మార్గళి మాలై-16
*****************
పదహారవ పాశురం
***************
నాయగనాయ్ నిన్ర నందగోపనుడైయ
కోయిల్ కొప్పానే! కొడితోన్రుం తోరణ వాశల్ కాప్పానే!
మణిక్కదనం తాళ్తిరవాయ్
ఆయర్ శిరుమియరో ముక్కు,అరైపరై
మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్ నేరందాన్
తూయోమాయ్ వందోం తుయిల్ ఎళప్పాడువాన్
వాయల్ మున్నమున్నం మాత్తాదే అమ్మా! నీ
నేశ నిలైక్కదవం నీక్కు ఏలోరెంబావాయ్.
తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.
**************************
శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
శ్రీ గోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము
పతాక రెపరెపలతో -పచ్చని తోరణములతో
మణిమాణిక్యములతో మంగళప్రదమైనట్టి, మా
నందగోపాలుని భవనపు ద్వారపాలకులార
కణ్ణని తక్క అన్యచింతనలేని చిన్నివారలము
నీలవర్ణుని నిదురలేప శుచులమై వచ్చినాము
"పర" ను మాకిస్తానని స్వామి నిన్ననే పలికినాడు
పరమపూజ్యులార! మమ్ములను ప్రవేశించ నీయండి
పరంధాముని దర్శించి ప్రణమిల్లి పోతాము
పాశురములు పాడుకొనుచు పాశములన్నింటిని విడిచి
తెరువరాదో తలుపుగడియ శ్రీమాన్ ఆచార్యులార.
ఆండాళ్ తల్లి అనుగ్రహముతో 'తిరుప్పావై" పూర్వభాగ దశను పరిపూర్ణముచేసుకొని,ఉత్తమగుణ సంపన్నులైన గోపికలతో బాటుగా,మనమోహన నాయకుదైన మాధవుని మణిసదనమునకు పయనమగుచున్నాము.స్వామి అనుగ్రహమును యోగ్యతను పొందినవారమైనాము.అదేమిటో ఎప్పుడు " పర-పర" అను గోపికలు విచిత్రముగా "పరాత్పర" అంటున్నారు.జయజయ నికేతనములో జాజ్వల్య మానముగా ప్రకాశించుచున్న మా "ధవుని" మణిసదనమునకు వచ్చినారు.అక్కద ప్రాకార పాలకులను అదేనండి క్షేత్ర పాలకులను స్తుతించి,వారిని ప్రసన్నులను చేసుకొని ప్రాకార పాలకులను సమీపించారు.
ఈ పాశురములో వీరి మానసికస్థితి స్వామినుండి వరములను పొందాలన్న భావనను అధిగమించి,స్వామికి సుప్రభాత సేవచేయాలన్న స్థితికి వారిని వారి యోగము మార్చినది.పరమాద్భుతము.
స్వామి శ్రీమద్రామానుజుల వారికి కాంచీపురములోని "వరదరాజ మూర్తి" గురువైనాడు.అదే స్వామి తిరుపతిలో శిష్యుడుగా మారి రామానుజల వారిని గురుస్థానమును అలంకరింపచేసాడు.
దీనికి కారణము పరమాత్మ ఉన్న్మీషతి."నిమీషతి" అంటే తన దాసులను భక్తులను నడిపించవలెనను భగవత్సంకల్పము.ఇది వారివారి పూర్వకృత సంస్కారములను బట్టి సన్మారగమున నడిపించగలదు లేదా దుర్మార్గములను చేయించ కలదు.అదే ఉన్నిమీషతి-అధోనిమీషతి.
కాని భగవంతుడు భాగవతునిగా బాధ్యతను తీసుకున్నప్పుదు తనను నమ్మిన వారిని నడిపించుటలో అధో నిమీషతకు తావు లేదు .అంతా "ఉన్నిమీషమే".ఈ పాశురములో ఏ విధముగా గోపికల మానసిక స్థితిలో మార్పును గమనిస్తామో అదేవిధముగా భగవంతుడు భాగవతుని తనను తాను గోపిక కోసము మార్పుచెందుతాడు.దానికి ఉదాహరణమే చీకటిలౌఎ వారు తెల్లవారుజామున తన ఇంటికి వచ్చునప్పుడు,తమ సదనమును గుర్తించుట వారికి కష్టమగుతుందని,రెపరెపలాడే విజపతాకలను గుర్తుగా ఇంటిమీద పెట్టాడట స్వామి.
గోపికలు పొందిన ఏమా యోగ్యత?వారు దానిని ఎలా పొందగలిగినారు? అను ఆలోచన మనకు వస్తే,తమకు తెలియకుండగానే 1.ఈశ్వర సౌహార్ద్రం కలుగుతుంది.పరమేశ్వరుడు వారికి సులభసాధ్యుడు కావాలనుకుంటాడు.అసలు ఆ విషయమును వారు గమనించే స్థితిలోనే ఉండరు.అది వారి పూర్వజన్మ సుకృతము లేక ఇప్పటిదేమొ.
ఈ సుకృతము మూడు విధ రూప నామములతో ఉంటుంది.మొదటిది.యాదృచ్చికము.తనకు తెలియకుండానే చేతనుడు గుడిచుట్తు ప్రదక్షిణము చేయుటలో,దీపమును జ్యోతిర్మయము చేయుటయో,అర్చనలు చేయుటయో,అనుకోకుండా యాదృచ్చికముగా జరుగుతుంటుంది.అదే మన గోపికలు గోదమ్మను తమలో ఒక దానిగా భావించి అనుసరిస్తున్నారు.
రెండవ సుకృతము ఆనుషంగికము.
ఇది అజ్ఞాత సుకృతానుగ్రహ రెండవ దశ.ఆచార్యులను-పరమ పురుషులను అనుసరిస్తూ,వారికి సహాయపడగల ఇంతో-అంతో సానుకూల దశ.వీరికి తమతో నున్న వారు ఆచార్యులని కాని,తమ ఉనికి వారికి ఉపయోగ పడుతుందని కాని తెలిసియుండదు.కాని ఫలితము మాత్రము తథ్యము.
మూడవది ప్రాసంగిక సుకృతము.వీరు తమతో టి వారితో ప్రసంగించునపుడు పుణ్యక్షేర్త్ర నామమును కాని,పుణ్యపురుషుల నామములు కాని పుణ్య స్థలములలో వారున్నప్పుడు జరిగిన సంఘటనను గాని ప్రసంగిస్తారు.అదియును తమకు పుణ్యప్రదాయకమే అను భావన లేకుండ.
కాని "అసౌ విష్ణో కటాక్షంచ" ను నిజము చేస్తూ వారికి,మార్గదర్శకులైన ఆచార్యుల అనుగ్రహము లభిస్తుంది.నిప్పును ము తెలిసి ముట్టుకున్న తెలియక ముట్టుకునా చేతిని కాల్చుట ఎంత నిజమే అదే విధముగా ఏ మూడు విధములైన సుకృతములు ఆచార్య ప్రాప్తి అను అతికష్తముగా బిగిసిపోయి యున్న తలుపును అడ్డ గడియ తెరచి,లోనికి ప్రవేశింప చేస్తుంది.ఇక్కడ గోపికలది అదే పరిస్థితి.భగవంతుడు భాగవతుడైనాడు .తన ప్రతిరూపులుగా నలుగురు ఇద్దరు క్షేత్రపాలకులను ,మరో ఇద్దరు ద్వారపాలకులను గోపికలకు పరిచయము చేసినాడు.
.వీడిన అజ్ఞానము తిరిగి చేరకుండా నిశ్చలభక్తికి పుటము వేయించినాడు.అదియే గోపికల ద్వారపాలకుల సంభాషణము.వారి వినయ శీలతను "ఆయిర్ శిరు మిరో'గోపవంశములోని"మిక్కు చిన్నవారలము అను పలుకులతో వెల్లడింప చేశాడు.అంతే కాదు వారి విజ్ఞతను పర ఇస్తాను మీరు రండి అని నిన్ననే మాతో అన్నాడు
.ఇక్కడ నిన్న అంటే కిందటి జన్మ.అప్పుడు వారు మునులు కదా!
అంతేకాడు ద్వారపాలక వైశిష్ట్యమును కూడ గోదమ్మ ఈ పాశురములో మనకు వివరిస్తున్నది.మొదటి వారు క్షేత్రపాలకులు
ప్రాకార పాలకులు-లోపల నున్న వారు ప్రాసాద పాలకులు.అంటే స్థూల పాలకత్వము-సూక్ష పాలకత్వము అన్యాపదేశముగా ఇక్కడ చెప్పబడినది.వారు ఆచార్యులు అందకార-మమకారములను రెండు రెక్కలు గట్టిగా బిగుసుకొనిపోయిన మన అజ్ఞానమను తలుపు గడియను తీసి మూలతత్త్వమను దర్శించి-స్పర్శించి-తాదాత్మ్యమును అందించగలవారు.శ్రీరంగ క్షేత్ర జయ-విజయులు,చండ-ప్రచండులు-భద్ర-సుభద్రలు,ధాత-విధాతలే నిదర్శనములు.
తలుపు స్వభావము మారినది. అష్టాక్షరి మంత్రము.ద్వయి మంత్రము.రెండురెక్కలు.వాటి అడ్దగడియ శ్రీమన్నారాయణుడే.
అనితర సాధ్యమింకేముంటుదని తెలుసు కొనిన గోపికలు గోదమ్మను అనుసరిస్తూ, నంద కుటుంబమునుమేల్కొలుపుటకు వెళుతున్నారు.
( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)
No comments:
Post a Comment