Tuesday, December 29, 2020

ALO REMBAVAY-16


   



   పదహారవ పాశురము
   ******************

  నాయగనాయ్ నిండ్ర నందగోపనుడయ
  కోయిల్ కాప్పానే కొడితోన్రుం తోరణ వాయిల్ కాప్పానే

  మణిక్కదవం  తాళ్తిరవాయ్

   ఆయర్ శిరుమియరో ముక్కు అరైపరై

  మాయన్ మణివణ్ణన్  నెన్నలే వాయ్నెందున్

  తూయోమాయ్ వందోం తుయల్ ఎళుప్పాడువాన్

   వాయాల్ మున్నం మున్నం మాట్రారేఅమ్మ నీ
   నేయని ల్లైక్కదవం నీక్కేలో రెంబావాయ్.


  ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
  ********************************

   ఆయర్ శిరుమియరో ముక్కు-గోకులములోని/గొల్లకులములోని కల్ల-కపటము తెలియని చిన్న పిల్లలము/ముక్కుపచ్చలారని వారము.

 నిండ్ర-నిలబడియున్న వారము.  ఎక్కడ?

  నందగోపన్ కోయిల్ వాశల్-నందగోపుని పవిత్రమైన ఇంటి ముందు.

 ఆ ఇల్లు ఎలా ఉన్నదంటే,

 కొడి తోన్రుం-ఎగురుతున్న జెండాలతో పరాక్రమిస్తున్నది.

   అంతే కాదు,

 తోరణ వాయిల్-వాకిలి  తోరణములతో ప్రకాశిస్తున్నది.


 ఈ భవనము మణిమయము.తలుపు మణిమయము.ఇందులో నిదురించుచున్న స్వామి మణివర్ణుడు.

  అని అమ్మ కీర్తిస్తున్నది.ఇది దేనికి సంకేతము. రెండు గొప్ప ఉదాత్తగుణములకు సంకేతముగా మనము భావించవచ్చును.

 మొదటిది-స్వయం ప్రకాశకత్వము.
 రెండవది సర్వ ప్రసాద గుణత్వము.

   కనుకనే స్వామి తెల్లవారుఝామున తమ ఇల్లును గోపికలు గుర్తించుటకు ఇంటిపైన కేతనములను,ఇంటి గడపకు మంగళతోరణములను అనుగ్రహించాడని పెద్దలు చమత్కరిస్తారు.

 మణిమయమైన (చింతామణిమయమైన) స్వామి స్వభావము.స్వామి నివాసమయమై ప్రతిఫలిస్తున్నదా యన్నట్లున్నది.

 మరొక్క ముఖ్య విషయము మనకు ఈ పాశురములో అమ్మ వివరిస్తున్నది.

  అది వారు ఆ భవనమునకు వచ్చిన కారణము.
 స్వామి వారి నోమునకు కావలిసిన పఱ ని ఇస్తానని,నిన్ననే చెప్పినందు వలన దానిని గ్రహించుటకు వచ్చామని స్వామిని దర్శించి వెళ్ళిపోతామని ద్వారపాలకులతో చెబుతున్నది.

 అరై పరై నిన్నలే వాయ్ నెందాన్-.

   మనమిక్కడ ఒక చిన్న సూక్ష్మమును గమనిద్దాము.

 తలుపు దగ్గర ద్వారపాలకులు కావలి ఉన్నారు.వారు గోపికల ప్రవేశమును అడ్డగిస్తున్నారు.కర్తవ్యపాలనమే అయినప్పటికిని వారు అరిషడ్వర్గములు ఆవరించిన వారై అహంకారముతో ప్రభావితము కావింపబడినవారై కఠినముగానే ఉన్నారు.

  కాని మన గోపికల పరిస్థితి వేరు.దశేంద్రియావస్థను దాటిన వారు కనుకనే వినయముగా వినతిచేయగలుగుతున్నారు.

   వారి మాటలను పరిశీలిస్తే మనకు బాహ్యార్థము ఒక విధముగాను,అంతరార్థము పరమాద్భుతము గాను అర్థమగుతుంది.

 వారు తమ గురించి మూడు విషయములను పరిచయము చేసుకున్నారు.

 అవి-ఆయిర్-గొల్లెతమని-పైకి గొల్ల కులము వారిమని,గమనిస్తే-గోవిందుని వారమని.

   సిరుమియరో-చిన్న పిల్లలమన్నారు.అది వారి అహంకార రాహిత్యమును సూచిస్తుంది.

  తుయల్ ఎళుప్పాడువాన్ తూయో మాయ్ వందోం- అన్నారు.

 అంతకు ముందే నియమ నిష్ఠలు-పూజా పునస్కారములు తెలియని వారము అన్నారు.వారు నిస్సంగులు.


  శ్రోత్రియ ఆచారములు లేనివారమంటూనే,తూయోమాయ్ -పరిశుధ్ధులమైనాము (మానసికముగా-త్రికరనములుగా-స్వామికి సుప్రభాతమును కీర్తించి-మేల్కొలుపుటకు వచ్చామని -వారివలన స్వామికే అపాయము రాదని ద్వారపాలకుల భయమును తొలగించగల విజ్ఞులు వారు.)

  ఇంకొక విశేషము ఏమంటే మనకు మొదటి పాశురము నుండి పఱ శబ్దము వినిపిస్తున్నప్పటికి క్రమక్రమముగా దాని అర్థము పరమార్థమును సూచిస్తూ వస్తున్నది.కనుకనే వారు,

 మాట్రాదే అమ్మ నీ నేయని ల్లైక్కదవం అని అడుగుటకు స్వతత్రించగలిగినారు.

  మాట్రాదే-ఆలస్యము చేయకుండ,

 నేయ-అతి పెద్దదైన,
 నిలైక్కదవం -బరువైన గడియను
 నిక్కు-తెరువు,


 ఆచార్యులు వీటిని అష్టాక్షరీ-ద్వయక్షరీ మంత్రములుగా పరిగణిస్తారు.


   ఆండాళ్ తల్లి ఇద్దరు ద్వారపాలకులను పేర్కొన్నది కోయిల్ కాప్పానే-వాయిల్ కాప్పానే,

ప్రాకార పాలకులార-ద్వార పాలకులారా అని స్వామి పరతత్త్వమును ప్రస్తుతిస్తూ గోదమ్మ అనుగ్రహముతో వారు బాహ్యాభిమానములనే ప్రాకారమును,దేహాభిమానము అనే ప్రాసాదమును దాటి స్వామి నిదురించుచున్న నంద భవనములోనికి ప్రవేశించగలిగినారు.
.స్వామి అనుగ్రహముతో భవనములోనికి గోపికలతో బాటుగా ప్రవేశిస్తున్న గోదమ్మ చేతిని పట్టుకుని మనము మన అడుగులను కదుపుదాము.

ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.



 

 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...