Wednesday, December 2, 2020

MEEDHUSHTAMA SIVATAMA-24



   మీఢుష్టమ శివతమ-24
  ***********************



   మనసున మసలుము సదాశివా
   మాయాతీత మహాదేవ నా
   మనసున మసలుము సదాశివా.





   ఏమిటీ వేళాకోళం రుద్రా.



 మల్లయ్యను పిలువమంటే,మల్లయ్యతో,



 మీరు శ్రమపడి రావద్దు.మీదగ్గరున్న కరంటును తెప్పించే శక్తిని మాత్రమే రమ్మన్నావు.

వాడు రాలేదు.చీకటి పోలేదు.



  విషయము అర్థమవ్వటములేదు నీకు.ఎవరిని పిలవాలో,ఎలా పిలవాలో, ఎలా పనులు చేయించుకోవాలో తెలియనట్లుంది నీకు అన్నాడు సాధకుడు చిరాకుగా.




  అంతలోనే నాన్నా! తలుపు రెక్క విరిగింది.మూయటానికి రావటములేదు అంటూ వచ్చాడు పదేళ్ళ కొడుకు.



 ఈసారైనా మర్యాదగా వచ్చి తలుపు బిగించివెళ్ళమని వడ్రంగికి చెప్పు.వాడిపేరు కూడా మల్లన్నే.



    రుద్రుడు,   అసలేమి జరగనట్లు ఫోను తీసుకుని చేసాడు.కలిసింది.



 అయ్యా ఇవతల రుద్రుడు మాట్లాడుతున్నాడు.అవతల మీరు.?
.నా  పేరు మల్లన్న.వడ్రంగిని.



 సాధకుని గారింట్లో తలుపురెక్క విరిగింది.మీరు మాత్రమే..నేను మళ్ళీ చెబుతున్నాను  వినండి.సామానులు-సంచీలు వద్దు.మీరు మాత్రమే వచ్చి తలుపు బిగించి వెళ్ళండి అన్నాడు మరింత అమాయకముగా.



   ఉత్తచేతులతో ఉరికి వచ్చాడు వడ్రంగి మల్లన్న.



  తలుపును చూసాడు.తలను అడ్డంగా తిప్పాడు.పనిముట్లు లేవండి.రేపు తెచ్చుకుని చేస్తాను అంటూ వెళ్ళిపోయాడు.



   ఏమిటిది రుద్రా? ఎంతో కోపంగా అడిగాడు సాధకుడు.



  ఎంతో మర్యాదగా మీరన్నట్లే మర్యాదగా అతనినే పిలిచాను అన్నాదు రుద్రుడు అర్థంకానివాడిలాగ.



  గంగవెర్రులెత్తుతోంది సాధకునికిపొంగిపోతోందినెత్తిమీది గంగ రుద్రునికి.



   రుద్రా! గట్టిగా అరచి,నీకిదే చివరి అవశం
 .పని నేర్చుకో.నా పని పూర్తికావాలి.నీవెలా చేసినా సరే అన్నాడు.



  అమితానందముతో గిరగిర తిరుగుతున్నాడు రుద్రుడు వసారాలో ఆడుకుంటూ-పాడుకుంటూ.



   విద్యుత్ శక్తి మల్లన్న కలిసిరండి

   వడ్రంగి శక్తి మల్లన్న కలిసిరండి

   కుమ్మరి శక్తి మల్లన్న కలిసి రండి


   కమ్మరి శక్తి మల్లన్న కలిసి రండి

   కర్షక శక్తి మల్లన్న కలిసి రండి

      శక్తి-రూపము కలిసి రండి.

   సజోతషే-సజోతషే అంటూ ,



  ఈ పాట ఎక్కడో విన్నట్లుందే అనుకుంటున్నాడు  సాధకుడు.




   అదే అదే,



 అగ్నిశ్చమ-ఇంద్రశ్చమే

 సోమశ్చమ -ఇంద్రశ్చమే

 సవితాచమ-ఇంద్రశ్చమే

 సరస్వతీచమ-ఇంద్రశ్చమే,



చిలిపిగా నవ్వుతున్నాడు రుద్రుడు.పశ్చాత్తపమునకు అది పిలుపుగా భావించాడు సాధకుడు.



 రూపము దానిలో నిక్షిప్తమైన శక్తి రెండు జతగా వస్తేనే సమర్థవంతము కదరా సాధకా!

   పమాత్మ-విభూతి కద ప్రపంచము.



   గుణసంబంధ శక్తి నిక్షిప్తము.దానిని దాచుకొనిన రూపము ప్రకటనము.అని బోధిస్తున్నట్లున్నది కొత్తగా.

   ఇంద్రుడు/ఈశ్వరుడు నిక్షిప్తశక్తి.

  అగ్ని-సోమ-సవిత-సరస్వతీ మొదలగునవి దానిని ప్రకటనము చేయు రూపములు.



 " శక్వరీరంగులయో దిశశ్చమే"-విరాట్పురుషుని అంగుళీ-వేల్లు. వివిధఛందస్సులు.మనము అజ్ఞానముతో మన పంచేద్రియ శక్తులను కన్ను-ముక్కు అంటు అవయములుగా భావిస్తున్నాము ,శక్తిని విస్మరించి దాని ప్రకటనద్వారములను మాత్రమే గమనిస్తూ.

   పాహి-పాహి  సదాశివా-శరనాగతరక్షకా,

   మాయతెర  మాయమైనది.



  పశ్చాత్తాపముతో పరుగున వచ్చి రుద్రుని పాదములపై పడ్డాడు సాధకుడు.



   దీనవదనముతో శరణుకోరుతున్నాడు సాధకుడు.

   మౌనవ్యాఖ్యలతో కరుణచూపుతున్నాడు రుద్రుడు.



   కదిలేవి కథలు-కదిలించేది కరుణ.



  అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.



 శివానుగ్రహముతో రేపు కలుసుకుందాము.



 ఏక బిల్వం  శివార్పణం.





.


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...