పదిశక్తుల పరమార్థము-తారాదేవి-ద్వితీయ శక్తి.
**************************************
**************************************
ఏకాత్మిక-నిర్మాణాత్మక చేతన శక్తియైన కాళి, తన రూప స్వభావములను కొంత మార్చుకొని,మరి కొంత చేర్చుకొని," నాలెడ్జ్ ఈజ్ ట్రాన్సిడెంటల్" అను సిధ్ధాంతమును మనకు ప్రసాదిస్తున్నది.మార్పులను పరిశీలిస్తే,
1.విస్తరణ-సహకారము మొదటిది.
పరమేశ్వరి కాళి-తారా రెండు రూపములు,నలుపు-నీలపు రంగులు మొదలగునవి విస్తరణకు సూచన.శక్తి రెండు రూపాలుగా మారువిధానము మూలము నుండి వేరొక రూప కల్పనకు సహాయపడు బొడ్డుతాడును సృష్టించగల నాభీస్థానము తారాదేవి నివాసమనుట నిర్వివాదము.తాడు తల్లికి -శిశువుకు ఆధారమై రెండింటిని చూపించి వివరిస్తుందో అదే తారా తత్త్వము.కాళితత్త్వము నుండి తనకు కావలిసినది స్వీకరించు విధానము.అదియే కాళిరూపము తారాశక్తిగా విభజింపబడుట.
2.విరుధ్ధము-వివేకము రెండవ మార్పు.
విస్తరణలో మనము కాళి తత్త్వములో చర్చించుకొనిన చీకటి-కాంతి,క్షణికము-శాశ్వతత్త్వము,స్థిరము-చలనము,వ్యక్తము-అవ్యక్తముల మేళవింపే కాళి-తారా శక్తులు.విరుధ్ధ భావములు,వస్తువులు రెండింటిని వంతెనయై తారాదేవి రెండింటిని చూపుతుంది.మన వివేకము మేల్కొలిపి క్షణిక తత్త్వము నుండి తాను మధ్యనుండి శాశ్వతత్త్వమునకు మనలను చేరుస్తుంది.
3.ప్రయత్నము-ఫలితము మూడవది.
సహకార వివేకములను ఉపయోగించి చేయవలసిన ప్రయత్నమును దాని ఫలితమును బోధపరుస్తుంది.తాను చీకటిని చీల్చుకోగలిగితే గాని కాంతిరేఖగా కనిపించలేదు.మౌనమును ఛేదించగలిగే ప్రయత్నమును మూలాధారము నుండి ఆజ్ఞాచక్రము వద్దకు,దాని నుండి నాలుక చివరకు వచ్చి వాక్కుగా ప్రకటింపబడలేదు.
కాళి శక్తి నుండి ప్రకటింపబడి పనిచేయుట ప్రారంభించిన తారా శక్తి తన తరువాతి శక్తిని ఏ విధముగా తనతో కలుపుకొని సాగనున్నదో.అమ్మ దయతో తెలిసికొనుటకు ప్రయత్నిద్దాము.
తారాశక్తి పాదారవిందములకు భక్తి నమస్కారములతో,
No comments:
Post a Comment