ఆవిర్భావము
****************
అమ్మ ఆవిర్భావమును సూర్యుని తాపము సూర్యుని యందే ఉండుట వలన పదార్థములనును త స్థూలముగా వనస్పతులయారుచేయును.కాని అవి నేరుగా జీవులను చేరలేవు.తల్లి తనశక్తితో అవి జగములకు చేరుటకు మార్గమును తయారుచేసి స్థితికార్యమును నిర్హించును.దేవి తిరిగి జనులందించిన యజ్ఞఫలములను సూర్యునకు చేర్చును.
సూక్ష్మముగా అమ్మ ఆవిర్భావమును మన నాడీవ్యవస్థలోని సుషుమ్న నాడిగా భావించవచ్చును.స్వయంపోషకత్వము గల ఛిన్నమస్త తన రక్తమును త్రాగుతు తాను జీవించి యుండుతయే కాక పక్క నున్న ఇడ-పింగళ నాడులను కూడ తన రక్తముతో శక్తివంతము చేయును.
రూపము
********
"" ఛిన్నమస్తాం కరేవామే ధారయంతీం స్వమస్తకం
ప్రసారిత ముఖీం భీమాం లేలిహానాగ్రజిహ్వికాం
పిబంతీం రౌధిరీం ధారాం నిజకంఠ వినిర్గితాం
వికీర్ణ కేశపాశాంచ నానా పుష్ప సమన్వితాం
దక్ష్ణేచ కరే కర్త్రీం ముండమాలా విభూషితాం
దిగంబరీం మహాఘోరాం ప్రత్యాలీఢ పదేస్థితాం
అస్థిమాలాం ధరాం దేవీం నాగ యగ్నోపవీతినీం
డాకినీ వర్ణినీ యుక్తాం వామదక్షిణ యోగతః."
కుడిచేతిలో ఖడ్గమును ధరించి,ఛిన్నమస్తాదేవి తన ఎడమచేసిలో ఖండించిన తన శిరమును ధరించియుంటుంది.బయటకు వచ్చిన ఎర్రని నాలుకతో ఆ శిరము ,కంఠము నుండి జాలువారుచున్న తన రక్తమును తానే సేవిస్తుంటుంది.విరబోసుకొనిన సుగంధపుష్ప భరిత కేశపాశముతో భీకరముగా ఉంటుంది.కపాలమాలలను కంఠాభరణముగా అలంకరించుకుంటుంది.పాములను జందెముగా వేసుకుంటుంది.కుడి-ఎడమల డాకిని-వర్ణిని రజోగుణ-తమోగుణ సంకేతములై సేవిస్తుండగా,తల్లి స్వయంపోషక సత్వప్రకాశినియై,మైథునవిలసిత,వికసిత కమలము నందు,ఎడమకాలిని ముందుకు,కుడి కాలిని వెనుకకు సాచి నిలబడి యుంటుంది.
స్వభావము
*************
మూలబిందువు నుండి తూర్పు దిక్కునకు విస్తరించి యుంటుంది.వీరరాత్రి యైన చ్ఛిన్నమస్త సూర్యమండలములో కబంధుడు అను పేరుతో నున్న శివశక్తిని కూడి పరిపూర్ణమౌతుంది.వైశాఖ శుక్ల చతుర్దశి ప్రీతిపాత్రమైనది.పరశురామావతారముగా కీర్తిస్తారు.చిన్నచిన్న రేనువులను సమీకరించి మార్గమును సూర్యుని నుండి భూమికి ఏర్పరచిన తల్లిని రేణుక అని కూడా పూజిస్తారు.
నివాసస్థానము
**************
ఛిన్న మస్త శక్తి సూక్ష్మముగా కేవలము వెన్నుపామును,కుండలినిని,సుషుమ్నను అంటిపెత్తుకొని ఉంటుంది.స్ష్మ్న లోని కుండలినీశక్తిని ఛిన్నమస్త అంటారు.సుష్మ్న తన స్వాధీనములో ఉండుటవలన సమస్తము హస్తగతమవుతుంది.
స్థూలముగా కుండలినీశక్తి శీర్ష-కపాలాన్ని ఛేదించుకొని బ్రహ్మాండమంతయు వ్యాపించి యున్న మహాశక్తితో ఏకమవుతుంది.ఆదిత్య మండలములో ఆవిర్భవించి, అవరోధాలను తొలగిస్తు మనలోనున్న సుషుమ్న దాక ప్రచండ చండిక నామిగా ఒక ఒక దేవయాన మార్గమును ఏర్పరుస్తుది.ఈ మార్గము ద్వారా సూర్యుని వనస్పతులను మానవులకు,మానవుల అన్నసారాన్ని సూర్యునకు అందించటానికి సహాయపడుతుంది.
అంతరార్థము
*************
ఛిన్నమస్త తత్త్వమును స్వానుభవముతో తెలిసికొన్నవారు గణపతి ముని.బృహదారాణ్య ప్రకారము ఛిన్నమస్త జ్యోతిర్విద్య.స్వయంపోషక సంకేతము.రూపము కొంత భయంకరమైన ఘోరమైనప్పటికిని,తత్త్వము అఘోరమే.మిథునముపై తల్లి నిలబడి యుండుట ఇంద్రియ నిగ్రహమునకు గుర్తు.ఇంద్రియనిగ్రహమైతే కాని తల్లి అనుగ్రహమును సాధించలేమను సత్యమును తెలియచేస్తుంది.మైధున ఆసనము తల్లి ఐంద్రీశక్తికి సంకేతము.సాధన ద్వారా ఛిచ్చక్తిని జాగృత పరచుకోగలవాని వెన్నెముకయే వజ్రము.దాని యందలి శక్తియే వజ్రవైరోచని.మానవుల ఉఛ్చావస-నిశ్వాసలను ఇడ-పింగళ నియంత్రిస్తాయి.కుండలినీ శక్తి బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంధులను ఛేదించి,సహస్రారము చేరి సుధాస్వాదము చేస్తుంది.సుధావర్షమును కురిపిస్తుంది.జీవుడు తన బంధనములను తెంపుకొని,విశ్వవ్యాపక ఛిచ్చక్తితో బంధమును కలుపుకుంటాడు.అదియే అతి మనోహరమైన,ఆనందదాయకమైన ఛిన్నమస్తా తత్త్వము.
ఇంద్రియశక్తులను నిగ్రహించగల ఐంద్రీశక్తి.సాధనద్వారా చిఛక్తిని జాగృతపరచుకొనిన వాని సుషుమ్నలో నున్న శక్తి వజ్రవైరోచనిగా బ్రహ్మ-విష్ణు-రుద్ర గ్రంధులను ఛేదించి,సహస్రారమును చేరిన తరువాత అమృతవర్షిణిగామారుతుంది.ఇక్కడ మొ0డెము ప్రాపంచిక తత్త్వము.శిరము ఆధ్యాత్మికత.జీవి అమ్మఒడిని చేరాలంటే ప్రాపంచికముమీద భ్రాంతిని వీడి సాధనశక్తి అనే అమృత ధారలతో అమ్మతత్త్వమును అర్థము చేసుకొనగలగాలి.
ఈ విద్య తన శక్తిని వజ్రాయుధము వలె ఉపయోగిస్తుంది .మృత్యుభయమును దూరము చేసే యోగవిద్యా సాధనగా వైదిక విద్యలలో ప్రసిధ్ధికెక్కినది.గాలి వలె గతి శక్తితో వ్యాపించగలిగిన.తల్లి తన రక్తముతో తనను తాను పోషించుకొనుటయే కాక,మరొక రెండు ధారలతో ఇడ-పింగళ నాడులను కూడ శక్తివంతము చేయుచున్నది.శీర్ష-కపాలములు విడిపోయినప్పటికిని జీవించి యుండగలిగే విద్యను మధువిద్య అంటారు.తన రక్తములో మరణమును కలిపేసుకొని మృత్యుంజయత్వాన్ని నిరూపించిన తల్లి పాదపద్మములకు సభక్తి సమర్పణము చేస్తూ,
"పిబంతీం రౌధిరీం ధారాం నిజకంఠ వినిర్గితాం
వికీర్ణకేశపాశాంచ నానా పుష్ప సమన్వితాం."
ఛిన్నమస్త తత్త్వమును స్వానుభవముతో తెలిసికొన్నవారు గణపతి ముని.బృహదారాణ్య ప్రకారము ఛిన్నమస్త జ్యోతిర్విద్య.స్వయంపోషక సంకేతము.రూపము కొంత భయంకరమైన ఘోరమైనప్పటికిని,తత్త్వము అఘోరమే.మిథునముపై తల్లి నిలబడి యుండుట ఇంద్రియ నిగ్రహమునకు గుర్తు.ఇంద్రియనిగ్రహమైతే కాని తల్లి అనుగ్రహమును సాధించలేమను సత్యమును తెలియచేస్తుంది.మైధున ఆసనము తల్లి ఐంద్రీశక్తికి సంకేతము.సాధన ద్వారా ఛిచ్చక్తిని జాగృత పరచుకోగలవాని వెన్నెముకయే వజ్రము.దాని యందలి శక్తియే వజ్రవైరోచని.మానవుల ఉఛ్చావస-నిశ్వాసలను ఇడ-పింగళ నియంత్రిస్తాయి.కుండలినీ శక్తి బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంధులను ఛేదించి,సహస్రారము చేరి సుధాస్వాదము చేస్తుంది.సుధావర్షమును కురిపిస్తుంది.జీవుడు తన బంధనములను తెంపుకొని,విశ్వవ్యాపక ఛిచ్చక్తితో బంధమును కలుపుకుంటాడు.అదియే అతి మనోహరమైన,ఆనందదాయకమైన ఛిన్నమస్తా తత్త్వము.
ఫలసిధ్ధి
*******
" యదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవి శ్రీమాతానమో స్తుతే.
అపరాధసహస్రాణి క్రియంతే అహర్నిశం మమ
దాసో యమితి మాతా క్షమస్వ పరమేశ్వరి.
ఛిన్నమస్తాదేవి ఉపాసకునకు రాజ్యప్రాప్తిని,శత్రుక్షయమును,సరస్వతీ కటాల్షమును అనుగ్రహిస్తుంది.
https://www.youtube.com/watch?v=tYuMXdJEPI4&feature=youtu.be
యాదేవీ సర్వభూతానాం ఛిన్నమస్తారూపేణ సంస్థితాం,
నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమో నమః.
No comments:
Post a Comment