Friday, October 4, 2019

CHINNAMASTA

  శార్దూలము... ఛిన్నమస్త వర్ణన

యోగశ్రేష్టి శిరో స్వఖండనము సంయోగద్వయంబాసనమ్
రాగద్వేష సమాన దృక్పథమె ఘోరాఘోర సామ్యంబునున్
త్యాగంబా రుధిరత్రిధార సరళీ త్రాగేటి  శీర్షంబులున్
భోగాపేక్ష నియంత్ర సంస్కరణమే పూర్ణత్వమై శోభిలన్

భావము: ఖండ యోగాసన శ్రేష్టి ఛిన్నమస్త స్వయం శిరో ఖండనము చేసుకొన్నది. దైవీసంయోగము చేయువారు ఆమె ఆసనము. రాగ ద్వేషాలను, ఘోర అఘోరాలను సమానముగా చూస్తుంది. ఆమె త్యాగమే మూడు రక్త ధారలుగా తన మొండెము నుంచి ఎల్లప్పుడూ ప్రవహించి క్రమ పద్ధతిలో మూడు శీర్షాలలోకి ప్రసారమవుతుంది. కామ ఆపేక్ష నియంత్రించి సంస్కరించటమే ఆ అవతార పూర్ణత్వము.

 " నాభౌ శుభ్రారవిందం తదుపరి విమలం మండలంచండరశ్మే
  సంశారస్యైక రూపాం త్రిభువన జననీం ధర్మకామార్థధాత్రీం
  తస్మిన్ మధ్యే త్రిమార్గే త్రితయ తనుధరాం ఛిన్నమస్తాం ప్రశాంతాం
  తాం వందే జ్ఞానరూపాం మరణభయహరాం యోగినీం యోగముద్రాం.

https://www.youtube.com/watch?v=Jr-ofIKMr-Q&feature=youtu.be

 ఆవిర్భావకారణము-విధానము
 *****************************
 రజరప్ప అను రాజ దంపతులు ఛిన్నమస్తకను పరమభక్తితో ఆరాధించిరి.వారిని కుమార్తెగా అనుగ్రహించదలచిన తల్లి జలమునుండి ఉద్భవించెను.నేటికిని జార్ఖండ్ లోని రజరప్ప దేవాలయము నిత్య పూజలనందుకొనుచున్నది.

రూపము
******

  కుడిచేతిలోని ఖడ్గముతో తనే నరుక్కున తన తలను ఎడమచేతితో ఎత్తి పట్టుకొనిఉంటుంది.కుడిచేతిని కొంచము దించి ఉంచుతుంది.కుడికాలిని కొంచము ముందుక చాచిఎడమకాలిని క్రిందికి వంచి ఉంచుతుంది.మూడు రక్తధారలు రజోగుణ సంకేతములై ఆహారసిధ్ధిని అందిస్తుంటాయి.ఢాకిని-శాకిని యోగినులు రజో-తమోగుణ సంకేతములు.మధ్యనున సుషుమ్న నడి శుధ్ధసత్వగుణ ఛిన్నమస్త.

 స్వభావము
 **********
 మధువిద్యా స్వరూపిణి యైన ఛిన్నమస్త తల్లి అమృతవర్షిణి అనుటకు మనకొక కథ ప్రచారములో కలదు.దధీచి మహామునిని ఆజ్ఞాపించి,అతని నుండి మధువిద్యను నేర్చుకొనిన దేవేంద్రుడు ఆ విద్య తనకొక్కనికే సొంతము కావాలని ధర్మమునకు విరుధ్ధముగా దధీచి వేరెవరికైన ఈ విద్యను ఉపదేశించినచో శిరఛ్చేదము జరుగునని శాపమిడెను.లోక రక్షణార్థము ఆశ్వినీదేవతలు తమకు మధువిద్యను నేర్పించమని దధీచిని ప్రార్థించి,ఉప్దేశ సమయమున గుర్రపు తలను అతికించి,ఉపదేశానంతరము మహర్షి తలని అతికించి పునర్జీవితుని చేసిరట.అద్భుతము కద.

  మూలబిందువు నుండి తూర్పు దిక్కునకు విస్తరించి యుంటుంది.వీరరాత్రి యైనఛిన్నమస్త సూర్యమండలములో కబంధుడు అను పేరుతో నున్న శివశక్తిని కూడి పరిపూర్ణమౌతుంది.వైశాఖ శుక్ల చతుర్దశి ప్రీతిపాత్రమైనది.పరశురామావతారముగా కీర్తిస్తారు.చిన్నచిన్న రేనువులను సమీకరించి మార్గమును సూర్యుని నుండి భూమికి ఏర్పరచిన తల్లిని రేణుక అని కూడా పూజిస్తారు.

 నివాసస్థానము

 **************

 ఛిన్న మస్త శక్తి సూక్ష్మముగా కేవలము వెన్నుపామును,కుండలినిని,సుషుమ్నను అంటిపెత్తుకొని ఉంటుంది.స్ష్మ్న లోని కుండలినీశక్తిని ఛిన్నమస్త అంటారు.సుష్మ్న తన స్వాధీనములో ఉండుటవలన సమస్తము హస్తగతమవుతుంది.



 స్థూలముగా కుండలినీశక్తి శీర్ష-కపాలాన్ని ఛేదించుకొని బ్రహ్మాండమంతయు వ్యాపించి యున్న మహాశక్తితో ఏకమవుతుంది.ఆదిత్య మండలములో ఆవిర్భవించి, అవరోధాలను తొలగిస్తు మనలోనున్న సుషుమ్న దాక ప్రచండ చండిక నామిగా ఒక ఒక దేవయాన మార్గమును ఏర్పరుస్తుది.ఈ మార్గము ద్వారా సూర్యుని వనస్పతులను మానవులకు,మానవుల అన్నసారాన్ని సూర్యునకు అందించటానికి సహాయపడుతుంది.

 అంతరార్థము

*************

 ఛిన్నమస్త తత్త్వమును స్వానుభవముతో తెలిసికొన్నవారు గణపతి ముని.బృహదారాణ్య ప్రకారము ఛిన్నమస్త జ్యోతిర్విద్య.స్వయంపోషక సంకేతము.రూపము కొంత భయంకరమైన ఘోరమైనప్పటికిని,తత్త్వము అఘోరమే.మిథునముపై తల్లి నిలబడి యుండుట ఇంద్రియ నిగ్రహమునకు గుర్తు.ఇంద్రియనిగ్రహమైతే కాని తల్లి అనుగ్రహమును సాధించలేమను సత్యమును తెలియచేస్తుంది.మైధున ఆసనము తల్లి ఐంద్రీశక్తికి సంకేతము.సాధన ద్వారా ఛిచ్చక్తిని జాగృత పరచుకోగలవాని వెన్నెముకయే వజ్రము.దాని యందలి శక్తియే వజ్రవైరోచని.మానవుల ఉఛ్చావస-నిశ్వాసలను ఇడ-పింగళ నియంత్రిస్తాయి.కుండలినీ శక్తి బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంధులను ఛేదించి,సహస్రారము చేరి సుధాస్వాదము చేస్తుంది.సుధావర్షమును కురిపిస్తుంది.జీవుడు తన బంధనములను తెంపుకొని,విశ్వవ్యాపక ఛిచ్చక్తితో బంధమును కలుపుకుంటాడు.అదియే అతి మనోహరమైన,ఆనందదాయకమైన ఛిన్నమస్తా తత్త్వము.





ఇంద్రియశక్తులను నిగ్రహించగల ఐంద్రీశక్తి.సాధనద్వారా చిఛక్తిని జాగృతపరచుకొనిన వాని సుషుమ్నలో నున్న శక్తి వజ్రవైరోచనిగా బ్రహ్మ-విష్ణు-రుద్ర గ్రంధులను ఛేదించి,సహస్రారమును చేరిన తరువాత అమృతవర్షిణిగామారుతుంది.ఇక్కడ మొ0డెము ప్రాపంచిక తత్త్వము.శిరము ఆధ్యాత్మికత.జీవి అమ్మఒడిని చేరాలంటే ప్రాపంచికముమీద భ్రాంతిని వీడి సాధనశక్తి అనే అమృత ధారలతో అమ్మతత్త్వమును అర్థము చేసుకొనగలగాలి.

  ఈ విద్య తన శక్తిని వజ్రాయుధము వలె ఉపయోగిస్తుంది .మృత్యుభయమును దూరము చేసే యోగవిద్యా సాధనగా వైదిక విద్యలలో ప్రసిధ్ధికెక్కినది.గాలి వలె గతి శక్తితో వ్యాపించగలిగిన.తల్లి తన రక్తముతో తనను తాను పోషించుకొనుటయే కాక,మరొక రెండు ధారలతో ఇడ-పింగళ నాడులను కూడ శక్తివంతము చేయుచున్నది.శీర్ష-కపాలములు విడిపోయినప్పటికిని జీవించి యుండగలిగే విద్యను మధువిద్య అంటారు.తన రక్తములో మరణమును కలిపేసుకొని మృత్యుంజయత్వాన్ని నిరూపించిన తల్లి పాదపద్మములకు సభక్తి సమర్పణము చేస్తూ,

"పిబంతీం రౌధిరీం ధారాం నిజకంఠ వినిర్గితాం

 వికీర్ణకేశపాశాంచ నానా పుష్ప సమన్వితాం."

 ఛిన్నమస్త తత్త్వమును స్వానుభవముతో తెలిసికొన్నవారు గణపతి ముని.బృహదారాణ్య ప్రకారము ఛిన్నమస్త జ్యోతిర్విద్య.స్వయంపోషక సంకేతము.రూపము కొంత భయంకరమైన ఘోరమైనప్పటికిని,తత్త్వము అఘోరమే.మిథునముపై తల్లి నిలబడి యుండుట ఇంద్రియ నిగ్రహమునకు గుర్తు.ఇంద్రియనిగ్రహమైతే కాని తల్లి అనుగ్రహమును సాధించలేమను సత్యమును తెలియచేస్తుంది.మైధున ఆసనము తల్లి ఐంద్రీశక్తికి సంకేతము.సాధన ద్వారా ఛిచ్చక్తిని జాగృత పరచుకోగలవాని వెన్నెముకయే వజ్రము.దాని యందలి శక్తియే వజ్రవైరోచని.మానవుల ఉఛ్చావస-నిశ్వాసలను ఇడ-పింగళ నియంత్రిస్తాయి.కుండలినీ శక్తి బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంధులను ఛేదించి,సహస్రారము చేరి సుధాస్వాదము చేస్తుంది.సుధావర్షమును కురిపిస్తుంది.జీవుడు తన బంధనములను తెంపుకొని,విశ్వవ్యాపక ఛిచ్చక్తితో బంధమును కలుపుకుంటాడు.అదియే అతి మనోహరమైన,ఆనందదాయకమైన ఛిన్నమస్తా తత్త్వము.



 ఫలసిధ్ధి

 *******



" యదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్

  తత్సర్వం క్షమ్యతాం దేవి శ్రీమాతానమో స్తుతే.



  అపరాధసహస్రాణి క్రియంతే అహర్నిశం మమ

  దాసో యమితి మాతా క్షమస్వ పరమేశ్వరి.







ఛిన్నమస్తాదేవి ఉపాసకునకు రాజ్యప్రాప్తిని,శత్రుక్షయమును,సరస్వతీ కటాల్షమును అనుగ్రహిస్తుంది.



https://www.youtube.com/watch?v=tYuMXdJEPI4&feature=youtu.be

యాదేవీ సర్వభూతానాం ఛిన్నమస్తారూపేణ  సంస్థితాం,

  నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమో నమః.












No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...