Wednesday, April 17, 2019

NAH PRAYACHCHANTI SAUKHYAM-10

     నః ప్రయచ్చంతి సౌఖ్యం.-10
     *************************
  కైలాసపురి నుండి కాశికై-కాశికాపురి నుండి దరహాసివై
  మా హృదయవాసిగా భాసిలుతు-నడిపించ ఎదురుగా
  కనిపించుచున్నావుకరుణతో  శివశివా-హరహరా

   భగవంతుడు-భక్తుడు ఇద్దరు బ్రాహ్మణులే-యజ్ఞోపవీతులే.

   " నమో హరికేశాయ ఉపవీతినే పుష్టానాం పతయే నమః."

శివుడు హరికేశుడు అనగా నల్లని శిరోజములు కలవాడు.శివుని నల్లని కేశములు వార్ధక్యము లేని వాడని,కాల ప్రభావములను అధిగమించినవాడన్న విషయమును తెలియచేయుచున్నది.మరియు శివుడు ఉపవీతుడు.బంధము కలవాడు.ఉప అనగా దగ్గరగా నున్నవాడు.సాక్షాత్తు గాయత్రీమాతయే.శివుడు వేదమాత గాయత్రీదేవి సంకేతమును ధరించిన వేదమయుడు.అంతేకాదు తాను ధరించిన ఉపవీతము (జందెము) పుష్టులను (వాక్పుష్టి-జ్ఞానపుష్టి-ఇంద్రియపుష్టి -ధర్మపుష్టి) మొదలగు వానిని పరిపూర్ణముగా ప్రసాదించగలవాడను శివతత్త్వమును చాటుచున్నది.అదే భక్త రక్షణా ధర్మసంస్థాపన ధారణము.


     ఇద్దరును మంగళము కొరకు ఉపవీతమును,గాయత్రీ కృపను ధరించినవారు.అనగా బ్రహ్మజ్ఞానమునందు నిష్ణాతులు.మరియును వాక్పుష్టి-జ్ఞానపుష్టి-ధన-ధాన్యపుష్టి,ఇంద్రియపుష్టి,ధర్మపుష్టి గల రుద్రస్వరూపులు.

 " సర్వేషామధికో యస్మాన్ భగవాన్-బ్రాహ్మణ శివః." పరాశర సంహిత కీర్తించుచున్నది.అభినవ శంకరులు రుద్రుని ప్రథమ బ్రాహ్మణుడు అని అభివర్ణించిరి.తన సస్వరూపమును గ్రహించి తనలోని బ్రహ్మము నిత్యమని,శరీరము అనిత్యమని గ్రహించినవాడు బ్రహ్మజ్ఞాని."బ్రహ్మమొక్కటే-పరబ్రహ్మమొక్కటే" అన్నమయ్య.


 
    సద్భావన వలన పంచాక్షరి.వర్షము వలన ఆకాశము,శైవము వలన వేదములు ,,భాగవతుల వలన క్షేత్రములు పునీతములగుచున్నవని నమ్ము   గ్రామమున కాశ్యపగోత్రస్తుడైన" ఎచ్చదత్తనుడను" బ్రాహ్మణోత్తముడు కలడు.ధర్మనిష్ఠాపరురాలైన పవిత్ర అతని సహధర్మచారిణి.అపగల్భ దశ నుండి (తల్లి గర్భములో నున్నప్పటినుండి) పరమేశ్వర తత్త్వమును పరిశోధించు బాలుడు ఈశ్వర వరప్రసాదముగా జన్మించెను.పరతత్త్వ విచారణుడు కావుననేవారు అతనికి " విచార శర్మ " అని నామకరణమును చేసిరి.

 " నమః శృతాయచ-శృత సేనాయచ" వేదస్వరూపుడు -వేదములచే స్తుతింపబడువాదు రెండు శివుడు.వేదవిభాగలు-వేదాంగములు-సకల శాస్త్రముల రూపములలో నిండియునవాడు.
 శుభాశీర్వచనమా అన్నట్లు,విచార శర్మ తన ఐదవఏటనే పరమేశ్వర ప్రభాసితములైన వేద-వేదాంగముల,శైవాగమముల సంస్కారమును సముపార్జించెను.స్వయాన దక్షిణాముర్తియ అనునట్లు ప్రకాశించుచున్న బాలునికి,సాంప్రదాయమును అనుసరించి,ఏడవ ఏట ఉపనయన సంస్కారమును గావించి గురువునకు అప్పగించిరి.' నమో వృధ్ధాయచ-సంవృధ్ధనేచ."వృధ్ధాయచ అనగా శివుడు ఆదిదేవుడు.ఆది-అనాది రెండును తానైన వాడు.ఆదిదేవుడు వృధ్ధుడేకాడు సంవృధ్ధుడు. అనగా వేదములచే ప్రస్తుతింపబడువాడు.




 కారుణ్య-కాఠిన్యముల కలగలుపుగా కథను నడిపిద్దామనుకున్నాడు కపర్ది.ఒకనాడు విచారశర్మ, తోటిబాలురతో శివాలయమునకు వెళ్ళుచుండగా అతనిని కార్యోన్ముఖిని చేయాలనుకొన్నాడు.ఎదురుగా ఒక గొల్లవాడు గోవుల మందను దూషించుచు,దుర్భరముగా వాటిని కొట్టుచున్నాడు.ఘోరుడు గోవులకాపరి ఐనాడు.చూచి చలించిపోయాడు విచారశర్మ.

 " నః గోషు మారీరిషః" మా గోవులను బాధింపకుము శివా.గోఘ్నే-గోవులను హింసించువారి బారినుండి రక్షింపుము అనుకొని,వాని దగ్గరకు వెళ్ళి గోసంరక్షణా భారమును తాను స్వచ్ఛందముగా స్వీకరించెను.


 " గవాం అంగేషు తిష్ఠతి భువనాని చతుర్దశా అను భావముతో ఉదయముననే వానిని పచ్చికబయళ్ళలోనికి మేతకు తీసుకుని వెళ్ళేవాడు.కడుపునిండ మేసిన తరువాత జలముదగ్గరకు తీసుకొని వెళ్ళి వాటి దాహమును తీర్చేవాడు.
 " నమః శట్పాయచ-శీభ్యాయచ."నదీతీరముల నుండు పచ్చికనందు-జల ప్రవాహములందుండు రుద్రునకు నమస్కారములు.

   గోవులను మేపుతున్నంతసేపు శివనామములను వల్లిమ్హెడివాడు విచారశర్మ.నమో "శ్రవాయచ-ప్రతిశ్రవాయచ" పులకిస్తూ గోవులు తమ పొదుగులను క్షీరభరితము చేసి,స్వామి అభిషేకమునకు ఉవ్విళ్ళూరుతుండేవి.ఎంతటి పున్నెమును చేసికొన్నవో రుద్రా!.ఇది గమనించిన విచారశర్మ " "నమః సికత్యాయచ" అని ఇసుకలో పరమేశ్వరుని దర్శిస్తూ,ఇసుకతో శివలింగమును తయారుచేసి,కిగుం సిలాయచ-గులకరాళ్లయందున్న స్వామికి వాటితోనే గుడికట్టి.గోవులు తమ ఒక శిరమునుండి వర్షించుచున్న ఖీరముతో అభిషేకిస్తూ,అమితానందమును పొందేవాడు.సూర్యాస్తమయ సమయమునకు వాటిని సురక్షితముగా వాటి యజమానులకు అప్పగించేవాడు.

  " నమో వ కిరికేభ్యో దేవానాం హృదయేభ్యః" అయిన రుద్రుడు దేవతల హృదయములందు ప్రకాశించుచు,మీడుషటమ-సంపదలను వర్షించువాడగుటచే గ్రామస్థులు సంతుష్టులై యుండగా,తన సంకల్పమునకు తగిన సమయమని ఒకనాడు యథావిధిగా అభిషేకము జరుగుచున్న సమయమున అమాయకుని వలె అచటికి ప్రవేశించి,విచార శర్మ ఆవులను నేలపాలు చేయుచున్నాడని అతని తండ్రియైన ఎచ్చదత్తనునికి ఫిర్యాదు చేసెను.గ్రామస్థులును నిందించసాగిరి.

  " నమో ఆలాద్యాయచ" కర్మఫలమును అనుభవింపచేయు రుద్రుడు తండ్రిలోని విచక్షణను


విస్మరింపచేసెను.చెట్టుచాటు నుండి విచారశర్మ క్షీరాభిషేకమును కనుగొనలేని తండ్రి అతనిని నిందిస్తూ,హింసించసాగెను.కాని శివతాదాత్మ్యములో నున్నందున చీమకుట్టినట్టు కూడా లేక ఏ మాత్రము చలించలేదు.దీనితో కట్టలు తెగిన కోపముతో కాలెత్తి క్షీరమున్న కుండను





 తన్నగా అది పగిలి,క్షీరము


 జారిపోయెను.కాఠిన్యము






మరింత తావిస్తూ సైకత లింగము చెదిరిపోయినది.స్వామికి కావలిసినది అదేకదా!

   ' నమః తీక్ష్ణేవే చ ఆయుధనేచా అయ్యాడు విచారశర్మలోని శివుడు పక్కనే నున్న గొడ్దలిని శివాపరాధకునిపై తన తండ్రిపై) విసరగా కాళ్ళు విరిగి,ఇసుకపైననే ప్రాణములను విడిచెను.తిరిగి శివసేవలో




 లీనమైన విచారశర్మకు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై,పరీక్షలో నెగ్గితివని,నెనరులతో తమ పుత్రునిగా స్వీకరించి,చండీశ్వర నామమునొసగి,చిరంజీవిని చేసిరి.

 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.

   ( ఏక బిల్వం శివార్పణం)

  ( ఏక బిల్వం శివార్పణం.)





No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...