Sunday, October 18, 2020
0004
అమ్మకు సభక్తి పూర్వక నమస్కారములతో
ప్రసీద మమ సర్వదా-04
*********************
మాతా కూష్మాండా నమోనమః
"సురాసుర సంపూర్ణ కలశం రుధిరా పుత్రమేవచ
దధనా హస్త పద్మాభ్యాం కుష్మాండా శుభదాస్తుం "
శైలపుత్రీ మాత మనకుబ్రహ్మచారిణి మాతను పరిచయము చేస్తే,బ్రహ్మచారిణి మాత మనకు చంద్రఘంట తల్లి పరిణయమను ప్రసాదగుణమును అందించింది.ఇల్లాలైన చంద్రఘంట తల్లి సూక్ష్మ-స్థూల రూపములతో అండరూపముగా ధరించు కూష్మాండ మాత కరుణరసామృత వర్షిలో మునిగితేలే మురెపమును అందించింది.
కు అనగా చిన్న/సూక్ష్మ అను భావమును మనము గ్రహించగలిగితే,ఊష్మాండా అనగా సుందరతత్త్వము.అనగా తల్లి మనలో సూక్ష్మరూపములో నిండి స్థూలతత్త్వమును దర్శింపచేస్తుంది తల్లి.అందుకే ఆమ్మ అష్టసిధ్ధిస్వరూపిణి అయిన అష్టభుజి.
పదునాలుగు భువనంబులు కుదురుగ తన కుక్షిలో నింపుకొని,దేవకీదేవి గర్భములో ఒదిగిన శ్రీకృష్ణుని వలె సూక్ష్మాతిసూక్ష్మము కాగలదు.అదే విధముగా ఇందుగలదందులేదని...ఎందెందు వెతికి చూసిన అందందేగలడు చక్రి అని ప్రహ్లాదుడు అన్న చందంబున విశ్వరూపియై విచ్చేయగలది కూష్మాండమాత.
నమో పూర్వజాయచ-పరజాయచ" అని రుద్రములో చెప్పబడినట్లుగా,సృష్టికి పూర్వమును హిరణ్యగర్భయై తల్లి తత్స్వరూపిణిగా ముందు ఉన్నది-ఇప్పుడు ఉన్నది-భవిష్యత్తు లోను ఉంటుంది.
రుద్రము పరాశక్తి ప్రాభవమును "ఉగణాభ్యస్య" అంటు ఉత్తమమైన సమర్థవంతమైన స్త్రీగణముల గురించి ప్రస్తావించినది.వారు దేనిలో సమర్థులు అను ప్రశ్నకు?
తృహంతి-అనగా తుంపుటకు-దుష్టత్వమును తుంపుటకు అని శక్తిస్వరూపమును వివరిస్తున్నది.
సినిమాతెర వలె తాను నిశ్చలముగా నుండి మనకు దానిపై కదిలే చిత్రములతో పాటుగా తాను కదులుతున్నట్లుగా భ్రమింపచేయుట తల్లి క్రీడ.లోక ధర్మములను నిర్వర్తించుటకు ఆత్మ-శరీరము అను రెండు రూపములను తానే ధరించి,ఒక దానిని స్థిరముగా అలౌకికముగా నిలబెట్టి(ఆత్మ) రెండవదానిని తన చైతన్యముతో కదిలిస్తూ ఉన్నప్పటికిని,మనను ఆవరించిన మాయ పొర శరీరము లోని ఆత్మను గుర్తించలేదు.గుడ్డులోపలి పదార్థము దానిని ఛేదిస్తే కాని కనపడదు.అదే విధముగా మనలోపలి ఆత్మ బాహ్యమును మనము ఛేదించగలిగితే కాని బోధపడదు.
ప్రళయానంతరము సర్వము అంధకారబంధురమైన సమయమున "మందస్మిత ప్రభాపూర" తన చిరునప్పు కాంతులతో చీకట్లను చిదిమివేసినది.సూర్యమండలమధ్యయై వేడిని-వెలుతురును ఆదాన-ప్రదానముల ద్వారా అందించుచు మనలను ఆశీర్వదించుచున్నది.
తల్లీ నీవందించుచున్న ఉషోదయ కాంతితో,నా బుధ్ధి యనెడి పద్మము వికసించి,విశ్వమంతయు నిండియున్న నీ స్వరూపంబును-నా స్వస్వరూపముతో అనుసంధానముచేయుచున్నది.
అసలు తత్త్వమును అందించుట అమ్మ సంకల్పము.
ఆత్మతత్త్వమును అర్థము చేసికొనుట మన సంకల్పము.
అమ్మ చేతిని పట్టుకుని ఆనందాబ్ధిలో ఓలలాడుదాము..
అమ్మ చెంతనున్న మనకు అన్య చింతనలే.
అమ్మ దయతో మన ప్రయాణము కొనసాగుతుంది
అమ్మ చరణములే శరణము.
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-13
. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment