వ సహాయమున స్వామి సరసన కూర్చొనగలిగిన మాణిక్యవాచగరు భక్తునకు నమస్కారము.

  "నమః అసీనేభ్యః  నమః."
 ఆసీనుడైన శివునికి నమస్కారము.

 అశ్వము అను పదమునకు మనము వ్యవహరించు గుఱ్రములు అను అర్థము మాత్రమే కాకుండ  యోగులు,మననములో రమించు మునులు,భవిష్యత్తును దర్శించగల ఋషులను కూడా పేర్కొంటారు.

 " క్షతృభ్యో-సంగ్రహీతభ్యశ్చ నమోనమః."

  అశ్వములను సాకు క్షత్తలకు,వాటి పగ్గములను పట్టుకొని నడిపించు సంగ్రహీతులైన శివస్వరూపములకు నమస్కారములు.

 అశ్వ ఉపాధిచేసికొనిన అదృష్టము అంతాఇంతాకాదు.ఆపూర్వము హయగ్రీవుడను రాక్షుడు దిదేవుడే తన రూపమును ధరింపచేసుకొనినది.పూర్వము హయగ్రీవుడను రాక్షసుడు ఘోర తపమాచరించి,తన వంటి గుర్రపుముఖము కలవాని చేతిలో తప్ప అన్యులచేత చంపబడని వరమును పొందెను.అవధులు దాటిన అజ్ఞానముతో అహంకారపీడితుడై ధర్సమ్రక్షణకు భంగము కావించుచున్న సమయమున, వానికి ముక్తిని ప్రసాదించుటకై స్వామి అశ్వశిరుడై వానిని సంహరించెనట.(దేవీ భాగవతము.)


చిదానందరూపా-మాణిక్య వాచగరు
***************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
అంబాపతి భక్తుడు అరగౌణ మహారాజ అమాత్యులవారు
"తిరువిలయడలు"ను అందించిన మాణిక్య వాచగరు
అశ్వములను కొనుటకు పోవుదారిలో ఈశ్వరుడెదురాయెగ
విశ్వపాలకుని కరుణను ధనము ఈశుని ఆలయమాయెగ
తడవుగ అడవిలో నక్కలు వెడలెను హయముల మాదిరి
విషయము తెలిసిన రాజు విధియించెను శిక్షను బెదిరి
బెంగను తీర్చగ గంగకు ఉప్పొంగగ ఉత్తరువాయెగా
శివ ప్రతిరూపము దైవము ఒకటిగ మారగ కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
వధవురారు తిరువాచగమును రచించిన శివస్వరూపుడు.పాండ్య రాజైన వరగుణవర్మ మంత్రి.వైగై నదీతీరమున గల వధవూరులో జన్మించిరి.వీరి స్తుతులు "తిరుమియిదళ్" పురాణముగ ప్రసిద్ధి గాంచినది.మధుర సంభాషణలను సలిపెడివారు కనుక వధూవరూరు మాణిక్యవాచగరు గా కీర్తింపబడుచున్నారు.స్పురద్రూపియైన వీరు శివసేవక సంకేతముగ తలచుట్టు ఒక చిన్న గుడ్డను కట్టుకొని యుండెడివారు.కర్తవ్య నిర్వహణలో కడు నేర్పరి.
ఒకసారు రాజుగారు మాణిక్యునకు ధనమునిచ్చి రాజ్యమునకు కావలిసిన అశ్వదళమును తెమ్మని ఆదేశించిరి.స్వామికార్యమునకు వెళ్ళుచుండగా " అశ్వేభ్యో -అశ్వపతిభ్యో" ఎదురైనాడు,ఇంకెక్కడి అశ్వములు? తిక్క కుదిరింది అన్నట్లు ఆ ధనముతో గుర్రములను కొనక,తిరుప్పెరుంతరైలో పెద్ద శివాలయము నిర్మింపచేసి,నిమ్మకు నీరెత్తినట్లు మిన్నకుండెను.విషయము తెలిసిన రాజు తన భక్తుని శిక్షించునని అడవి చంద్రశేఖరుడు చమత్కారముగానక్కలను గుర్రములను చేసి,
అశ్వశాల పంపినాడు ఆ ఆశ్రితవాత్సల్యుడు..చిన్న చిన్న చమత్కారాలు చిద్విలాస భాగములుగా ద్యోతకమవుతూ దోబూచులాడుతుంటాయి."ఓం నమః శివాయ".అక్కడ నిలువలేక అడవినక్కలు తమ నిజస్వరూపమును ధరించి అడవిలోని పారిపోయినవి.కాపు పాపములను హరించదలచనేమో.హర హర మహాదేవ శంభో శంకరా.విషయమును గ్రహించిన రాజు మాణిక్య వాచగరును పంచాగ్నుల మధ్య బంధించమని శాసించెను

"నమః కృత్స్నవీతాయ ధావతే సత్వనాం పతయే నమః".

  శరణు పొందిన సాత్వికుడైన భక్తుడు ముందు నడుస్తుంటే వానిని రక్షించుటకై స్వామి వాని వెనుక అందుకునేటందుకు పరుగులెత్తుచుంటాడట.అది తన సర్వ సైన్యములతో.ఎంతఈ భాగ్యశాలి ఆ మాణిక్యవాచగరు.

.భోళా శంకరునితో వేళాకోళములా?వైశ్వానరునిపై( అగ్నిని మూడవ కన్నుగ కలవాడు) అచంచల భక్తికి అగ్ని శత్రువు కాగలదా? గంగాధరుని యాన కావున గంగ ఉప్పొంగి మాణిక్య వాచగరు శివభక్తిని చిరస్మరణీయము చేసినది. రాజును సంస్కరించి ,సత్కృపను పొందునట్లు చేసినది. సదా శివుడు మాణిక్య వాచగరు సరసను కూర్చుండి భగవంతుని భక్తునికి గల సాన్నిహిత్యమును ఋజువు చేసినాడు. సమయమాసన్నమయినపుడు స శరీరముతో (అవశేషములను మిగల్చకుండ) శివము శివములో మమేకమైనది.ఈశానాం సర్వ విద్యానాం-ఈశ్వర: సర్వ భూతానాం.......మనందరిలో నిండి మమ్ములను కాపాడుచుండును గాక.

  ( ఏక బిల్వం శివార్పణం.)

NAH PRAYACHCHAMTI SAUKHYAM-08

  నః ప్రయచ్చంతి సౌఖ్యం-08
  ******************************
 భళి భళి భళి మహదేవా-బహుబాగున్నదయా నీ మాయ
 *******************************************






 భగవంతుడు-భక్తుడు ఇద్దరు రథికులే

  రథము-రథకారుడు-రథసారధి ముగ్గురు రుద్రుడే.

 " నమో రథేభ్యో-రథపతిభ్యశ్చవో నమః."

  భవిష్యత్ పురాణము ప్రకారము రుద్రుడు రథము మరియు రథపతి.చతుర్వేదములు చతురాశ్వములు.సూర్యచంద్రులు రథచక్రాలు.ముప్పదిమూడుకోట్ల దేవతలు రథభాగములు.చతుర్ముఖ బ్రహ్మ రథసారథి.స్వామి మేరుపర్వతమును ధనువుగా,వాసుకిని అల్లెత్రాడుగా,హరిని అస్త్రముగా చేసి త్రిపురాసర సంహారమును గావించి జగములను రక్షించినాడు
.

 ' ఓం తక్షభ్యః- రథకారేభ్యో నమోనమః " ( వడ్రంగి) రథకారునకు నమస్కారములు.


 రంభణశీలత్వా రథః.కదిలే స్వభావము కలది రథము.ఈ విధముగా గమనిస్తే జగతిలో కదలిక కలిగిన ప్రతిజీవి రథమే.దానిని సృష్టించిన పరమాత్మ రథకారుదే.నడిపిస్తున్న పరమేశ్వరుడు రథసారథియే." నమో సూతేభ్యో-ఒకసారి అరుణాచలములో స్వామివారి రథము కదిలి గర్భగుడిని చేరుటకు మొరాయించినదని,కావ్యకంఠ గణపతి వారి తన దక్షిణహస్తముతో స్పర్శించగానే కదిలినదని చెపుతారు.అరుణాచల శివ-అరుణాచలశివ అరుణాచల శివ -అరుణాచలా.
 నిన్న మనము సదాశివుని కృపతో విచారశర్మ యను యజ్ఞోపవీతి యగు శివస్వరూపుని గురించి తెలుసుకొనుటకు ప్రయత్నించాము.ఈ రోజు మనునీ చోళుడను పేరుగల క్షాత్ర శివస్వరూపమును గురించి అర్థముచేసికొనుటకు ప్రయత్నిద్దాము.మానవ శరీరము దశేంద్రియ సప్తధాతాదులతో కూడిన రథము కదా,కదులుచున్న స్వభావము కలది కనుక మన శరీరము కూడ ఒక రథమే.అటువంటి అనేక రథములను (జనులను) పాలించుచున్న సారథి మనునీ చోళ మహారాజు..తిరువారూరు ప్రాంతము.సకలజీవులను కంటికి రెప్పవలె కాపాడుతయే అతని ఆశయము.ధర్మపాలనలో జనులును ధర్మపరాయణులై
                   ధర్మదేవతను గౌరవించుచు,సంతోషింపచేయుచుండిరి." నమో భవాయచ-రుద్రాయచ." ప్రాణులందరికిని కారణమైన రుద్రునికి నమస్కారము.రోదనమునకు హేతువైన దుఃఖమును పోగొట్టువానికి నమస్కారములు.

 " నమః సోభ్యాయచ-ప్రతిసర్యాయచ"పుణ్యము-పాపము గల మనుష్య లోకముసోభ్యము.అందున్నవాడు కనుక సోభ్యాయచ. యువరాజుగ జన్మించిన రుద్రా నీకు నమస్కారము.కాలాతీతుడు కాలముతో పాటు పెరుగుచు,శాస్త్ర పారంగతునిగా-సత్ప్రవర్తునిగా అలరారుచుండెను.ఈశ్వరాజ్ఞ ఎవరు మీరగలరు? అది ఎవరెరుగరు పరమేశ్వరాజ్ఞ !? ఒకనాడు అతను తన సైనికులతో పాటు,రథారూఢుడై ఊరేగింపుగా వెడలెను.' ఓం నమో ఆశుషేణాయ చ ఆశురథాయచ." వేగముగా నడచు సేన-వేగముగా కదులు రథము గలవాడా నీకు నమస్కారము.రథములోనున్న రాజకుమారునికి ఇది పరీక్షయో లేక ప్రసాదమో అనునట్లుగా రథసారధియైన రుద్రుడు అతివేగముగా అదుపుతప్పుతున్నదా యన్నట్లు నడిపించుచున్నాడు. ఎందుకయ్య రథమును అర్థముకాని విధముగా పరుగులెత్తించుచున్నావు పరమేశ్వరా? .ఇది ఏ పరిణామమునకు పథకమో పశుపతి.ఏ ప్రాయశ్చిత్తమునకు ప్రారంభమో కదా!కాఠిన్యమనిపించు కారుణ్య కథనమునకై కదిలివచ్చినది ఆవుదూడ పరుగులతో.అదుపు తప్పినది రథము,.అసువులు బాసినది దూడ ఆ హరుని లీలగ.అయ్యో ఎంతటి ఘోరము..లీనముచేసుకొనువాని లీల యన. లీలయన.దీనిని చూసిన గోమాత దుఃఖముతో నేలపై పడి తెలివి తప్పినది.రాజకుమారుడు తన పాపమునకు పరిహారము లేదని పరిపరి విధముల శోకింపసాగెను.

" నమో యామ్యాయచ-క్షేమ్యాయచ"

  యమలోకమున పాపాత్ములను శిక్షించు యముని వలె నున్న రుద్రస్వరూపుడును,ప్రజల శాంతిసౌభాగ్యములకు క్షేమంకరుడు అగు రాజు ఉన్న రాజభవన రాజద్వారమునకు చనిపోయిన దూడ తల్లి వెళ్ళి,న్యాయమునకై ధర్మ గంటను మ్రోగించెను." నమో హంత్రేచ-హనీయసేచ" పాపకర్మములను అధికముగా అంతమొందించు స్వభావము కలరాజు జరిగిన ఘోరమును విని,నిష్పక్షపాతియై ఎవరు ఎన్నిచెప్పినను ప్రభావితుడు కాకుండ,తనకుమారుని రథచక్రముల క్రిందనుంచి,అంతము చేయమని,గోవు ఏ పుత్ర శోకమును అనుభవించుచున్నదో-దానిని తానును అనుభవించుట న్యాయమని ఆజ్ఞాపించెను.'

     " నమో ప్రతరణాయచచోత్తరణాయచ." సంసార సాగరములో సంచితములను తొలగించి,సన్మార్గమున నడుపు సదాశివుడు అనుకూలిస్తాడా ఆ అపమృత్యు దోష దండనను.అసలే శంగుడు.



 నమః శంగాయచ-పశుపతియేచ." తనభక్తులకు దుఃఖమును కలుగచేస్తాడా శంగుడు అనగా సుఖమునే పొందించువాడు.శిక్ష అమలుపరచు సమయమున ఎంత మోసగాడవయ్యా శివా అన్న నోటితోనే  అబ్బ నువ్వెంత మంచివాడవయ్యా శివా అనిపించేటట్లుగా,


   రాజకుమారుని పైన ఉన్న రథచక్రము పుష్పహారమై గళమున పరిమళములను వెదజల్లుతోంది.పక్కనే అవుదూడ అవధులు లేని ఆనందమును ఆస్వాదిస్తు చెంగు చెంగు న గంతులేస్తున్నది.


  .భక్త సులభుడు అనురక్తితో వారిని ఆశీర్వదిస్తున్నాడు."

 " నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ
   త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ
   కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ
   సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః."

 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.

   ( ఏక బిల్వం శివార్పణం)

   ( ఏక బిల్వం శివార్పణం.)



TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...