Sunday, May 3, 2020

CHAMAKAMUTO MAMAEKAMU-01

మన శరీరమే శ్రీచక్రము.శ్రీచక్రము బ్రహ్మాండమునకు ప్రతీక.ఈ అనువాకము రుద్రుని అనేకానేకత్వమును ప్రస్తావిస్తున్నది.మూలము తన యొక్క వివిధ శక్తులను జగత్రక్షణార్థము వివిధ నామ రూపములతో తన నుండి ఆవిర్భవింపచేసి జగత్రక్షణమును గావించుచుండును.ఇక్క డి దేవతలందరు పరమాత్మ అవయవములే.సమయ సందర్భానుసారముగా సూక్షము నుండి అనగా పిపీలకము నుండి బ్రహ్మాండము వరకు విస్తరిస్తూ,తిరిగి సంకోచిస్తూ భగవత్ వరప్రదాన-అనుగ్రహ కారకులగుచున్నారు.ఈ రుద్రులు అసంఖ్యాకకులు.ఆద్యంత రహితులు.అవ్యాజకరుణా మూర్తులు.దేవసృష్టులైన వారు సమస్త చరాచరములను సృష్టించుట-పోషించుట-లయము చేయుటలో పరమాత్మాదేశానుసారమును పాటిస్తుంటారు.జీవుల కర్మఫలములు ప్రధాన పాత్రను వహిస్తాయి.వీరు వాయువులు-రశ్ములు-మనుషులు మొదలగు నానా రూపములందును విహరించెదరు.అట్లు విభక్తులైన రుద్రులు సంసారము అనాది యగుట వలన లెక్కకు మిక్కిలివారై లోకానుగ్రహార్థము ప్రవర్తించుచుందురు.

చమకములొ శబ్దము

 పరమాత్మ తాను స్పూర్తియై మనచేత వాగ్రూపముగా అభ్యర్థలను జరిపించి,అనుగ్రహించుట ఎందుకు? తానే నేరుగా అనుగ్రహించ వచ్చును కదా! అను సందేహము కలుగ వచ్చును. కాని ప్రకృతి నియమానుసారముగా మనకు ఆకలి వేసిన మనమే ఆహారము దగ్గరికి వెళ్ళవలెను.నది నిరంతరము మన దప్పిక తీర్చుటకు తనదైన తీరులో ప్రవహిస్తూనే ఉంటుంది కాని మన దగ్గరకు రాదు.దప్పిక తీర్చుకొనుటకు మనమే జలము దగ్గరకు వెళ్ళలి.అదే విధముగా భగవత్ ప్రాభవమును మనకు పరమాత్మ తెలియపరుస్తూనే ఉంటాడు.మనము గుర్తించగలగాలి.అడగాలి.ఆసరా చేసుకోవాలి.అవరోధములను అధిగమించి,ఆయన పద సన్నిధిని చేవ్రుకోగలగాలి. మనలోని శక్తిని బహిర్గతము చేయాలంటే శబ్దము చాలా అవసరము.అందుకే కాంతిని-శబ్దమును (ప్రణవమును) పరమాత్మ మనకు అందించాడు.ఆ ప్రణవము జీవులను చైతన్య పరచి,వాగ్రూపముగా బహిర్గతమై వాంఛాఫలితములకు సహాయపడుతుంది.

  ఆకాశము శబ్ద వాచకము.ప్రథమ భూతము.మహర్షులు దివ్య శబ్దములను అనంతాకాశములో తమ తపశ్శక్తితో వినగలుగుచున్నారు.శబ్దము కలుగచేయు జ్ఞానము మన తమస్సును పోగొట్టును.జగతి మానవులు సృజించలేని దృశ్య వైభవమైతే వేదములు-ప్రణవము మానవులు సృజించలేని శబ్ద వైభవములు.

  కనుక ప్రథమ అనువాకములో సాధకుడు అగ్నా-విష్ణూ అంటూ వాగ్రూప స్తోత్రములతో వారిని ఆహ్వానిస్తూ,తనను చైతన్య వంతునిచేసి అన్నముతో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాడు


  ఈ  అగ్నా-విష్ణు ఎవరు? వారిని" సజొతషే" అంటూ ఇద్దరిని కలిసి రమ్మని సాధకుడు ఎందుకు ప్రార్థిస్తున్నాడు? అను సందేహము కలుగవచ్చును.

     పరమాత్మ తన అనుగ్రహాతిశయము చేత తనను తాను శత విధములుగా-సహస్ర విధములుగా అనేకానేక నామ-రూపములతో విభజించుకొని,వరప్రదాన-అభయ దానమునిచ్చి అనుగ్రహించుచున్నాడు.పరమేశ్వర సంకల్పమాత్రముహే సృష్టింపబడిన అనేకానేక దేవతాశక్తులు వీరు.అసంఖ్యాకులు.ఆద్యంత రహితులు.అవ్యాజ కరుణా సంపన్నులు.సమస్త స్థావర-జంగమములను రక్షించుట-పోషించుట-ఉపసమ్హరించుట పరమేశ్వరాదేశానుసారముగా నిర్వర్తిస్తుంటారు.అదియును జీవుల కర్మఫలములను అనుసరించి ధర్మమార్గమున.

   ఈ రుద్రులు వాయువులు-కిరణములు-మనుష్యులు మొదలగు నానా విధములందు విహరించెదరు.సంసారము అనంతమైనదగుట వలన వారి గుణ ప్రకాశమునకు ప్రతీక లైన వారు వీరు.అట్టి రుద్ర సంకల్ప జనితులైన అగ్ని-విష్ను అను శక్తులను సాధకుడు జతగా వచ్చి,వారి శక్తులను సాధకునిలో ప్రవేశింప చేసి యజ్ఞమును సమర్థవంతము చేయమని ప్రార్థించుచున్న వేల సర్వం శివమయం జగం.తక్కినది లేశ మాత్రమైనను కానరాదు.

    అట్టి కరుణమూర్తికి ఏకబిల్వం శివార్పణం.



No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...