నః ప్రయచ్చంతి సౌఖ్యం-03
************************
'జ్ఞానానంద మయందేవం నిర్మలస్పటికాకృతిం
ఆధారం సర్వ విద్యానాం హయగ్రీమం ఉపాస్మహే."
నిర్మల స్పటిక ప్రకాశముతో సకల విద్యలకు ఆధారముగా ప్రకాశించుచున్న హయగ్రీవునికి (గుర్రము తల కలవానికి) సభక్తిపూర్వక నమస్కారములు చేయుచున్నాను.
అశ్వము-అశ్వపతి తానైన పశుపతికి నమస్కారము.
*******************************************
అశ్వ సహాయమున స్వామి సరసన కూర్చొనగలిగిన మాణిక్యవాచగరు భక్తునకు నమస్కారము.
"నమః అసీనేభ్యః నమః."
ఆసీనుడైన శివునికి నమస్కారము.
అశ్వము అను పదమునకు మనము వ్యవహరించు గుఱ్రములు అను అర్థము మాత్రమే కాకుండ యోగులు,మననములో రమించు మునులు,భవిష్యత్తును దర్శించగల ఋషులను కూడా పేర్కొంటారు.
" క్షతృభ్యో-సంగ్రహీతభ్యశ్చ నమోనమః."
అశ్వములను సాకు క్షత్తలకు,వాటి పగ్గములను పట్టుకొని నడిపించు సంగ్రహీతులైన శివస్వరూపములకు నమస్కారములు.
అశ్వ ఉపాధిచేసికొనిన అదృష్టము అంతాఇంతాకాదు.ఆపూర్వము హయగ్రీవుడను రాక్షుడు దిదేవుడే తన రూపమును ధరింపచేసుకొనినది.పూర్వము హయగ్రీవుడను రాక్షసుడు ఘోర తపమాచరించి,తన వంటి గుర్రపుముఖము కలవాని చేతిలో తప్ప అన్యులచేత చంపబడని వరమును పొందెను.అవధులు దాటిన అజ్ఞానముతో అహంకారపీడితుడై ధర్సమ్రక్షణకు భంగము కావించుచున్న సమయమున, వానికి ముక్తిని ప్రసాదించుటకై స్వామి అశ్వశిరుడై వానిని సంహరించెనట.(దేవీ భాగవతము.)

చిదానందరూపా-మాణిక్య వాచగరు
***************************************
***************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
అంబాపతి భక్తుడు అరగౌణ మహారాజ అమాత్యులవారు
"తిరువిలయడలు"ను అందించిన మాణిక్య వాచగరు
"తిరువిలయడలు"ను అందించిన మాణిక్య వాచగరు
అశ్వములను కొనుటకు పోవుదారిలో ఈశ్వరుడెదురాయెగ
విశ్వపాలకుని కరుణను ధనము ఈశుని ఆలయమాయెగ
విశ్వపాలకుని కరుణను ధనము ఈశుని ఆలయమాయెగ
తడవుగ అడవిలో నక్కలు వెడలెను హయముల మాదిరి
విషయము తెలిసిన రాజు విధియించెను శిక్షను బెదిరి
విషయము తెలిసిన రాజు విధియించెను శిక్షను బెదిరి
బెంగను తీర్చగ గంగకు ఉప్పొంగగ ఉత్తరువాయెగా
శివ ప్రతిరూపము దైవము ఒకటిగ మారగ కారణమాయెగ
శివ ప్రతిరూపము దైవము ఒకటిగ మారగ కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
వధవురారు తిరువాచగమును రచించిన శివస్వరూపుడు.పాండ్య రాజైన వరగుణవర్మ మంత్రి.వైగై నదీతీరమున గల వధవూరులో జన్మించిరి.వీరి స్తుతులు "తిరుమియిదళ్" పురాణముగ ప్రసిద్ధి గాంచినది.మధుర సంభాషణలను సలిపెడివారు కనుక వధూవరూరు మాణిక్యవాచగరు గా కీర్తింపబడుచున్నారు.స్పురద్రూపియైన వీరు శివసేవక సంకేతముగ తలచుట్టు ఒక చిన్న గుడ్డను కట్టుకొని యుండెడివారు.కర్తవ్య నిర్వహణలో కడు నేర్పరి.
ఒకసారు రాజుగారు మాణిక్యునకు ధనమునిచ్చి రాజ్యమునకు కావలిసిన అశ్వదళమును తెమ్మని ఆదేశించిరి.స్వామికార్యమునకు వెళ్ళుచుండగా " అశ్వేభ్యో -అశ్వపతిభ్యో" ఎదురైనాడు,ఇంకెక్కడి అశ్వములు? తిక్క కుదిరింది అన్నట్లు ఆ ధనముతో గుర్రములను కొనక,తిరుప్పెరుంతరైలో పెద్ద శివాలయము నిర్మింపచేసి,నిమ్మకు నీరెత్తినట్లు మిన్నకుండెను.విషయము తెలిసిన రాజు తన భక్తుని శిక్షించునని అడవి చంద్రశేఖరుడు చమత్కారముగానక్కలను గుర్రములను చేసి,
"నమః కృత్స్నవీతాయ ధావతే సత్వనాం పతయే నమః".
శరణు పొందిన సాత్వికుడైన భక్తుడు ముందు నడుస్తుంటే వానిని రక్షించుటకై స్వామి వాని వెనుక అందుకునేటందుకు పరుగులెత్తుచుంటాడట.అది తన సర్వ సైన్యములతో.ఎంతఈ భాగ్యశాలి ఆ మాణిక్యవాచగరు.
అశ్వశాల పంపినాడు ఆ ఆశ్రితవాత్సల్యుడు..చిన్న చిన్న చమత్కారాలు చిద్విలాస భాగములుగా ద్యోతకమవుతూ దోబూచులాడుతుంటాయి."ఓం నమః శివాయ".అక్కడ నిలువలేక అడవినక్కలు తమ నిజస్వరూపమును ధరించి అడవిలోని పారిపోయినవి.కాపు పాపములను హరించదలచనేమో.హర హర మహాదేవ శంభో శంకరా.విషయమును గ్రహించిన రాజు మాణిక్య వాచగరును పంచాగ్నుల మధ్య బంధించమని శాసించెను
శరణు పొందిన సాత్వికుడైన భక్తుడు ముందు నడుస్తుంటే వానిని రక్షించుటకై స్వామి వాని వెనుక అందుకునేటందుకు పరుగులెత్తుచుంటాడట.అది తన సర్వ సైన్యములతో.ఎంతఈ భాగ్యశాలి ఆ మాణిక్యవాచగరు.
.భోళా శంకరునితో వేళాకోళములా?వైశ్వానరునిపై( అగ్నిని మూడవ కన్నుగ కలవాడు) అచంచల భక్తికి అగ్ని శత్రువు కాగలదా? గంగాధరుని యాన కావున గంగ ఉప్పొంగి మాణిక్య వాచగరు శివభక్తిని చిరస్మరణీయము చేసినది. రాజును సంస్కరించి ,సత్కృపను పొందునట్లు చేసినది. సదా శివుడు మాణిక్య వాచగరు సరసను కూర్చుండి భగవంతుని భక్తునికి గల సాన్నిహిత్యమును ఋజువు చేసినాడు. సమయమాసన్నమయినపుడు స శరీరముతో (అవశేషములను మిగల్చకుండ) శివము శివములో మమేకమైనది.ఈశానాం సర్వ విద్యానాం-ఈశ్వర: సర్వ భూతానాం.......మనందరిలో నిండి మమ్ములను కాపాడుచుండును గాక.
( ఏక బిల్వం శివార్పణం.)
No comments:
Post a Comment