నః ప్రయచ్చంతి సౌఖ్యం-04
*****************************
" ద్రాపే అంధసస్పతే దరిద్రన్ నీలలోహిత"
భగవంతుడు-భక్తుడు ఇద్దరు ఈశ్వరచైతన్యమే.
అన్నాద్ భవంతి భూతాని-పర్జన్యాద్ అన్న సంభవః.
అన్నము వలన జనులు మేఘముల వలన అన్నము ఉత్పత్తి అగుచున్నవి ( శ్రీమద్భగవద్గీత )
కరుణతో అన్నమును ప్రసాదించుచు ఆదిదేవుడు,భక్తితో అన్నమును ఆరగింపుచేయుచు అరివట్టాయ నయనారు పరమపూజ్యులు.హర హర మహాదేవ శంభో శంకర.
ద్రాపే-ఓ శివా నీవు అఘోరరూపివై భక్తుల అన్నమును పాలిస్తావు.అదేవిధముగా ద్రాపే ఓ శివా ఘోర రూపివై పాపులను శిక్షిస్తావు.పాపము-పుణ్యము అనునవి,ఘోర-అఘోర రూపములు మేము చేసిన -చేయుచున్న పనుల ఫలితములే కాని అన్యము కాదు అను తెలివిని మాకు అనుగ్రహించు తండ్రీ అని వేడుకొను,
అగస్త్య కమండలజలము నేలపై జారి,కావేరి నదిగా రూపాంతరమును పొంది, ప్రవహించుచున్న "గణమంగళ" పట్టణమున తాయినార్ అను సంపన్న గృహస్థుడు ధర్మపరాయణుడై యుండెను.
"
యే అన్నేషు వివిధ్యంతి పాత్రేషు పిబతే జవాన్"
" తే పథాం పథి రక్షయ ఐలబృదాయ వ్యుధః."
ఐలము అనగా అన్న సముదాయము అను అర్థము కలదు.మనకు శుభ్రమగు అన్నమను అందించుచున్న రుద్రునకు నమస్కారములు అనుకొనుచు,
మరియును యే రుద్రులు అన్నము మొదలగు వానియందు సూక్ష్మరూపమున ప్రవేశించి,వ్యాధులను సంక్రమింపచేస్తున్నారో,వారి బారిన పడకుండ ఈశ్వరుడు మనలను రక్షించును గాక.అని స్వామిని ప్రార్థించుచు,
" ఓం అంధసస్పతే" అన్నమును పాలించు స్వామి,మాకు అన్నమును ప్రసాదించు స్వామి అని స్తుతులను చేయుచు,శ్రేష్ఠమైన కేసరి బియ్యము అన్నము,ఆకు కూరలు,మామిడి ఒరుగులతో స్వామికి నిత్య నైవేద్యములను సమర్పించెడివాడి".భోజనము-భోజ్యము-భోక్త మూడు" తానే అయిన స్వామి స్వీకరించుచుండెడి వాడు."ఊర్కశ్చమే (వరిధాన్యములు) పయశ్చమే (పాలును) ఘృతంచమే (నేయి) అన్నీ తానై అందరికి ప్రసాదించెడి స్వామి ఆరగింపుల ఆటను కొత్తమలుపు తిప్పాలనుకున్నాడు.
కాలాతీతుని కనుసన్నలలో కాలము పరుగులిడుతున్నది.ఏ వికారములేని సామి తనలీలగ ఏ ఆకారమునైనను స్వీకరించగలడు.అంధసస్పతి ద్రాపేగాఆరగింపుచేయు భక్తునకు ఆరడుల గారడీ మొదలుపెట్టాడు ఆ ఆదిదేవుడు. తన స్వభావమును మార్చుకున్నాడు.దరిద్రపు ఛాయలు సమీపించి నయనారును ధర్మపరీక్షకు నాంది పలుకుచున్నవి.ఐహిక సంపదలు అంతరించుచున్నను,దరిద్రుని చేయుచున్నను ఐహికముగాదరిద్రన్ నీలలోహిత-తనకంటు ఏమి దాచుకోలేని నీలలోహితుని సేవను మనలేదు.,శివభక్తి అను సంపద సమృద్ధిగా కలవాడగుటచే దంపతులు తమ భోజన విషయములో సమయానుకూలముగా సడలింపులు చేసికొనిరి.ఒక సారి ఆకుకూరలతో,అవి లభించనపుడు జలముతో కడుపునింపుకొనుచు,ఆదిదంపతుల ఆరగింపు సేవను నిరాటంకముగా కొనసాగించుచుండిరి."తక్కువేమి మనకు ముక్కంటి దయ మన పక్కనుండు వరకు".
భావదారిద్రము తెలియని ఆ నయనారు స్వామి నీ చిద్విలాసమును కాదనగలనా! నన్ను, చేత కొడవలిని ధరించి వరికోతలు కోయు కూలిగా చూడదలిచావా? నువ్వు అదేపని చేస్తున్నావని నాకు తెలుసులే.ఓ ఆతతాయి నమోనమః ఆయుధమును ధరించిన సామి.మా పాపరాశులను నీ దయ అను కత్తితో అనవరతము కోస్తున్నావు.
" నమో భవస్య హేత్యై జగతాం పతయే నమః."
కనుకనే నాకు ఈ వరిపంటను కోయు కూలిపనిని చూపించి,నీ ఆరగింపునకు భంగము రాకుండా ఆదాయమును అందించుచున్నావు. అని పరిపరి విధముల ప్రస్తుతిస్తున్నాడు అరివట్టయ నాయనారు.
" నమో భవస్య హేత్యై జగతాం పతయే నమః."
కనుకనే నాకు ఈ వరిపంటను కోయు కూలిపనిని చూపించి,నీ ఆరగింపునకు భంగము రాకుండా ఆదాయమును అందించుచున్నావు. అని పరిపరి విధముల ప్రస్తుతిస్తున్నాడు అరివట్టయ నాయనారు.
" పుటము వేస్తేనే కద పసిడికి మెరుపు
పరీక్షిస్తేనే కద భక్తునికి గెలుపు"
ఒకసారి పొలము మొత్తములో కేసరి బియ్యము మాత్రమే పండినవి.మొత్తము స్వామి ఆరగింపునకు భద్రపరచి,వారు నిశ్చలభక్తితో అచలాధీశుని అర్చించుచుండిరి.అన్యము తెలియని వారి దరిచేరలేదు కద అన్యాయము.పరమ పవిత్రతతో స్వామి ఆరగింపునకు ఒకరోజు నయనారు నైవేద్యమును తనశిరమున పెట్టుకొని బయలుదేరెను.పంచగవ్యములను తలపై నిడుకొని పరమభక్తితో పతిని అనుసరిస్తున్నది ఆ సాధ్వి.వారు నడుస్తుండగా పతాకసన్నివేశ సమయమాసన్నమయినదని హరిత పతాకను కదిపాడు హరుడు.హరోం హర.అధోక్షజుని వీక్షణమన వారి కాలు తడబడి నైవేద్యములు-పంచగవ్యములు నేలపాలైనవి.కావలిసినది అదేకద ఆ నీలకంఠునికి.విషము తాగినవాడు పెట్టు విషమ పరీక్ష మిషలేకుండ జరుగదు కద.
ఘోర-అఘోరములు రెండింటి యందున్న స్వామి ఏమి జరుగబోతున్నదో తేరిపార చూస్తున్నాడు.నిర్లిప్తతతో నయనారు అయ్యో ఎంత ఘోరము జరిగినది.స్వామి నైవేద్యమును అందించలేని నా పాపమునకు నిష్కృతి లేదు అని వాపోవుచు,కొడవలితో తన కుత్తుకను కత్తిరించుకొన బోయెను
" నమో పాగం సవ్యాయచ రజస్యాయచ."
కంటికి కనిపించనంత సూక్ష్మముగా నున్న దుమ్ము పాంసువు.అందులోను ఉండి పరిపాలించువాడు పరమాద్భుతముగా ఆరగింపును కొనసాగించెను.పవి పుష్పంబగు అన్నరీతి
.విచిత్రము కొడవలి పూలదండగా గళమున మెరయుచున్నది.

కంటికి కనిపించనంత సూక్ష్మముగా నున్న దుమ్ము పాంసువు.అందులోను ఉండి పరిపాలించువాడు పరమాద్భుతముగా ఆరగింపును కొనసాగించెను.పవి పుష్పంబగు అన్నరీతి .అస్తవ్యస్తతను సరిచేయకుండ ఉండగలడా పులస్తుడు.అదేనండి భక్త సులభుడు.వారి ముందు తానుండి అనవరతము రక్షించెడి వాడు. అందునా |"భువంత".భూమిని విస్తరింపచేసి,పోషించెడి వాడు." సర్వత్ర సర్వత్ర భవతి" అన్నట్లుగ ఎల్లప్పుడు అన్నిస్థలములందుండు రుద్రుడు తాను ముందుండి భక్తులను నడిపించు పులస్తుడు పృథ్వీలింగమైనాడో ఏమో, భూమిమీదకి తన చేతిని ఉంచి ఆరగింపు చేస్తు, అద్భుతము చూపాడు. అతిపవిత్రమైనది ఆరగింపు ఆ ఆదిభిక్షువు హస్తస్పర్శతో.అవనీతలము పులకించింది తన పుణ్యమునకు.
" యాతే రుద్ర శివా తనూశ్శివ విశ్వాహ భేషజీ
శివా రుద్రస్య భేషజీ తయా నో మృడజీవసే".
శివా నీ శుభకర రూపముతో,మంగళకర జ్ఞానమునిచ్చి మమ్ములను అనుగ్రహింపుము అని వేనోళ్ళ కీర్తించినది.

No comments:
Post a Comment