పదవ పాశురము.
***************
నోట్రుం చువర్కం పుగుగిన్ర అమ్మణాయ్
మాట్రావుం తారారో వాసల్ తిరవాదార్
నాట్రా తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాళాల్
పోట్రా పరైతర్రుం పుణ్ణెయనాళ్ ఒండొరునాళ్
కూట్రత్తిన్ వాయ్ వీళ్దం కుంబకరణనుం
తోట్రుం ఉనక్కే పెరున్ తుయిల్ తాన్ తందానో
అట్ర అనందన్ ఉడయాయ్ అరుంగలమే
తేట్రమాయ్ వందు తిరవేలో రెంబోవాయ్.
పాదములలదుకున్నవి వేదగంధమును
పెదవులందించునుగద నాదగంధమును
నలువనందించిన నడుమున కమలగంధంబు
మెడమీడ నడయాడు తులసిగంధంబు
నిస్తులమైన నుదుటను కస్తురిగంధంబు
ఎన్నిగంధంబులు తన్ను బంధించుచున్నను
గోద పూమాలల గంధంబు మోదమందించుట
నిర్వివాదము ఆహా!.సర్వసుగంధునకు.
"తిరుపళ్ళి ఎళుచ్చి " పాశురములలో ఐదవ గోపికను గోదమ్మ అమ్మణాయ్ అంటు మేల్కొలుపుతోంది.బాహ్యమునకు ఈమె నివాసము శ్రీకృష్ణుని ఇంటి పక్క ఇల్లు.ఎప్పుడు స్వామి తనను చూడాలన్నా,తాను స్వామిని చూడాలన్న అడ్డుగోడను దూకి వెళ్ళి ఆనందించేవారట.స్వామితో అత్యంత సాన్నిహిత్యము కలది కనుక స్వామిని ( అమ్మణ్ణాయ్.)అని సంబోధిస్తున్నది.గోదమ్మ.
ఏవా ఇరుగిల్లు-పొరుగిల్లు? జీవాత్మ-పరమాత్మ.
జీవాత్మ ఉనికి పరమాత్మ పక్కనే.
పరమాత్మ ఉనికి జీవాత్మ పక్కననే
రెండు పరస్పరాశ్రితములేకదా.విస్తరించిన పరమాత్మ అనేకానేక భాగములుగా ప్రకటింపబడుతు చేతనులలో దాగి వారిని తమ ఇల్లు చేసుకున్నది.విస్తరించిన పరమాత్మ ప్రకృతి స్వరూపమనేఇంటిలో తాను నివసిస్తూ దానిని తన ఇంటిని చేసుకున్నాడు.
ఎంతటి అద్భుత భావము.నిజమునకు ఒకటే మనకు రెండుగా భాసించుచు మనకు పరమాత్మ లీలలను ప్రకటించుచున్నది.
స్వామి గోపికను చూడాలన్న-గోపిక స్వామిని చూడాలన్న ప్రాపంచికమనే అడ్డుగోడను దూకి ఒకరింటికి మరొకరు వెళ్ళేవారట.గోపిక-స్వామి అను ఇద్దరు లేరు.అది కేవలము లీల.
అందుకే ఈ గోపిక సాక్షాత్తు స్వామియే.కనుకనే అమ్మ
స్వామిని -అమ్మణ్ణాయ్ అని గౌరవపూర్వకముగా సంబోధిస్తున్నది.
కాని ఇక్కడ మనకు ఒక చమత్కారమును సఖ్యభక్తి రూపముగా అమ్మ ఆ గోపిక యొక్క సఖులుగా ,
తాన్ తందానే-అమాయకముగా స్వీకరించినదట-దేనిని?
పెరున్ తుయిల్-మొద్దు నిద్రను-ఎవరి దగ్గరి నుండి?
కుంబకరణం-కుంభకర్ణుని దగ్గర నుండి-ఎప్పుడు?
వాడు-
కూట్రాత్తిన్ వాయ్ వీళ్ద-మృత్యువాత పడినప్పుడు.
వాడు చనిపోతు -అమ్మాయ్ నేను నీకు లోకములు నన్ను మెచ్చుకునే నా గాఢనిద్రను వరముగా ఇస్తాను అని అన్నగానే-సంతోషముతో స్వీకరించావా ఏమిటి/ మేమెంత పిలుస్తున్నా పలుకుట లేదు అని మేలమాడారు. అయినా లేవలేదు ఆ గోపిక.ఆమెకు క్రిష్ణ తాదాత్మయమును మించినదిలేదు.
నిజమునకు ఇక్కడ ప్రస్తావించిన కుంభకర్ణుడు రావణుని సోదరుడ? లేక?
ఎవరీ కుంభకర్ణుడు? అతని నిద్ర పరమార్థమేమిటి? ద్రవిడ సంప్రదాయానుసారము-కుంభము కుండ నుండి పుట్టిన వాడు అగస్త్య మహర్షి.రూపము కురుచ-శక్తులు ఘనము.ఈయన మూడు కార్యములను జగత్కళ్యాణమునకు చేసినాడు.మొదటిది వింధ్య పర్వతమును నకు వినయమును నేర్పెను.రెండవది (జ్ఞాన) సముద్రమును అవపోసన పట్టెను.వాతాపిని (అసురత్వమును) అంతమొందించెను. అనవరతము భగవత్తత్త్వముతో రమించుటయే ఆయన పోవు నిద్ర.త్వమేవాహం అను పధ్ధతి మన గోపిక కూడ అనవరతము భగవతత్త్వములో మునిగియున్నదను సంకేతము..
స్వామి ఒండొరునాళ్-ఒకానొకరోజు,
పుణ్ణియనాల్-మా పుణ్యఫలముగా,
పఱై తరుం-పరను అనుగ్రహిస్తానని మాట ఇచ్చాడు.
నోట్రుం- నోమును
చువర్కుం-సజ్జనులతో
పుగిగిన్రు-కలిసి నోచుకుందాము.
మాతో కలిసి నోమునకు వస్తే స్వామిని పోట్ర -కీర్తిస్తూ తెచ్చుకుందాము.
అరుంగలమే- గోకుల భూషణమా/ఆభరణమా! నీవు,
ఆట్రాయ్ అనందలాయ్-బహిర్ముఖురాలివై/నిద్రమేల్కాంచి,
తిర-తలుపు తెరుచుటకు,
తోట్రమాయ్ వందు-తొట్రుపాటు లేకుండ,
వందు-రామ్మా. అని ఆ గోపికను తమతో నోముకు తీసుకుని వెళ్ళుచున్న గోదమ్మ చేతిని పట్టుకుని,మనము మన అడుగులను కదుపుదాము.
ఆండాళ్ తిరువడిగళే శరణం.
.
No comments:
Post a Comment