సహస్యమాసము-భగ
*******************
" భర్జతీతి ఇతి భర్గ" భగ నామ ఆదిత్యుడు సహస్య మాసమునకు ప్రభువు.భ అనగా తేజము.గ అనగా గమనము.తేజోవంతమైన తన గమనముతో(కిరణ శక్తులతో) సమస్త అజ్ఞానమును భర్జింపచేసే మహాతేజస్సు.ఆయుర్ముని వేదపఠనమును ప్రారంభిస్తూ స్వామికి లాంఛనముగా మార్గమును చూపించుటకు సిధ్ధముగా నున్నాడు.పూర్వసిత్తి అను అప్సరస అభినయ నాట్యముతో స్వామిని సేవించుచున్నది.అపూర్వముగా అరిష్టనేమి అను గంధర్వుడు తన గళమును సవరించుచు,మాసమును మంగళప్రదమొనరించుచున్నాడు.కర్కోటక సర్పము రథపగ్గములను పరిశీలించి,ప్రయాణమునకు పటిష్టము చేయుచున్నాడు.యక్షుడు ఊమ సప్తాశ్వములను రథమునకు అనుసంధానము చేస్తూ,ఆనందోత్సాహుడైనాడు.స్పూర్జ రాక్షసుడు రథము వెనుక నిలబడి ముందుకు జరుపుతుండగా సకల లోకములను తన కిరణ ప్రకాశముతో జ్ఞాన వంతము చేయుటకు సన్నధ్ధుడైనాడు స్వామి..
తం భగః ప్రణమామ్యహం.
No comments:
Post a Comment