Sunday, October 6, 2019

PADISAKTULA PARAMAARTHAMU-KAMALAATMIKA

 పదిశక్తుల పరమార్థము-కమలాత్మిక
 ****************************

   తొమ్మిదిశక్తులు మనకు అందిస్తున్న అనుగ్రహముతో కమలాత్మిక తల్లిని తెలుసుకొనుటకు ప్రయత్నిద్దాము.తల్లి శుధ్ధసత్వ ప్రకాశము.నలుపు గా ప్రయాణమునుమొదలుపెట్టి తెలుపుగా ముగిసినది.చీకట్లను పూర్తిగా తొలగించివేసినది..త్రిగుణతత్త్వమును దాటించి మనలకు తురీయము ( శాశ్వతమును) చూపిస్తున్నది.తిరిగి తనమూలస్థితిని పొందినది.

పనిచేయుచున్నప్పుడు దారిచూపుతుంది.మిగిలిన తొమ్మిది తటస్థముగా ఉంటాయి.ఆ పని ఆ ఒక్క వేలు చేయగలదు.అదే మనము ఏదైన వస్తువును పట్టుకోవలసి వచ్చినపుడు ఇంకొక వేలు దానికి సహాయకారి అవుతుంది.మనము వ్రాయునపుడు మూడువేళ్ళు సహకరిస్తున్నాయి.పూలమాలలు అల్లునప్పుడు నాలుగువేళ్ళు కదులుతున్నాయి.ఇంక ఐదువేళ్ళు కలిస్తే అద్భుతాలేకదా.ఇదే విధముగా పదివేళ్ళు కలిసి ఒక రూపముగా మారిన అదే కద కైమోడ్పు.నమస్కారము.

 నమస్కార ముద్ర నుండి దారిచూపు ఒక్క వేలుగా మారుట-ఒక్క వేలు మిగతాతొమ్మిది వేళ్ళ సహాయముతో కైదండగా  దశమహాశక్తుల పరమార్థము.ఇది నిర్వివాదము.నిత్యసత్యము.

   నిర్మల మనసులో నీవు ఉన్నావన్న సత్యము తెలిసిన  వేళ శతకోటి నమస్కారములు తల్లి.నన్ను తరియించనీ.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...