నః ప్రయచ్చంతి సౌఖ్యం-20
*******************************
భగవంతుడు చర్మధారుడు-భక్తుడు చర్మకారుడు
" గజచర్మావృత తనుం స్ఫురత్ ప్రహరణోజ్వలం
సర్వపాపహరం ధ్యాయేత్ దేవం కుంజర భేదినం."
పరమేశ్వరుడు గజచర్మమును ధరించి యుండెను.శత్రువులపై ప్రయోగించుటకై చేతిలో చేతిలో ఆయుధములతో ప్రకాశిస్తున్నాడు.భక్తుల సర్వపాపములను హరించుచున్న రుద్రునకు నమస్కారము.
లోకకళ్యాణమునకై త్రిలోక సంచారి-త్రిలోకవేది యైన నారద మహర్షి గజాసురుని సభకు వెళ్ళి,గజాసురా! నీవు అతిబలవంతుడవు కావున నీ తపోమహిమతో శివుని నీ ఉదరమునందు నివసించు వరము కోకోమనెను.ఉచితానుచితములను మరచిన గజాసురుడు అదేపని చేసెను.స్వామిని కైలాసమునకు తిరిగి తీసుకొనివెళ్ళుటకు గంగిరెద్దుల మేళముతో బ్రహ్మ-విషుణు ంతక్కిన సురలు విచిత్రవేషములతో గజాసురుని కొలువునకు వచ్చిరి.గంగిరెద్దుల మేళముపై అత్యంతాసక్తి గల అసురుడు వారు ఆడుటకు అనుమతినిచ్చెను.విష్ణువువు చేయుచున్న స్తుతులకు భోళా శంకరుడు అమితముగా పొంగిపోవుటచే,భరించుటకు గజాసురునికి కష్టమాయెను.మాయతొలగిన మనసు విషయమును గ్రహించినది.వినయముతో తలవంచినది.జాలిగుండె శివుడు వాని తలను తన తనయునకు ధరింపచేసి,తాను వాని చర్మమును ధరించి లోకపూజ్యతను అందించినాడు.
" కరి చర్మాంబర-చంద్రకళాధర
సాంబ దిగంబర నమోనమో.
భక్తుని అహంకారమును వలిచివేసి అంబరముగా (వస్త్రాము) చేసికొన్నాడు ఆ భక్తవత్సలుడు.అంతే కాదు వ్యాఘ్రజినాంబరుడైనాడు.అది మాయామోహమును వొలిచివేయుట.
" మంగళాయతనం దేవం యువానాం అతి సుందరం
ధ్యాఎర్ వనచరాకారం అగచ్చంతం పినాకినం."
సుందేశ్వరుడు నిత్యయవ్వనుడు.పినాకినిని ధరించి వనములందు సంచరించుచుండెడివాడట.అర్త్రత్రాణపరాయణునిగ.వనముననున్న మునిపత్నులు శివసౌందర్యమును చూసి,మోహ పరవశులై,తమ విధులను నిర్వర్తించలేకపోతున్నారట.ఇది గమనించిన మునులు తమ దివ్యదృష్టితో విషయమును తెలిసికొని,శివుని మట్టుపెట్టుటకై,తమ యోగ శక్తితో ఒక పులిని సృష్టించి,హరుని హరింపమని ఆనపెట్టిరట.
" నమో బభ్లుశాయ నివ్యాధినేన్నాం పతయే నమః."
ఎద్దుపై కూర్చుండువాడు శత్రువులను బాగుగా కొట్టు వీరునకు నమస్కారము.ఎద్దు ధర్మము.అది అధర్మమును సహిస్తుండా? యోగుల శక్తి ఆదియోగిని ఏమిచేయగలదు అంతమగుట తప్ప.మునులు పంపిన పులిని చీలి,చెండాడి,దాని చర్మమును ధరించి,శివతత్త్వమును మునులకు-వారి పత్నులకు తెలియచేసినాడు మహాదేవుడు.
సుందరాననా సుందరాననా-శివశివ హరహర సుందరాననా.
నమస్తారయచ. మాయామోహములనుండి తరింపచేయు రుద్రా! నమస్కారములు.
భక్తుని విషయానికొస్తే,
"శ్రీ పార్వతీ రమణ-శ్రీ శంభు గురుమూర్తి
నా పాలి పరమేశ లింగా" అంటూ పదములను పాడుకుంటే చెప్పులు కుట్టుకునేవాడు.
హరలయ్య-కళ్యాణమ్మ పరమశివుని భక్తులు.పవిత్రహృదయుడు.శరణుఘోషలతో వారి నివాసము కళ్యాణమయముగ నుండెడిది.ధర్మనిష్ఠాపరాయణులను దారిద్రము ప్రభావితము చేయగలదా.ఎందుకంటే వారు సేవిస్తున్న స్వామి కూడా " దరిద్రన్ నీలలోహితా" అని కీర్తింపబడేవాడేగా.సాక్షాత్తు శివునిగా భావించే బసవడు ఒకరోజు వీరిగృహమునకు వచ్చి దేవతార్చన చేసుకొని,సంతుష్ఠుడై శరణు గోషలు పలికి వెడలెను.అతిథికి గృహస్థు-గృహస్థుకు అతిథి పరస్పరము శరణు పలుకుట వారి సాంప్రదాయము.అది చూచిన ఛాందసులు తప్పుపట్టిరి.స్వామికి తమవల్ల అపచారము జరిగినదని,పశ్చాతప్తులై,తమ చర్మముతో కుట్టిన పాదుకలను స్వామికి సమర్పించుటకు తీసుకొని వెళ్ళుచుండిరి.వీరి భక్తిని లోకవిదితము చేయకుంద వీక్షిస్తూ ఉంటాడా విశ్వేశ్వరుడు.రాజు మంత్రి భటుడు సర్వము తానైన పరమాత్మ మంత్రిలో ఆ పాదరక్షలపై వ్యామోహమును కలిగించెను.మంత్రి ఆ దంపతుల దగ్గరనుండి స్వామికి సమర్పించనీయకుండ,బలవంతముగ తీసుకొని,తాను ధరించెను.సమర్పించలేని తమ అశక్తతకు చింతించి ఆ దంపతులు తెలివితప్పి పడిపోయిరి.మంత్రి చేసిన అపరాధమునకు ఫలితముగా వ్యాధిగ్రస్తుదయ్యెను.
" నమో భవస్య హేత్యై జగతాం పతయే నమః."
పాపరాశులను ఖండించే కత్తియైన స్వామి కరుణ మంత్రిని రోగవిముక్తుని చేసినది.దంపతులకు జన్మరాహిత్యమును ప్రసాదించినది.
స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.
( ఏక బిల్వం శివార్పణం)
శరణు శరణు సదాశివా.
( ఏక బిల్వం శివార్పణం.)

+++
No comments:
Post a Comment