శ్రీమాత్రే నమః
**************
" కాళీ తారా మహావిద్యా షోడశీ భువనేశ్వరీ
భైరవీ ఛిన్నమస్తా చ విద్యా ధూమవతీ తథా
బగళా సిధ్ధవిద్యా చ మాతంగీ,కమలాత్మికా
ఏతా ఏవ మహావిద్యాః సిధ్ధవిద్యా ప్రకీర్తితాః."
శార్దూలము
శ్రీరాముండట మూర్ఛ బోయె; రణమున్ సీతా మహాసాధ్వియే
శ్రీరాముండట మూర్ఛ బోయె; రణమున్ సీతా మహాసాధ్వియే
స్వారీజేసెను కాళి రావణునికన్ సాహస్ర ఖండంబులున్
వీరావేశము శాంతినొందె విధిగా విశ్వాత్మ ధ్యానింపగన్
తారారూపము తానె దాల్చె సకలాధారాత్మికా తత్వమై
తారారూపము తానె దాల్చె సకలాధారాత్మికా తత్వమై
***********
" ముక్తాహార సుబధ్ధ రత్న రసనాం కర్పూర కుందోజ్వలాం
వందే విష్ణు సురేంద్ర రుద్ర నమితాం త్రైలోక్య రక్షాపరాం
నీలాం తాం మణిభూషణాధివలయా మత్యుగ్రతారాం భజే."
నమామి తారాదేవి మహాశక్తిం నిరంతరం.
ఆవిర్భావ కారణము
*******************
పురాణకథనము ప్రకారము పూర్వము హయగ్రీవుడను దానవుడు వేదములను అపహరించి,సముద్రములో దాగిన సమయమున,మత్స్యమూర్తియైన హరి,వానిని సంహరించి వేదోద్ధరణమును గావించినాడు.బృహన్నీలతంత్ర ప్రకారము తారాదేవి హయగ్రీవుని అంతమొందించి,వేదోద్ధరణను గావించెను.
ఆవిర్భావ విధానము
****************
సూర్యోదయ సమయమున సుమేరు పశ్చిమభాగము నుండి తారాదేవి ఆవిర్భవించెను.విషకుండము వంటి కొండను చిత్ప్రకాశవంతమైనది.అందులో నుండి {అగ్నిగా} వాగ్రూపముగా వ్యక్తమయిన శక్తి తారాదేవి.తారాదేవి ఆవిర్భావమును వైదికముగనే పరిగణింతురు.
రూపము
******
" నవయవ్వన సంపన్నాం పంచముండ విభూషితాం
చతుర్భుజాం లలజ్జిహ్వాం మహాభీమాం వరప్రదాం."
నీలనాగ జటాజూటాం శ్వేతాహికృత కుండలాం
శ్వేతనాగ లసత్కాంచీం పటలాహి పదద్వయాం
ప్రజ్వలత్ ప్రేత భూమధ్యస్థితాం దంష్ట్రా కరాళినీం
శవకంఠ పదద్వంద్వ వామ దక్ష పదద్వయాం."
తారాదేవి నవయవ్వనముతో ప్రకాశిస్తుంటుంది.ఈ శక్తి ఘోర-అఘోర రూపములలో దర్శనమిస్తుంటుంది.నీలినాగమును జటలకు అలంకరించుకుంటుంది.ముండమాలను ఒడ్డాణముగా ధరిస్తుంది. శ్వేతనాగులను పోలిన కుండలములను ధరిస్తుంది.శక్తిని కోల్పోయి భూమధ్యమున అచేతనముగ నున్న ప్రేతముపై నిలబడి ఉంటుంది.అహోరియైనపుడు తలుకుల తారా ప్రకాశముతో శరణుకోరిన వారిని తరింపచేస్తుంటుంది.సన్స్కృత ధాతువౌనుండి జనించిన తార శబ్దము భవసాగరమును దాటించునది అని అమ్మ కారుణ్యమును తెలియచేస్తుంది.
ఆయుధములు.
************
కమలము-ఖడ్గము-కత్తెర-గద వంటి ఆయుధములను ధరించి యుంటుంది.నీలిరంగులో ఉంటుంది.కమలము సృష్టికి గుర్తు.కత్తెర అవిద్యకు ప్రతీక.ఖడ్గము పశుభావమును సూచిస్తుంది.దిక్కులకు ప్రతీకగా తల్లి పులిచర్మమును ధరించి యుంటుంది.నాదసృష్టి యైన ముండమాలను ధరించియుంటుంది.పాత్రలోని రక్తము రజోగుణమునకు,కామక్రోధాదులకు సంకేతం.నిష్క్రియత్వమును సూచిస్తున్న అచేతన శివశరీరము మీద నిలబడిఉంటుంది..
స్వభావము
************
"తపస్వి సిధ్ధివిద్యాచ తపస్వి మంత్ర సిధ్ధికృత్
తపస్వి మంత్ర తంతేశీ తపస్వి మంత్రరూపిణీ
తపస్వి మంత్ర నిపుణా తపస్వి కర్మకారిణె
తపస్వీ కర్మ సంభూతా తపస్వి కర్మ సాక్షిణీ."
సీతారామ శబ్దములోని స్త్రీపురుషశక్తులే తారా అని,శ్రీరామనవమి నాడు తారా పూజ అత్యంతఫలవంతమని తంత్రశాస్త్రము భావిస్తుంది.అవలోకేశుని భార్యగా తారాదేవిని బౌధ్ధమతము విశ్వసిస్తుంది.
అద్భుత రామాయణ కథనము ప్రకారము దేవతల ప్రార్థనలనలకు ప్రసన్నయై,కాళిశక్తి తన మహోగ్ర రూపమును కొంతవరకు ఉపశమింపచేసుకొని,తారాశక్తి రూపముగా ప్రకటితమైనదని నమ్ముతారు.ఆ సమయమున రుద్రుడు తారాశక్తిని తన గురువుగా గుర్తించి,పాదాక్రాంతుడై,తనకు బ్రహ్మవిద్యను భోదించమనినాడను కథనము కూడ ప్రచారములో కలదు.
లోకాద్భుతమైనపున అవ్యయకాంతితో తల్లి గౌరిగాను,లోకసృష్టి రచనను చేయుచున్నప్పుడు నీలిరంగుగాను,లోకమాత యైడు చిత్ర వర్ణముగాను దర్శనమిస్తుందట.ధన్యోస్మి మాత.మునిగియున్న పనుల వైఖరిని బట్టి తెలుపు,నీలము,పసుపుఎరుపు ఆకుపచ్చ రంగులు సంకేతాలవుతాయి.సర్వ వర్ణోప శోభితకు సాష్టాంగ దండ ప్రణామములు.
చైత్ర శుక్ల నవమి ఇష్టమైన తిథి.శ్రీరామావతారముగా ప్రసిధ్ధికెక్కినది.తృ అను ధాతువు నుండి పుట్టినది తార.తార అంటే నక్షత్రం అనే అర్థం కూడా ఉంది.తారా మహావిద్య శబ్దశక్తియే అయినప్పటికిని శబ్దగుణమైన ఆకాశ సంబంధము లేకుండుట ప్రత్యేకత.తారాదేవి వేదత్రయి గా మారినప్పుడు "శుక్ల" అను నామముతోను,సత్యసత్య మిశ్రమమైనపుడు " చిత్ర" అను నామముతోను,రాక్ష సంహారము చేసినపుడు నీల గాను కీర్తింపబడుతోంది.శబ్దార్థములలోని లోతులలో దాగిన నిక్షేపములను ప్రచోదనము చేయు శక్తి తార.
నివాసస్థానములు
**************
" త్రికోణస్థా త్రికోణేశీ త్రికోణ చక్రవాసినీ
త్రికోణ చక్ర మధ్యస్థా త్రికోణ బిందురూపిణీ
త్రికోణ యంత్ర సంస్థాన త్రికోణ యంత్ర రూపిణీ
త్రికోణ యంత్ర సంపూజ్యా త్రికోణ యంత్ర సిధ్ధిదా."
తారా శక్తి
మహావిద్యగా,అంతరాత్మగా,అతీత సౌందర్యవతిగా అనుభవానికి వస్తుంది.మధ్యమా-వైఖరీ వాగ్దశలుగా తారాశక్తి పరిణమిస్తుంది.నాభీచక్రము నివాసస్థానమైనప్పటికిని,ధ్వనులు పైకిపైకి సాగి మెదడు లోని భావములను తాకు సమయమున ఆజ్ఞా చక్రములోను తల్లి విహరిస్తుంటుంది.వ్యక్తావ్యక్త వాక్స్వరూపమైన తల్లి సమయానుసారముగా సంచరిస్తుంటుంది.గణపతి ముని అమ్మను విశుద్ధచక్ర నివాసినిగా గుర్తించి,కీర్తించారు.వశిష్ఠముని అమ్మ సాక్షాత్కారమును పొంది ధన్యుడైనాడు.గురుగ్రహాధిదేవత తారాదేవి.కావ్యకంథ గణపతి ముని ఉమాసహస్ర రచనమును గగనవీధి మెరుపుగా ఆశీర్వదించిన తల్లి.
అంతరార్థము
************
తారాశక్తిని గురువుగా భావిస్తాడట.గురుగ్రహాధిదేవత తారాదేవి. గణపతి ముని ఉమాసహస్ర రచనమును గగనవీధి మెరుపుగా ఆశీర్వదించిన తల్లి. ,క్షీరసాగరమథనములో ప్రభవించిన హాలాహలమును . త్రాగిన శివుడు అచేతనత్వమును పొందగా మాతృస్వరూపిణి యైన తారాదేవి శివుని తన శిశువుగా మలచుకొని,స్తన్యమిచ్చి విషదోష రహితుని
గావించినది
.దేవాలయములు
***************
బెంగాలులో,సింలాలో ఇంకా మరెన్నో పవిత్ర ప్రదేశములలో తారాశక్తి మందిరములు కలవు.
ఫలసిధ్ధి.
***********
"అష్టమ్యాంచ చతుర్దశ్యాం సంక్రాంతౌ రవి వాసరే
శని భౌమ దినే రాత్రౌ గ్రహణే చంద్ర సూర్యయోః
తారా రాత్రౌ కాలరాత్రౌ మోహరాత్రౌ విశేషతః
పఠనాన్మంత్ర సిధ్ధిస్యాత్ సర్వజ్ఞత్వం ప్రజాయతే
సంగ్రామ సమయే వీరస్తారా సామ్రాజ్య కీర్తనాత్
చతురంగచయంజిత్వా సర్వసామ్రాజ్య భాగ్యవేత్."
శ్రీతారా
"ప్రజ్వల్ప్రేత భూమధ్యస్థితాం దమ్ష్ట్రాకరాళినీం
శవకంఠ పదద్వంద్వ వామదక్ష పదద్వయాం"
" యదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతుదేవి సాధన వలన స్తు. యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవి శ్రీశత్రునాశనము,దివ్యజ్ఞానము,వాక్సిధ్ధి,కష్టనివారణ తప్పక లభిస్తుంది.
సకలజీవుల సంసారగరల భక్షణదోషములనుండి తనచల్లని చూపుతో దోషరహితులనుచేయు తల్లి పాదారవిందార్పణమమాతానమో స్తుతే.
అపరాధసహస్రాణి క్రియంతే అహర్నిశం మయ
దాసో యమితి మాతా క్షమస్వ పరమేశ్వరి.
https://www.youtube.com/watch?v=qVryfP9EN0g
యాదేవీ సర్వభూతానాం తారారూపేణ సంస్థితాం,
నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమో నమః.
No comments:
Post a Comment