మీఢుష్టమ శివతమ-30
************************
" ఓం"
హంస హంస పరమహంస సోహం
హంసః సోహం హంసః
హంస హంసాయ విద్మహే
పరమ హంసాయ ధీమతి--
తన్నో రుద్రః ప్రచోదయాత్.
శబ్దము-శివము మమేకమవుతున్న మంగళవాచకము.
ఇంతకాలం సాధకుడు రుద్రుడు పరస్పరము ఆడుకున్నారు దాగుడుమూతలు.అవునన్నాడు-కాదన్నాడు-అవునేమో అన్నాడు-నిందించాడు.స్పందించాడు సాధకుడు.
ప్రశ్నించాడు.పరిచర్యలు చేసాడు.పశ్చాత్తాపపడేట్లు చేసాడు.
పరమావధిని చూపిస్తున్నాడు.రుద్రుడు
ఎంతటి భాగ్యశాలి ఆ సాధకుడు.
రుద్రుని అనుగ్రహముతో ,రుద్రుని ఎదురుగా కూర్చుని,రుద్రుని అర్చించుటకు-అభిషేకించుటకు-అగ్నికార్యమును సలుపుటకు,అఖిలమై పోవుటకు,ఆత్మసాక్షాత్కారమును పొందుతకు, తనలో దాగిన రుద్రశక్తిని
ప్రచోదనము చేయమని,మహన్యాసము చేస్తున్నాడు.
అది అర్హతయో/అధికారమో/అనుగ్రహమో వారికే తెలియాలి.
ఓం నమో భగవతే రుద్రాయ.
మహాదేవం మహాత్మానం మహాపాతక నాశనం.
మహా పాపహరం వందే మకారాయ నమో నమః.
తనూశ్చమే-వర్మచమే-అంగానిచమే-అస్థానిచమే
పరూగిమ్షచమే-శరీరానిచమే
అంటూ సాద్గకుడు తన అవయవములను-ఎముకలను-వేళ్ళను శక్తివంతము చేయమని అప్పుడు తన శరీరము-ఆత్మ పరాక్రమవంతమై,
అనాత్మ /విషయ/ప్రపంచ భావములను తరిమివేసే శక్తితో కవచముగా మారి యజ్ఞమును సమర్థవంతము చేస్తుందని వేడుకుంటున్నాడు.
దీక్షాచమే-తపశ్చమే అంటు,రుద్రుని ఆశీర్వచనముతో వేదిక రుద్రమయమే-పాత్రలు-పళ్ళెములు-గరిటెలు-ద్రవ్యములు అన్ని రుద్రమయమే.హవిస్సు సంగతి సరే సరి.అర్థేంద్ర సమర్థవంతముగా జరిగిన ఆ మహత్తర కార్యములో దీక్షా స్వీకారమునుండి -అవబృధ స్నానము వరకు అన్నీ ఆ పరమాత్మ అనుగ్రహ స్వరూపములే.
ఇప్పటివరకు ఎంతమందో ఈశ్వరానుగ్రహముతో కృతకృత్యులు కాగలిగారు.ఇప్పుడు అవుతున్నారు.ఇక ముందు అవుతారు.
ఇది కాదనలేని-ఖండించలేని ప్రమాణము.
ఈశ్వరుడు-ఈశ్వరానుగ్రహము అవిభాజ్యములు.సర్వతోముఖములు.సర్వమంగళకరములు.
స్వస్తి.
ప్రియ మిత్రులారా,
దోషభూఇష్టమైన "మీఢుష్టమ శివతమను" తమ సమూహములో ప్రచురించుటకు
అనుమతించినందులకు సదా కృతజ్ఞురాలను.అంతే సహృదయతతో నన్ను ప్రోత్సహించిన మిత్రులందరికిధన్యవాదములు.
అవ్యాజమైన ఆ పరమాత్మకృప మనలనందరిని ఆశీర్వదించును గాక.
కథలను కదిలించినా-కరుణను కురిపించినా-నా ఈ దుస్సాహమును క్షమించినా ఏదైన పరమాత్మ ప్రసన్నాతా విభూతియే.
అన్నిచోట్ల-అన్నివేళలా-అందరిలో-అన్నింటిలో దానిని దర్శిస్తూ తరిద్దాము.
శుభం భూయాత్.
https://www.youtube.com/watch?v=R4ht80ialeM
No comments:
Post a Comment