ఇరువది తొమ్మిదవ పాశురం
**********************
శిట్రం శిరుకాలే వందున్నై చ్చేవిత్తున్
పొట్రామరై అడియే పోట్రుం పొరుళ్ కేళాయ్
పెట్రం మెత్తుణ్ణం కులత్తిల్ పిరందు నీ
కుట్రేవల్ ఎంగళై కొళ్ళామల్ పోగాదు
ఇట్రైపరై కొళ్వాన్ అన్రుగాణ్ గోవిందా
ఎట్రెక్కుం, ఏళేళు పిరవిక్కుం ఉందన్నోడు
ఉట్రోమేయావోం; ఉనక్కేనాం,అత్చెయం వో
మట్రినం కామంగళ్ మాట్రేలో రెంబావాయ్..
" గంధము పుయ్యరుగ-పన్నీరు గంధము పుయ్యరుగ
అందమైన యదునందనుపై-కుందరదనలిరవొందగ
పరిమళ గంధము పుయ్యరుగ
తిలకమ్ము దిద్దరుగ-కస్తురి తిలకము దిద్దరుగ
కలకలమను ముఖకళగని సొక్కము
పలుకుల నమృతము చిలికెడి స్వామికి
కస్తురి తిలకము దిద్దరుగ
చేలము గట్టరుగ-బంగారు చేలము గట్టరుగ
మాలిమితో గోపాల బాలురతో
నాలను మేపిన విశాల నయననుకి
బంగారు చేలము కట్తరుగా
హారతులెత్తరుగా -ముత్యాల హారతులెత్తరుగా
నారీమణులను వారము యౌవన
వారక యొసగెడు వారిజాక్షునకు
ముత్యాల హారతులివ్వరుగా
పూజలు సేయరుగా-మనసార పూజలు సేయరుగా
జాజులు మరి విరజాజులు దవనము
రాజిత త్యాగరాజ వినుతినికి
పూజలు సేయరుగ-మనసార పూజలు సేయరుగా అంటు,
స్వామిని సమీపించారు గోపికలు సేవించుటకై ఈ
శాత్తుమరై పాశురములో ( వింజామర కైంకర్యమును సమర్పించే)
ఇప్పుడు వారు ఆనందసాగరములో ఆ నందగోపాలుని సేవిస్తు భవసాగరతారణమైన భవ్య నావలో భాగ్యశాలులై స్వామిని సేవించుకుంటున్నారు.వింజామరలు వీస్తున్నారు.గంధమును (భక్తి) పూస్తున్నారు.కస్తురిని అలదుతున్నారు.చేలమును చుట్టుచున్నారు.హారములను అలంకరిస్తున్నారు.వనమాలలను చుట్టుతున్నారు.శిఖిని నెమలిపింఛమును అలంకరిస్తున్నారు.వారి సేవనలను కాదనలేని స్వామి ఏమిటిది? ఎందుకిలా నన్ను అలంకరిస్తు-ఆరాధిస్తు-ఆనందిస్తున్నారు అంటు అడిగాడు కొంటెగా.
దానికి వారు స్వామికి-వారికి మధ్యన గల(జీవాత్మ-పరమాత్మల)
"ఎట్రెక్కుం ఏళేళు పిరవిక్కుం" మనది ఎన్నెన్నో-ఏడేడు జన్మల విడదీయరాని సంబంధమయ్యా అంటూనే,ఆయన
"పొట్రామరై ఆడియే పోట్రుం" ఉండవయ్యా ముందు నీ పాదపద్మములకు మంగళాశాసనములను పాడనీ" తరువాతనే నీ ప్రశ్నలు-సమాధానాలు అంటూ,స్వామిని సేవిస్తూనే
నీవు మాసపరిచర్యలను కాదనటానికి /స్వీకరించను అనటానికి/సేవానుగ్రహమును ఈయననటానికి మేము ఒప్పుకోము సుమా!
పొరుల్-కారనమును మేము చెబుతాము.
కేళే-నీవు విను అని అంటున్నారు.
ద్వైతము బాహ్యమునకు మాత్రమే.అక్కడ అంతా ఒక్క స్వరూపమే. అందుకే స్వామి మాట్లాడుతుంటే గోపికలు వింటూన్నారు.గోపికల మాటలను స్వామిని వినమటున్నారు.
స్వామి నీవు,
పెత్రుం మెయుదు-పశుకాపరుల కులదీపానివి.
మేమును
ఆయర కులత్తిల్ పిరందు-పశువుల కాపరులమే.
కాని ఒక మనమధ్య ఒక వ్యస్త్యాసముందయ్యా సామి.
నీవు సకలచరాచర భవబంధ పశువుల కాపరివి.మేము గోకులములోని పశువులను కాచేవారము.కనుక మా సపరిచర్యలను
"ఎంగళికి కుట్రేవల్-త్రికరణ శుధ్ధిగ గోవింద-గోవింద-గోవింద అంటు వాక్క్కుతో,శిట్రం శిరుక్కాలే-ఇంకా తెల్లవారక ముందే నిదురలేచి ఎప్పుడెప్పుడు నిన్ను చూద్దామా అనే మనసుతో.నిన్ను సర్వాంగ సుందరముగా ముస్తాబు చేయాలనే కాయముతో నున్న మా సేవానిరతిని,
కొల్లామల్-స్వీకరించ్కుండా-మమ్ములను అనుగ్రహించకుండా,పోరాదు సుమా!
ఒకవేళ పొరబాటున ,
'మాట్రినం కాంగళ్ మాట్రేలో"
ఇతర కోరికలు మాలోనికి ప్రవేశించాలని చూసిన వాటిని మాట్రేలో-రానీయకు.ఎందుకంటే మేము
నీ ఒక్కనికే-ఒకే ఒక ఒక్కనికే,
అత్చెయుం-స్వచ్చంద బానిసలము కనుక,
ఆ ఒకే ఒక కోరిక తప్ప మాకు ఇంకేమి కోరికలు లేవు అని అంటున్నారు వశీకరణావస్థలోనున్న గోపికలు ఆ వంశీధరునితో
వారి పరస్పర నయనములు పరమసేవా సౌభాగ్యత్వమును పలుకరించుకున్నవి.పులకరించుచున్నవి.అభ్యర్థించుచున్నవి-అనుగ్రహించుచున్నవి.అధీనమైనవి-ఆధేయమైనవి.ఇదే అదను అని అరక్షణము ఆలస్యము చేయక,"ఆంతరంగిక సేవా భాగ్యమును" అనుగ్రహింపమని అర్థించారు గోపికలు.వారు నయనము-స్వామి చూపు.ఆ చల్లని చూపును అటు ఏడుతరములు-ఇటు తరములు ప్రసరింపనీయమని ప్రాధేయ పడ్డారు.స్వామిని వారు,
అంతే కాదు "కొల్లామల్" స్వీకరించను అనుటలు వీలు లేదు.కాసేపు కస్తురి కుంకుమగా మారి నీ నుదుటను నిలుస్తాము.మరొకరి ఆ కసురిని నీ ఫాలభాగమున అలంకరించువారమౌతాము.ఒకపరి కౌస్తుభమణిగా మారి నీ వక్షస్థలమున లక్షనమై ఉంటాము.మరొకపరి ప్రేమతో దానిని నీ కు అలంకరిస్తాము.ఒకరోజు నాసాగ్ర మౌక్తికమవుతాము.మరొకసారి దానిని నీకు ధరింపచేస్తాము.అంతే కాదు కృషనా.నా సఖి వేణువవుతుంది.నేను నీ పెదవి చేరుతాను.మరొకచెలి నాదముగా నర్తిస్తుంది.ఎల్లప్పుడు మమ్ములను నీతోనే నిలుపుకుంటావన్న నీ మాటను గుర్తుచేస్తూ నేను నీ ముంజేతి కంకణమవుతాను.ఇంకా తనివి తీరటము లేదు.ఆగు కృష్ణా.స్వామి కొంచము సమయమునిస్తే అందరము కలిసి ఆలోచిచుకొని ఆఖరిసారిగా ఒకే ఒక సౌభాగ్యమును అర్థిస్తాము అన్నారు గోపికలు.ఏమనగలడు వారి ఎడదనెరిగినవాడు?కాదనగలడా? కామినుల వీడి కదలగలడా?కటాక్షించటమే కాని ఇతరము తెలియనివాడు.ఇదిగో చెబుతున్నాము వినుము.
మేమందరము దివ్య హరిచందనమై నీ దేహమున ఒదిగి,దిగంత దివ్యపరిమళములను వెదజల్లుతుంటామని స్వామిని హత్తుకున్నారు.
"కస్తూరి తిలకం లలాటఫలకే
వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవ మౌక్తికం
కరతలే వేణుం
కరే కంకణం
సర్వాంగే హరిచందనంచ కలయం
కంఠేశ ముక్తావళి
గోపస్త్రీ పరివేష్ఠితుడైనాడు గోవిందుడు.
(ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం..)
"కస్తూరి తిలకం లలాటఫలకే
వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవ మౌక్తికం
కరతలే వేణుం
కరే కంకణం
సర్వాంగే హరిచందనంచ కలయం
కంఠేశ ముక్తావళి
గోపస్త్రీ పరివేష్ఠితుడైనాడు గోవిందుడు.
(ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం..)
No comments:
Post a Comment