Friday, May 15, 2020

CHAMAKAMUTOE MAMAEKAMU-04

  చమకము-అనువాకము-02
  *********************

  త్విషిశ్చమే-త్విషకాంతే.

   ప్రవృత్తి-నివృత్తుల వివేకమును ప్రకాశింపచేసెడి భావము.

   క్షత్రంచమే అని సాధకుడు రుద్రుని సౌష్టవమైన శరీరమును కోరుతున్నాడు.చాలా తెలివైన వాడు కనుక త్విషిశ్చమే అని యుక్తాయుక్త విచక్షణ వలన కలుగు ప్రకాశమును కోరుకుంటున్నాడు.

   ఆధ్యాత్మిక సాధన అను ప్రక్రియలో కొన్ని శక్తులు మన దగ్గరకు వచ్చి,శాశ్వతముగా మన దగ్గరనే ఉండి మన సామర్థ్యమును పెంచేవిగా ఉండాలి.మరి కొన్ని శక్తులు మననుండి శాశ్వతముగా దూరముగా తొలగిపోవాలి.అప్పుడు కాని మనలను కమ్ముకున్న అజ్ఞానమను చీకటి తొలగి పోయి,చిత్ప్రకాశమును దర్శించలేము.

 పంటచేను పచ్చదనముతో పరవశించాలంటే,కలుపు మొక్కలను పీకివేయాలి.ఎదుగుతున్న పైరును చీడ-పీడ దరిచేరకుండా చూసుకోవాలి.అదేవిధముగా ఆధ్యాత్మిక సేద్యమును కొనసాగించాలంటే,అరిషడ్వర్గములనే కలుపు మొక్కలను పీకివేయగలగాలి.చంచలమైన మనసుకు ఏకాగ్ర్తను అలవాటు చేయాలి.

   ఈ అనువాకములో మన్యుశ్చమే-భామశ్చమే అని కోపమును మానసిక కోపముగాను-బాహ్య కోపముగాను ప్రస్తావించారు.సాధకుని కోపము మానసికమైనదియైనను-బాహ్యమైనది యైనని కలుపు మొక్కలను కోసివేసే కత్తి కావాలి కాని,పంట పాలిటి శత్రువు కారాదు.ఏది కలుపు మొక్కయో-ఏది కల్వృక్షమో గ్రహించగల శక్తి సాధకునికి కావాలి.అందుకే "అంబశ్చమే" అంటూ గ్రాహ్యశక్తిని ప్రసాదించమని వేడుకొనుచున్నాడు.

 

 సాధకునికి లభించిన గ్రాహ్యశక్తి,దేహము వేరు-ఆత్మ వేరు అను విషయమును గ్రహింపచేయకలిగినదయితే,దేనిని పట్టుకోవాలో/దేనిని విడిచిపెట్టాలో నిర్ణయించుకోగలుగుతాడు.ఈ స్థితికి రావాలంటే,"సత్యంచమే-శ్రధ్ధాచమే" సత్యం-జ్ఞానం-అనంతం బ్రహ్మం" అన్న పరమార్థమును,సూక్తంచమే-సుకృతంచమే" సుకృతమువలన సూక్త పరిజ్ఞానముతో (వేద),"సుపథంచమే" సుగమమైన మార్గములో పయనిస్తూ,"జర్మాశ్చమే" అంటు తన యజ్ఞమును సమర్థవంతము చేయుచున్న చమకముతో మమేకమగుచున్న వేళ,"సర్వం శివమయం జగం."

    ఏక బిల్వం శివార్పణం.





No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...